newssting
BITING NEWS :
ఎన్డీయేతో బంధం తెంచుకున్న అకాలీదళ్. కేంద్రం తీసుకొచ్చిన బిల్లులకు వ్యతిరేకంగా అకాలీదళ్ నిర్ణయం. ఈ బిల్లుల ప్రభావం రైతులు, దళితులు, రైతు కూలీల అందరిపై పడిందని తెలిపిన అకాలీదళ్ చీఫ్ సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ప్రకటన. శనివారం పార్టీ నిర్వహించిన మూడు గంటల ఎమర్జెన్సీ కోర్ కమిటీ సమావేశం అనంతరం నిర్ణయం. 23 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ బంధాన్ని తెగతెంపులు చేసుకున్న అకాలీదళ్ * బాలీవుడ్‌ వివాదాస్పద నటి కంగనా రనౌత్‌పై కర్ణాటకలోని తుమకూరు కోర్టులో కేసు దాఖలు. కేంద్ర ప్రభుత్వ రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులను ఉగ్రవాదులతో పోల్చుతూ ట్వీట్‌ చేయడాన్ని తప్పుబడుతూ తుమకూరు జేఎంఎఫ్సీ కోర్టులో రమేశ్‌ నాయక్‌ అనే న్యాయవాది పిటిషన్‌ దాఖలు * అత్యంత ప్రతిష్టాత్మకమైన ఢిల్లీలోని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఎన్‌ఎల్‌యూ వైస్‌ చాన్సలర్‌గా వరంగల్‌ జిల్లాకు చెందిన ప్రొఫెసర్‌ పి.శ్రీకృష్ణదేవరావు నియామకం. ప్రస్తుత వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ రణబీర్‌ సింగ్‌ పదవీ విరమణ చేయడంతో శ్రీకృష్ణదేవరావు నియామకం. దేశంలోని పలు విశ్వవిద్యాలయాలలో కీలక బాధ్యతలు నిర్వహించిన శ్రీకృష్ణదేవరావు న్యాయ విద్యలో మార్పులు తీసుకువచ్చేందుకు యూజీసీ నియమించిన నిపుణుల కమిటీలో కూడా ఆయన సభ్యుడిగా కూడా పనిచేశారు * శివసేన నేత, లోక్ సభ సభ్యుడు సంజయ్‌ రౌత్‌, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఓ స్టార్ హోటల్ లో రహస్యంగా భేటీ అయినట్టు గుప్పుమన్న వార్తలు. ఓ లగ్జరీ హోటల్‌ లో సుమారు గంటన్నర పాటు వీరిమధ్య చర్చలు జరిగినట్టు సమాచారం. దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన ఈ సమావేశం వార్తలు. ఈ సమావేశం నిజమేనని, దీని వెనుక రాజకీయ కారణాలు లేవని స్పష్టం చేసిన బీజేపీ * అమెరికాలోని హిందూఆధ్యాత్మిక గురువు స్వామి ప్రత్యాగ్‌బోధానంద కన్నుమూత. పెన్సిల్వేనియాలో అర్ష విద్యా గురుకులానికి ఉపాధ్యక్షులుగా ఉన్న ప్రత్యాగ్‌బోధానంద వయసు 69 సంవత్సరాలు. గురుకులం 34వ వార్షిక ఉత్సవాల్లో పాల్గొన్న తర్వాత తీవ్రమైన గుండెపోటు రావడంతో ఈనెల 20తేదీన తుదిశ్వాస విడిచినట్టు తెలిపిన ఆయన శిష్యులు. ప్రత్యాగ్‌బోధానంద పార్థివదేహాన్ని భారత్‌కు తరలింపుకు ప్రయత్నాలు * పార్లమెంటు ఆమోదించిన మూడు వ్యవసాయ బిల్లులకి వ్యతిరేకంగా పంజాబ్‌లో కొనసాగుతున్న రైల్‌ రోకో ఆందోళన. గత మూడు రోజులుగా రైతులు రైలు పట్టాలపై కూర్చొని నిర్వహిస్తున్న రైల్‌ రోకో. తొలుత కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్ష్ కమిటీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తే, ఆ తర్వాత మద్దతు ప్రకటించిన వివిధ సంఘాలు * బాలీవుడ్‌ పరిశ్రమలో కలకలం సృష్టిస్తున్న డ్రగ్స్‌ వ్యవహారం. దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్‌, సారా అలీఖాన్‌ నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో ఎదుట శనివారం హాజరు. వేర్వేరుగా ఐదు గంటలకు పైగా కొనసాగిన విచారణ. నటీమణుల వాగ్మూలాన్ని రికార్డు చేసిన ఎన్సీబీ * ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రలలో పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలు శుక్రవారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు కురిసిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో అక్కడక్కడా నిలిచిన రాకపోకలు. పలుచోట్ల నీటమునిగిన పంట పొలాలు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లా నందిగామలో 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు * అక్టోబరు 1 నుంచి సినిమా థియేటర్లు తెరిచేందుకు అనుమతినిచ్చిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం. ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా తెలియజేసిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. పరిస్థితులను గాడిలో పెట్టేందుకు అక్టోబరు 1 నుంచి సినిమా థియేటర్ల తెరిచేందుకు అనుమతినిస్తున్నామని, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, మ్యాజిక్ షోలు నిర్వహించేందుకు కూడా అనుమతినిస్తున్నామని ట్వీట్ * నెల్లూరు జిల్లాలో ఇటీవల జరిగిన రౌడీషీటర్ దారుణ హత్య మరువక ముందే చోటు చేసుకున్న మరో ఘటన. చిల్లకూరు మండలం కలవకకొండలో చేజర్ల సుబ్రహ్మణ్యం(38) అనే వ్యక్తి దారుణ హత్య. ఆదివారం ఉదయం అతి కిరాతకంగా చంపేసిన గుర్తు తెలియని వ్యక్తులు. సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు * సంగారెడ్డిలో వాగు దాటుతున్న వ్యక్తి వరద నీటిలో గల్లంతు. భారీ వర్షాలకు వాగు దాటుతున్న ముగ్గరు వ్యక్తులు గల్లంతవ్వగా ఇద్దరు వ్యక్తులను ఒడ్డుకు చేర్చిన స్థానికులు. కంగ్టి మండలం జంగి బికి చెందిన 55 ఏళ్ల మంగలి మారుతి కాకి వాగు వరద ఉధృతిలో గల్లంతు. మారుతి ఆచూకీ కోసం మండల రెవెన్యూ అధికారుల గాలింపు చర్యలు.

కిమ్ జోంగ్ అనారోగ్యంపై వదంతులు.. నిజం కాదన్న దక్షిణ కొరియా

22-04-202022-04-2020 08:57:06 IST
Updated On 22-04-2020 10:00:11 ISTUpdated On 22-04-20202020-04-22T03:27:06.996Z22-04-2020 2020-04-22T03:27:04.568Z - 2020-04-22T04:30:11.305Z - 22-04-2020

 కిమ్ జోంగ్ అనారోగ్యంపై వదంతులు.. నిజం కాదన్న దక్షిణ కొరియా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ జోన్‌ ఉన్‌ ఆరోగ్యం విషమంగా ఉందన్న వార్తలు సత్యదూరమని దక్షిణ కొరియా ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. కిమ్‌ ఆరోగ్యం క్షీణించలేదని పేర్కొన్నాయి. కిమ్‌ గురించి వస్తున్న వార్తలు నిజం కాదని కొట్టిపడేశాయి. ఇందుకు సంబంధించి ఉత్తర కొరియా నుంచి ఎటువంటి అసాధారణ సంకేతాలు వెలువడటం లేదని దక్షిణ కొరియా అధ్యక్షుడి అధికార భవనం పేర్కొంది. గుండె కండరాల నొప్పితో ఆస్పత్రిలో చేరిన కిమ్‌ శస్త్ర చికిత్స చేయించుకున్నారని.. ఈ క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితి దిగజారిందని, బ్రెయిన్‌ డెడ్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ ఓ అంతర్జాతీయ మీడియా కథనం వెలువరించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో సియోల్‌ కేంద్రంగా పనిచేసే వెబ్‌సైట్‌... ఏప్రిల్‌ 12న శస్త్రచికిత్స తర్వాత కిమ్‌ ప్రస్తుతం హ్యాంగ్‌సాన్‌లోని మౌంట్‌ కుమ్‌గాంగ్‌ రిసార్టులోని విల్లాలో ఐసోలేషన్‌లో ఉన్నారని పేర్కొంది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు తెలిపింది. కాగా ఉత్తర కొరియా వ్యవస్థాపక ప్రీమియర్‌, తన తాత కిమ్‌ II సంగ్‌ జయంతి ఉత్సవాలకు కిమ్ జోంగ్ ఉన్‌ హాజరుకాని విషయం తెలిసిందే. అన్నింటా తానే ముందుండి కార్యక్రమాలు నిర్వహించే కిమ్‌ ఈ విధంగా బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండటంతో అనారోగ్యమే ఇందుకు కారణమంటూ వార్తలు ప్రచారమవుతున్నాయి. కిమ్‌ కొంతకాలంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. అనారోగ్యం కారణంగా శస్త్రచికిత్స కూడా నిర్వహించారు. దాని తరువాత కిమ్‌ బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటున్నారు.

గడిచిన నెల రోజులుగా కిమ్ జంగ్ ఉన్ ఎందుకు సైలెంటయ్యారనే విషయమై ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిత్యం తాను చేసే పనులతో వార్తల్లో నిలిచే కిమ్ జంగ్ ఉన్ ఎందుకు కనిపించడం లేదనే చర్చ ప్రపంచ వ్యాప్తంగా సాగుతోంది. అంతేకాదు అణుపరీక్షలు, క్షిపణి పరీక్షలు కానీ నిర్వహించిన దాఖలాలు లేవు. అయితే అధ్యక్షుడి ఆరోగ్య పరిస్థితిపై మాత్రం ఉత్తర కొరియా నుంచి ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. ఉత్తర కొరియాకు తొలి అధ్యక్షుడిగా వ్యవహరించిన కిమ్ ఇల్ సంగ్ జయంతి ఉత్సవాలను ప్రతి ఏటా వేడుకగా జరుపుకుంటారు. ఆ రోజును జాతీయ సెలవుదినంగా ప్రకటించడమేకాకుండా, డే ఆఫ్‌ ది సన్‌గా వ్యవహరిస్తారు. 

ఉత్తర కొరియాలో వేడుకగా జరిపే కిమ్ తాత కిమ్ ఇల్ సంగ్ జయంతి ఉత్సవాలకు కిమ్ జోంగ్ ఉన్‌ హాజరవ్వకపోవడం ప్రపంచ వార్త అయిపోయింది. కిమ్ ఇల్ సంగ్ 1948 నుంచి 1994లో మరణించే వరకు ఆయన ఉత్తర కొరియా ప్రీమియర్‌గా, అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తరువాత కిమ్ జోంగ్ ఉన్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ అధ్యక్షుడు అయ్యారు. 2011లో కిమ్ జోంగ్ ఇల్ మరణానంతరం కిమ్ జోంగ్ ఉన్ ఉత్తర కొరియా పగ్గాలు అందుకున్నారు. కిమ్‌ ఇల్‌ సంగ్‌ జయంతి సందర్భంగా కుమ్సుసన్‌ ప్యాలెస్‌ ఆఫ్‌ సన్‌లో ఆయన చేసిన సేవలను కొనియాడుతూ ఉత్తర కొరియా సీనియర్‌ అధికారులు నివాళులు అర్పించారు. అయితే ఎంతో ప్రాముఖ్యం ఉన్న ఈ కార్యక్రమానికి కిమ్ జోంగ్ ఉన్‌ హాజరుకాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. 

ముఖ్యంగా చైన్‌ స్మోకింగ్‌ చేసే కిమ్‌ ఉబకాయంతో బాధపడుతున్నారు. కిమ్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్, తాత కిమ్‌ ఇల్ సంగ్‌లు కూడా ఊభకాయులే. చైన్ స్మోకర్లు కూడా. ఆ ఇద్దరూ గుండెపోటుతోనే చనిపోయిన విషయం తెలిసిందే. 

తాజాగా దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్స్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేస్తూ ఉ. కొరియా అధ్యక్షుడు కిమ్ దేశంలోని ఒక గ్రామీణ ప్రాంతంలో సాధారణ కార్యక్రమాల్లో పాల్కొన్నట్లు తెలుస్తన్నట్లు చెప్పింది.. అయితే కిమ్ ప్రత్యేకమైన కదలికలు అయితే కనిపించడం లేదు. కిమ్ ఆరోగ్యం గురించి అంచనాలు వేసుకోలసిన అవసరంలేదని దక్షిణ కొరియా అధ్యక్షుడి ప్రతినిధి చెప్పారు.

 

అక్టోబర్ 1 నుండి సినిమా థియేటర్లు ఓపెన్

అక్టోబర్ 1 నుండి సినిమా థియేటర్లు ఓపెన్

   2 hours ago


బీజేపీ సీనియర్ నేత జశ్వంత్‌ సింగ్ ఇక లేరు ‌

బీజేపీ సీనియర్ నేత జశ్వంత్‌ సింగ్ ఇక లేరు ‌

   3 hours ago


మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్‌ ఇంకా నిరీక్షించాలా.. మోదీ విమర్శ

మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్‌ ఇంకా నిరీక్షించాలా.. మోదీ విమర్శ

   3 hours ago


గొప్ప కూతురే.. తండ్రి లూడోలో మోసం చేశాడని కోర్టుకెక్కింది

గొప్ప కూతురే.. తండ్రి లూడోలో మోసం చేశాడని కోర్టుకెక్కింది

   4 hours ago


వ్యాక్సిన్ కొనుగోలుకు 80 వేల కోట్లు అవసరం.. సీరమ్ సీఈవో వెల్లడి

వ్యాక్సిన్ కొనుగోలుకు 80 వేల కోట్లు అవసరం.. సీరమ్ సీఈవో వెల్లడి

   5 hours ago


బీహార్ ఎన్నికలకు మోగిన నగారా.. విజయమెవరిది?

బీహార్ ఎన్నికలకు మోగిన నగారా.. విజయమెవరిది?

   17 hours ago


ముగ్గురు యువతుల వ్యభిచారం కేసు.. సంచలన వ్యాఖ్యలు చేసిన బాంబే హైకోర్టు

ముగ్గురు యువతుల వ్యభిచారం కేసు.. సంచలన వ్యాఖ్యలు చేసిన బాంబే హైకోర్టు

   18 hours ago


సమష్టిగానే కట్టడి- యూరోప్ లో కరోనా సెకండ్ వేవ్ చెబుతున్నది ఇదే!

సమష్టిగానే కట్టడి- యూరోప్ లో కరోనా సెకండ్ వేవ్ చెబుతున్నది ఇదే!

   19 hours ago


తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు.. మంచికా ? చెడుకా ?

తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు.. మంచికా ? చెడుకా ?

   26-09-2020


ఆత్మనిర్భర్ తోటే భారత్ సేఫ్.. ఐఎమ్ఎఫ్ ప్రశంస

ఆత్మనిర్భర్ తోటే భారత్ సేఫ్.. ఐఎమ్ఎఫ్ ప్రశంస

   26-09-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle