newssting
BITING NEWS :
*దేశంలో 20 లక్షల 25 వేల 409 కేసులు.. మరణాలు 41,638*విశాఖ: నేటి నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు వ్యాలీలో సంపూర్ణ లాక్డౌన్.వ్యాపార,వర్తక సంఘాలు నిర్ణయం.మూతపడనున్న ప్రైవేట్ హోటళ్లు*కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మంత్రి కేటీఆర్ లేఖ‌.. వాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల విషయంలో మరింత వికేంద్రీకరణ అవ‌స‌రం.. కోవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి-కేటీఆర్*అనంతపురం : తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద జైలు నుంచి బెయిలుపై విడుదలైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు... కాన్వాయ్ కు అనుమతి లేదంటూ అడ్డగించిన పోలీసులు.. వాగ్వాదం*తూర్పుగోదావరి : అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటీవ్.. హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి*నటుడు సుశాంత్ మరణంపై సిబిఐ కేసు నమోదు.. ప్రియురాలు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు*మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన బిజెపి ఏపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు... ఎపి బిజెపి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు అభినందనలు తెలిపిన చిరంజీవి*రామలింగారెడ్డి భార్యకే ఉపఎన్నికలో టికెట్ ఇవ్వాలి.. ఆమెకు టికెట్ ఇస్తేనే ఆయనకు నిజమైన నివాళి.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్‌తో నేను మాట్లాడతా-జ‌గ్గారెడ్డి*నల్లగొండ జిల్లా: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమా నిలిపివేయాలంటూ అమృత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈనెల 11కు వాయిదా వేసిన కోర్టు*విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు*తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,092 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 73,050కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

కేరళలో ఖైదీలు ఏంచేస్తున్నారో తెలుసా?

16-03-202016-03-2020 09:33:44 IST
Updated On 16-03-2020 09:34:25 ISTUpdated On 16-03-20202020-03-16T04:03:44.972Z16-03-2020 2020-03-16T04:01:48.932Z - 2020-03-16T04:04:25.598Z - 16-03-2020

కేరళలో ఖైదీలు ఏంచేస్తున్నారో తెలుసా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశవ్యాప్తంగా కరోనా భయం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. చైనాలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. దాని ప్రభావం పక్కనే వున్న దేశాలపై పడింది. మనదేశంలో కరోనా అనుమానితుల సంఖ్య 107కి చేరింది. దీంతో కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించిన సంగతి తెలిసిందే.  ఈ మహమ్మారిని నిరోధించడానికి స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి ఖర్చు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతించింది. తొలుత కరోనా మృతులకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా, రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిన మేరకు వైద్య ఖర్చులు చెల్లించడానికి అనుమతిచ్చిన కేంద్రం వెంటనే ఆ రెండింటినీ తొలగిస్తూ మరో ఉత్తర్వులు జారీ చేసింది.

Image may contain: possible text that says 'Pinarayi Vijayan @vijayanpinarayi #COVID19 I Solving The Mask Problem In light of the shortage, directions were given to engage the prisons in the State in manufacturing masks. It has has commenced on a war war footing basis. Today, the Prison officials of Thiruvananthapuram Jail have handed over the first batch.'

క్వారంటైన్‌లో ఉన్న కరోనా అనుమానితులకు 30 రోజుల వరకు ఆహారం, వస్త్రాలు, వైద్యసేవలు అందించడానికి ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులు వాడుకోవచ్చని అనుమతిచ్చింది. పరిస్థితులకు అనుగుణంగా ఈ గడువును పెంచుకోవచ్చని తెలిపింది. వీటిపై చేసే వ్యయం ఎస్‌డీఆర్‌ఎఫ్‌ వార్షిక కేటాయింపుల్లో 25 శాతానికి మించకూడదు. . కేంద్రం జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం.. అత్యవసర వస్తువుల కొనుగోలు, అదనపు ల్యాబ్‌ల ఏర్పాటు, వైద్య, మున్సిపల్, పోలీసు, అగ్నిమాపక దళ సిబ్బంది రక్షణ కోసం ఉపయోగించే వస్తువులు, థర్మల్‌ స్కానర్లు, వెంటిలేటర్లు, ఎయిర్‌ ప్యూరిఫయర్లు, ప్రభుత్వ ఆసుపత్రిలో ఉపయోగించే వస్తువుల కోసం వ్యయాన్ని అంతా ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నుంచి మాత్రమే చేయాలి.

ఇదిలా వుంటే.. కరోనా బాధితులకు అమెరికా వైద్యులు తీపి కబురు అందించారు. కరోనా వైరస్ నివారణకు వీలుగా అమెరికా కొత్తగా వ్యాక్సిన్‌ను కనుగొన్నట్టు ప్రకటించింది. అమెరికాలోని సీటెల్ నగరంలోని కైజర్ పర్మినెంట్ వాషింగ్టన్ హెల్త్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో కరోనా వైరస్ వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షలు సోమవారం ప్రారంభించారు.

కరోనా వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షల కోసం అమెరికా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నిధులు సమకూర్చింది. కరోనా వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షలు పూర్తి చేసి పూర్తిగా ధ్రువీకరించడానికి ఏడాది నుంచి 18 నెలల సమయం పడుతుందని అమెరికా ప్రజారోగ్యశాఖ అధికారులు చెప్పారు. కరోనా వ్యాక్సిన్‌ను ఆరోగ్యంగా ఉన్న 45 మంది యువ వాలంటీర్లకు ఇచ్చి పరీక్షించనున్నారు. ఈ కరోనా టీకాల వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని అమెరికా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇటు కేరళలో  ఖైదీలతో కరోనా నివారణకు ఉపయోగించే మాస్కులు తయారు చేయిస్తోంది  ప్రభుత్వం. దేశవ్యాప్తంగా కరోనా కేసులు ఎక్కువగా కనిపించిన రాష్ట్రం కేరళ. దీంతో దేశంలో కరోనా వైరస్ ప్రవేశించిన తర్వాత త్వరగా స్పందించి నివారణ చర్యలు, బాధితులకు చికిత్స ప్రారంభించింది కేరళ ప్రభుత్వమే. కాగా, కరోనా భయంతో ప్రజలందరూ మాస్కులను భారీ ఎత్తున కొనుగోలు చేస్తుండటంతో మార్కెట్లో మాస్కుల కొరత భారీగా ఏర్పడింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ జైళ్లలో ఉన్న ఖైదీలతో మాస్కులు తయారు చేయిస్తున్నట్లు ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. 

‘ప్రస్తుతం మాస్కుల కొరత నెలకొన్న నేపథ్యంలో.. తగినన్ని మాస్కులు తయారు చేయాలంటూ రాష్ట్రంలోని జైళ్లను ఆదేశించాము. యుద్ధ ప్రాతిపదికన మాస్కుల ఉత్పత్తి ప్రారంభమైంది. ఇప్పటికే తిరువనంతపురం జైలు అధికారులు తొలి బ్యాచ్ మాస్కులను ప్రభుత్వానికి అందజేశారు’ అని ఆయన పోస్ట్ చేశారు. వాటి ఫోటోలను ట్విటర్‌లో పంచుకుంటూ..‘ మాస్కుల కొరతను తగ్గిస్తూ’ అనే ట్యాగ్ కూడా జత చేశారు. మొత్తం మీద కరోనా వైరస్‌ను పారద్రోలేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమవంతు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. 

కేరళలో వర్షబీభత్సం...  కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

కేరళలో వర్షబీభత్సం... కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

   8 hours ago


ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

   11 hours ago


గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

   15 hours ago


చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

   17 hours ago


దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

   19 hours ago


కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

   19 hours ago


ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

   20 hours ago


మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

   06-08-2020


కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

   06-08-2020


యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

   06-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle