newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

కొడుకు కరోనా సంగతి దాచేసిన రైల్వే అధికారిణిపై వేటు

21-03-202021-03-2020 15:16:38 IST
Updated On 21-03-2020 15:38:37 ISTUpdated On 21-03-20202020-03-21T09:46:38.576Z21-03-2020 2020-03-21T09:46:36.017Z - 2020-03-21T10:08:37.682Z - 21-03-2020

కొడుకు కరోనా సంగతి దాచేసిన రైల్వే అధికారిణిపై వేటు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మహమ్మారి కోవిడ్‌-19 వైరస్ వ్యాప్తి నేపథ్యంలో చాలా మంది ప్రజలు స్వీయ నిర్బంధంలోకి వెళ్లి తమను తాము కాపాడుకోవడంతో పాటు ఇతరులకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నారు. అయితే ఓ రైల్వే అధికారిణి మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. స్పెయిన్‌ నుంచి భారత్‌కు వచ్చిన తన కుమారుడి వివరాలు దాచిపెట్టారు. విషయం తెలుసుకున్న వైద్యాధికారులు అతడికి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో నిర్లక్ష్యంగా వ్యవరించిన సదరు అధికారిణిని రైల్వే శాఖ శుక్రవారం సస్పెండ్‌ చేసింది. 

వివరాల్లోకి వెళితే బెంగళూరుకు చెందిన ఓ మహిళ రైల్వే శాఖలో పనిచేస్తున్నారు. ఆమె కొడుకు(25) ఇటీవలే స్పెయిన్‌ నుంచి భారత్‌ వచ్చాడు. మార్చి 13న కెంపెగౌడ విమానాశ్రయంలో దిగిన తర్వాత అతడికి టెస్టులు నిర్వహించగా.. కరోనా లక్షణాలు బయటపడ్డాయి. దీంతో అతడిని గృహ నిర్బంధంలోకి వెళ్లాల్సిందిగా సూచించారు. 

ఈ క్రమంలో అతడి తల్లి.. సదరు వ్యక్తిని ఇంటికి తీసుకువెళ్లకుండా రైల్వే శాఖకు చెందిన గెస్ట్‌హౌజ్‌లో ఉంచారు. అక్కడున్న వారికి అతడికి కరోనా సోకిన విషయం చెప్పకుండా దాచిపెట్టారు. ఈ క్రమంలో అతడి తీరుపై అనుమానం వచ్చిన కొంత మంది వ్యక్తులు నిలదీయగా అసలు విషయం బయటపెట్టాడు. 

ఈ విషయం గురించి రైల్వే సీనియర్‌ అధికారి ఒకరు మాట్లాడుతూ..‘‘ తన కొడుకు, కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం.. ఆమె ఇతరుల జీవితాలను ఆపదలోకి నెట్టారు. ఆమెను సస్పెండ్‌ చేశాం’’ అని పేర్కొన్నారు. గెస్ట్‌హౌజ్‌లో అతడిని కలిసిన వాళ్లకు ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 

కాగా దేశంలో మొదటిసారిగా కర్ణాటకలో కరోనా తొలి మరణం నమోదైన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం అక్కడ 16 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. దాదాపు 100 మంది ఐసోలేషన్‌ వార్డుల్లో ఉన్నారు.  

రైల్వేలో అసిస్టెంట్ పర్సనల్ ఆపీసర్ అయిన ఆమె ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి కుమారుడిని రైల్వే గెస్ట్ హౌస్‌లో ఉంచడం సోషల్ మీడియాలో ఆగ్రహాశాలను రగిలిస్తోంది. కాగా తన కుమారుడిని కాపాడుకోవడం కోసం ఆమె తీసుకున్న విచక్షణా రహితమైన చర్య కారణంగా రైల్వే శాఖలో అందరి ప్రాణాలకూ ముప్పు తీసుకొచ్చారని  వాయవ్య  రైల్వే అధికారి ఒకరు వాపోయారు.

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   4 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   4 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   7 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   15 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle