newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

కొరియా విధానంతోటే కరోనా కట్టడి.. కేంద్ర ఆరోగ్యమంత్రి సూచన

28-04-202028-04-2020 09:08:38 IST
Updated On 28-04-2020 09:49:48 ISTUpdated On 28-04-20202020-04-28T03:38:38.538Z28-04-2020 2020-04-28T03:38:36.722Z - 2020-04-28T04:19:48.340Z - 28-04-2020

కొరియా విధానంతోటే కరోనా కట్టడి.. కేంద్ర ఆరోగ్యమంత్రి సూచన
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న క్రమంలో వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త వ్యూహాలను అనుసరిస్తోంది. ఇప్పటి వరకు కేవలం వైరస్‌ బారినపడిన, అనుమానితులకు మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయినా కూడా వైరస్‌ వ్యాప్తిని కట్టడిచేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో నాలుగంచెల వ్యూహంతో కరోనా సోకిన వారిని గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్‌ నియంత్రణకు దక్షిణ కొరియా అనుసరించిన విధానాలను అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. 

ఈ అంశంపై పలు విషయలను కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి హర్షవర్థన్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు. దేశంలో కరోనా వైరస్‌ను అరికట్టేందుకు సరికొత్త విధానాలను అనుసరించాలని కేంద్రప్రభుత్వం సంకల్పించిందని మంత్రి తెలిపారు. దీనిలో భాగంగానే వైరస్‌ లక్షణాలు ఉన్న వారిని గుర్తించడం (ట్రేస్‌) పరీక్షలు నిర్వహించడం (టెస్ట్‌) క్వారెంటైన్‌కు పంపడం (ఐసోలేషన్‌) వైద్య చికిత్స అందించడం (ట్రీట్‌) లాంటి వ్యూహాన్ని అమలుపరుస్తున్నట్లు హర్షవర్ధన్‌ వెల్లడించారు. దీని వల్లన వైరస్‌ వ్యాప్తిని అరికట్టవచ్చని అభిప్రాయపడ్డారు. 

అలాగే నగర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కరోనా పరీక్షలు నిర్వహించాలని కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చినట్లు కేంద్రమంత్రి తెలిపారు. మే చివరి నాటికి రోజుకు లక్ష పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కరోనాను కట్టడి చేసేందుకు కేంద్రం అమలు చేస్తున్న విధానాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని, లాక్‌డౌన్‌, సామాజిక దూరంతోనే పూర్తిగా అంతం చేయగలమని అన్నారు.

కాగా దక్షిణ కొరియా ఎలాంటి కఠిన చర్యలు పాటించకుండానే విజయవంతంగా కోవిడ్‌19 మహమ్మారిని తమ దేశంలో నిరోధించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 29న దక్షిణ కొరియాలో అత్యధికంగా 909 కేసులు నమోదు కాగా, మార్చి 17 నాటికి ఇది 74 కేసులకు తగ్గింది. పెద్ద ఎత్తున వైరస్‌ బాధితులను గుర్తించి పరీక్షలు నిర్వహించడంలో ఆ దేశం విజయవంతం అ‍య్యింది. ఈ నేపథ్యంలో ఆ దేశం అనుసరించిన విధానాల వైపు ప్రపంచ దేశాలన్నీ చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌ కూడా అదే బాటలో నడవాలని భావించింది. 

కొరియా విధాన అమలులో ఏపీ ముందంజ

టెస్టులతోనే కరోనాపై నూటికి నూరుపాళ్లు విజయం సాధించిన దక్షిణ కొరియా విధానాన్ని దేశంలో భారీస్థాయిలో ఆచరిస్తున్న తొలి రాష్ట్రంగా ఏపీ నిలిచింది. కేంద్రం ఈ అంశంపై ఒక స్పష్టమైన విధానం తీసుకోకముందే దక్షిణ కొరియానుంచి లక్ష కరోనా ర్యాపిడ్ టెస్టు కిట్లను వారం క్రితమే తెప్పించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీలైనన్న టెస్టులు జరిపించాలని నిర్ణయించుకుంది. దీంతో దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ జరగనంత అధిక టెస్టులు ఇప్పుడు ఏపీలో జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే కేసుల సంఖ్య కూడా పెరగడం గమనార్హం.

దక్షిణ కొరియాలో అధిక టెస్టులు జరిపారు.. ఒకదశలో రోజుకు 800 కేసులు నమోదయ్యేవి, పాజిటివ్‌ కేసులు పెరిగినా వెరవకుండా కొనసాగించారు.. క్వారంటైన్‌లో చికిత్స అందించి వైరస్‌ వ్యాప్తిని అరికట్టారు.. ఏపీలోకూడా అధిక టెస్టులు నిర్వహించడమే కరోనా వ్యాప్తి కట్టడికి మార్గమని విధాన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు 74,551 టెస్టులను నిర్వహించారు.  దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ లేనంతగా రోజుకు 1,396 టెస్టులు ఏపీ నిర్వహించడం విశేషం. పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నట్లు అనిపిస్తున్నా.. దక్షిణ కొరియాలో మాదిరిగానే వైరస్‌ వ్యాప్తి అదుపులోకొస్తుందని, త్వరలోనే కేసులూ తగ్గుతాయని అంటున్నారు.

భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలన్నీ కరోనాను అరికట్టడంలో ప్రపంచ దేశాలన్నీ ప్రస్తుతం దక్షిణ కొరియా వైపు చూస్తున్నాయి. వేగంగా విస్తరిస్తున్న వైరస్‌ను లాక్‌డౌన్‌ లేకుండా అరికట్టడంలో విజయం సాధించడమే ఇందుకు కారణం. ఇందుకు ఆ దేశం పాటించిన విధానం ‘టెస్ట్ట్‌’. కరోనా ఉన్న వ్యక్తి, అతని కాంటాక్టులను సాంకేతికతతో  గుర్తించి, టెస్టులు చేసి స్వల్ప కాలంలోనే కరోనా ఉధృతికి అడ్డుకట్ట వేసింది. ఇప్పుడు ఇదే విధానాన్ని మన రాష్ట్రం కూడా అవలంబిస్తోందని కోవిడ్‌–19 నోడల్‌ ఆఫీసర్‌ జె.సుబ్రమణ్యం చెబుతున్నారు.

దక్షిణ కొరియాలో ఏం జరిగింది? 

దక్షిణ కొరియాలో  తొలి కేసు జనవరి 19న నమోదయ్యింది. ఫిబ్రవరి 18 వరకు కేవలం 30 కేసులు మాత్రమే నమోదయ్యాయి. తర్వాత కేవలం పది రోజుల్లోనే 2,300కు పెరిగిన కేసుల సంఖ్య. దీనికి కారణం 31వ షేషెంట్‌ అనేకమంది వ్యాప్తి చేయడమే. దీంతో అప్రమత్తమై వైరస్‌ విస్తరణ కంటే వేగంగా టెస్టులు చేయాలని నిర్ణయం. ఇందుకోసం డెబిట్‌ కార్డులు, సెల్‌ ఫోన్, సీసీ కెమెరాల సహాయంతో సాంకేతిక పరిజ్ఞానంతో కాంటాక్ట్‌ వ్యక్తులందరికీ పరీక్షలు నిర్వహించింది. టెస్టుల సంఖ్య పెంచడంతో ఒకే రోజు ఏకంగా 800 పైగా కేసులు నమోదయ్యేవి. పాజిటివ్‌ వచ్చినవారిని క్వారంటైన్‌ చేసి చికిత్స అందించింది. మార్చి నెలాఖరుకల్లా కరోనా అదుపులోకి వచ్చింది. కేసుల సంఖ్య 100కి పడిపోయి, ఇప్పుడు సింగిల్‌ డిజిట్‌కు పరిమితమైంది. 

ఏపీలో అమలు విధానం

రాష్ట్రంలో మార్చి 12న తొలి కరోనా కేసు నెల్లూరు జిల్లాలో నమోదైంది. ఏప్రిల్‌ మొదటి వారం నుంచి కేసుల సంఖ్య పెరగడం ప్రారంభమైంది. తర్వాత ఢిల్లీ నుంచి వచ్చిన వారితో వైరస్‌ విజృంభించింది. అప్రమత్తమైన ప్రభుత్వం ఢిల్లీ వెళ్లొచ్చిన వారు, వారితోపాటు ప్రయాణించిన వారి వివరాలు సేకరించి, క్వారంటైన్‌కు పంపి టెస్టులు నిర్వహించింది. రాష్ట్రంలో టెస్టు కిట్ల తయారీకి తోడు దక్షిణ కొరియా నుంచి కిట్లు దిగుమతి చేసుకుంది.  వైరస్‌ వచ్చిన వారి ఫస్ట్‌ కాంటాక్ట్‌తో పాటు, వారు కలిసిన అందరినీ గుర్తించి పరీక్షలు నిర్వహిస్తోంది.  ఒక మండలంలో నాలుగు కంటే ఎక్కువ కేసులు నమోదు అయితే రెడ్‌ జోన్‌గా ప్రకటించి కట్టడి చేస్తోంది. రెడ్‌ జోన్లో ఉన్న అనుమానితులను వాలంటీర్లు, ఆశా వర్కర్ల సాయంతో గుర్తించి పరీక్షలు నిర్వహిస్తోంది. ఫలితంగా ప్రస్తుతం కరోనా వైరస్‌ కొత్త ప్రాంతాలకు విస్తరించడం తగ్గింది. కంటెయిన్మెంట్‌ జోన్లు, రెడ్‌ జోన్లలో విరివిగా పరీక్షలు నిర్వహించి పాజిటివ్‌ వ్యక్తులను త్వరగా గుర్తించి వ్యాప్తికి అడ్డుకట్ట వేస్తోంది. ఈ విధానం ద్వారా మే నెలలో రాష్ట్రంలో కరోనా వైరస్‌ పూర్తి అదుపులోకి వస్తుందని అంచనా.

 

అయోధ్య శ్రీరామ మందిరంపై రాజకీయ రగడ

అయోధ్య శ్రీరామ మందిరంపై రాజకీయ రగడ

   24 minutes ago


బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే లీటర్ పెట్రోలు..

బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే లీటర్ పెట్రోలు..

   5 hours ago


బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినం: అలీఘర్ పిల్లలకు విడుదల ఎప్పుడు ?

బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినం: అలీఘర్ పిల్లలకు విడుదల ఎప్పుడు ?

   20 hours ago


దేశ రాజధానిలో లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు

దేశ రాజధానిలో లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు

   13-06-2021


ఉత్తర ప్రదేశ్ మూడు ముక్కలు కానుందా..?

ఉత్తర ప్రదేశ్ మూడు ముక్కలు కానుందా..?

   13-06-2021


కరోనా ఔషధాలు, వైద్య పరికరాలకి భారీగా జీఎస్టీ తగ్గింపు

కరోనా ఔషధాలు, వైద్య పరికరాలకి భారీగా జీఎస్టీ తగ్గింపు

   13-06-2021


గత 24 గంటల్లో ఇండియాలో 84,332 కోవిడ్ కేసులు..

గత 24 గంటల్లో ఇండియాలో 84,332 కోవిడ్ కేసులు..

   13-06-2021


కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో సహాయం చేసిన దేశాలకు ధన్యవాదాలు G7 సమ్మిట్ లో PM మోడీ

కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో సహాయం చేసిన దేశాలకు ధన్యవాదాలు G7 సమ్మిట్ లో PM మోడీ

   13-06-2021


జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి..  ఇద్దరు పోలీసులు, ఒక పౌరుడు మరణించారు

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి.. ఇద్దరు పోలీసులు, ఒక పౌరుడు మరణించారు

   12-06-2021


జూన్ 26 న  రాజ్ భవన్ వద్ద  రైతుల నిరసన

జూన్ 26 న రాజ్ భవన్ వద్ద రైతుల నిరసన

   12-06-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle