newssting
BITING NEWS :
*దేశంలో 20 లక్షల 25 వేల 409 కేసులు.. మరణాలు 41,638*విశాఖ: నేటి నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు వ్యాలీలో సంపూర్ణ లాక్డౌన్.వ్యాపార,వర్తక సంఘాలు నిర్ణయం.మూతపడనున్న ప్రైవేట్ హోటళ్లు*కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మంత్రి కేటీఆర్ లేఖ‌.. వాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల విషయంలో మరింత వికేంద్రీకరణ అవ‌స‌రం.. కోవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి-కేటీఆర్*అనంతపురం : తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద జైలు నుంచి బెయిలుపై విడుదలైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు... కాన్వాయ్ కు అనుమతి లేదంటూ అడ్డగించిన పోలీసులు.. వాగ్వాదం*తూర్పుగోదావరి : అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటీవ్.. హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి*నటుడు సుశాంత్ మరణంపై సిబిఐ కేసు నమోదు.. ప్రియురాలు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు*మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన బిజెపి ఏపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు... ఎపి బిజెపి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు అభినందనలు తెలిపిన చిరంజీవి*రామలింగారెడ్డి భార్యకే ఉపఎన్నికలో టికెట్ ఇవ్వాలి.. ఆమెకు టికెట్ ఇస్తేనే ఆయనకు నిజమైన నివాళి.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్‌తో నేను మాట్లాడతా-జ‌గ్గారెడ్డి*నల్లగొండ జిల్లా: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమా నిలిపివేయాలంటూ అమృత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈనెల 11కు వాయిదా వేసిన కోర్టు*విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు*తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,092 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 73,050కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

కేజ్రీవాల్‌కు నెగిటివ్.. ఢిల్లీలో కరోనా టెర్రర్

10-06-202010-06-2020 09:55:04 IST
2020-06-10T04:25:04.144Z10-06-2020 2020-06-10T04:24:36.612Z - - 07-08-2020

కేజ్రీవాల్‌కు నెగిటివ్.. ఢిల్లీలో కరోనా టెర్రర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌కు వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఆయన సెల్ఫ్ క్వారంటైన్ అయిన సంగతి తెలిసిందే.  కేజీవ్రాల్‌ నుంచి వైద్యులు నమూనాలు సేకరించారు. అనంతరం ఆయనకు కరోనా నెగిటివ్ వచ్చింది.  టెస్ట్ అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి స్వల్పంగా మెరుగు పడినట్టు వార్తలు  వచ్చాయి. స్వల్ప జ్వరం, గొంతు నొప్పికి గురైన ఆయన సెల్ఫ్ ఐసోలేషన్ కి వెళ్లారు.

కాగా.. ఆయనకు నెగెటివ్ అని తెలియగానే ఆప్ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ‘ముఖ్యమంత్రి ఆరోగ్యం బాగాలేదని, స్వీయ నిర్బంధంలోకి వెళ్లారని, దగ్గు, గొంతు నొప్పితో బాధపడుతున్నారని’ ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, సామాజిక వ్యాప్తి, పైవేట్‌ దవాఖానాలపై చర్చించడానికి మనీశ్‌ సిసోడియా నేతృత్వంలో మంత్రిమండలి సమావేశం జరిగింది.

ఢిల్లీలో కరోనా కేసులతో వణికిపోతోంది. కరోనా వ్యాప్తి ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదు. పైగా జూలై 31 కల్లా ఢిల్లీలో కరోనా కేసులు ఐదున్నర లక్షలకు చేరుతాయని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ప్రకటించడంతో అంతా ఆందోళన చెందుతున్నారు. ఢిల్లీ లెప్టెనెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఏర్పాటు చేసిన కరోనా సమీక్షా సమావేశంలో పాల్గొన్న సిసోడియా ఈ సంఖ్య ప్రకటించారు.

అయితే సామాజిక వ్యాప్తి ఢిల్లీలో జరగడం లేదన్నారాయన. ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో  3700 మందికి కరోనా టెస్టులు చేయగా 1007మంది కరోనా పాజిటివ్ వచ్చింది. అంటే సుమారు 27 శాతం మందికి కరోనా మహమ్మారి సోకినట్టు తేలింది. ఆ శాతం మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతుండటంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

జ్యోతిరాదిత్య సింధియాకు కరోనా పాజిటివ్

బీజేపీ కీలక నేత జ్యోతిరాధిత్య సింధియా కరోనా వైరస్ బారినపడ్డారు. కరోనా లక్షణాలు కనిపించడంతో దక్షిణ ఢిల్లీలోని మ్యాక్స్ హాస్పిటల్‌లో కరోనా టెస్టులు చేయించుకున్నారు. సింధియాకు కోవిడ్19 పాజిటివ్‌ వచ్చింది. ఆయనతో పాటు తల్లి మాధవి రాజే సింధియాకు సైతం  కరోనా లక్షణాలు కనిపించాయి.

అయితే ఆయన తల్లి మాధవి రాజే సింధియాకు కోవిడ్19 లక్షణాలు లేవని తెలుస్తోంది.  బీజేపీ ఎంపీ జ్యోతిరాధిత్య సింధియా ఈ ఏడాది బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్ లో  కాంగ్రెస్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ ఆయన బీజేపీలో చేరారు. దీంతో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ తన బలాన్ని కోల్పోయిందని చెప్పవచ్చు. ఈ క్రమంలో తాజాగా సింధియాకు కరోనా లక్షణాలు కనిపించడంతో కుటుంబసభ్యులు టెస్టులకు వెళ్లారు. 

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

   2 hours ago


దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

   4 hours ago


కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

   4 hours ago


ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

   5 hours ago


మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

   06-08-2020


కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

   06-08-2020


యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

   06-08-2020


కరోనా రోగులకు గుడ్ న్యూస్.. సన్ ఫార్మా ట్యాబ్లెట్ @Rs 35

కరోనా రోగులకు గుడ్ న్యూస్.. సన్ ఫార్మా ట్యాబ్లెట్ @Rs 35

   05-08-2020


మొన్న నేపాల్.. నిన్న పాకిస్తాన్.. భారత్ మ్యాప్‌నే మార్చేశాయి

మొన్న నేపాల్.. నిన్న పాకిస్తాన్.. భారత్ మ్యాప్‌నే మార్చేశాయి

   05-08-2020


మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

   05-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle