newssting
Radio
BITING NEWS :
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై సస్పెన్స్‌కు తెరపడింది. బీఎస్‌ యడియూరప్ప సోమవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సాయంత్రం గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు. రాజీనామాపై ఆయన స్పందిస్తూ.. ‘‘ రాజకీయ జీవితంలో ఎన్నో అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నా. కర్ణాటక అభివృద్ధి కోసం చాలా చేశా. 75 ఏళ్లు దాటినా నాకు రెండేళ్ల పాటు అవకాశం ఇచ్చారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా’’ అని అన్నారు. * ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా సోమవారం 2,128 కోవిడ్‌ టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ అందిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల కోవిడ్‌ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. * చరిత్రలోనే మొట్టమొదటిసారి మన తెలుగు సంపద అయిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన రామప్ప ఆలయానికి ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన (పరిశోధన), సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా కోసం 2015లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. * టోక్యో ఒలింపిక్స్‌లో జపాన్‌కి చెందిన మోమిజీ నిషియా సంచలనం సృష్టంచింది. ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన రెండో అతి పిన్న వయస్కురాలిగా రికార్డు క్రియాట్‌ చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన స్కేట్‌బోర్డింగ్ లో నిషియా స్వర్ణ పతకం సాధించింది. * ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చోర్‌ బజార్‌’’. ‘దళం, జార్జ్‌ రెడ్డి’ చిత్రాల ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

కాశ్మీర్ అంశంపై యుఎన్ఓలో రహస్య భేటీ..?

16-08-201916-08-2019 11:42:46 IST
Updated On 16-08-2019 11:43:13 ISTUpdated On 16-08-20192019-08-16T06:12:46.152Z16-08-2019 2019-08-16T06:12:18.429Z - 2019-08-16T06:13:13.323Z - 16-08-2019

కాశ్మీర్ అంశంపై యుఎన్ఓలో రహస్య భేటీ..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కాశ్మీర్ అంశం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. కాశ్మీర్ కు స్వతంత్ర ప్రతిపత్తి కలిగించే ఆర్టికల్ 370 రద్దు అనంతరం పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ విషయంలో భారత్ తీరుని పాకిస్థాన్ తీవ్రంగా పరిగణిస్తోంది. తాజాగా చైనా కూడా జోక్యం చేసుకుంటున్నట్టు కనిపిస్తోంది. యునైటెడ్‌ నేషన్స్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ (యుఎన్‌ఎస్‌సి) నేడు కాశ్మీర్‌ అంశంపై రహస్య సమావేశం నిర్వహించనున్నట్టు సమాచారం. చైనా అభ్యర్థన మేరకు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు యుఎన్‌ఎస్‌సి దౌత్యవేత్త ఒకరు చెప్పారు.

కాశ్మీర్‌ అంశంపై సమావేశం నిర్వహించాలని కోరుతూ చైనా ఒక లేఖ రాసిందని, కౌన్సిల్‌ సాధారణ సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చిందని ఆయన చెబుతున్నారు. ఈ సమావేశానికి పాకిస్తాన్‌ను అనుమతించడం లేదని ఆయన చెప్పారు. సమావేశం వివరాలను , విలేకరులకు, ప్రసారానికి అందుబాటులో లేకుండా గోప్యంగా ఉంచుతామని కూడా ఆ దౌత్యవేత్త అన్నారు. ఇదిలా ఉంటే భారత్ మాత్రం కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే 370వ అధికరణం రద్దు తమ అంతర్గత అంశం అని అంతర్జాతీయ సమాజానికి స్పష్టం చేసింది. పాకిస్థాన్ కూడా వాస్తవాలను అంగీకరించాలని హితవు పలికింది.

కాశ్మీర్‌పై చర్చించడం అత్యంత అరుదైన సందర్భమంటున్నారు దౌత్యవేత్తలు. ఈ సమావేశాన్ని పూర్తిస్థాయి భద్రతామండలి సమావేశంగా పరిగణించడం లేదు. ఇలాంటి సమావేశాలు సాధారణంగా మారాయని, కాశ్మీర్‌పై 1965లో చివరిసారిగా ఐరాస భద్రతామండలి పూర్తిస్థాయి సమావేశం జరిగినట్టు దౌత్యవర్గాలు అంటున్నాయి.

కాశ్మీర్ అంశంపై ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటేరస్ స్పందన ప్రాధాన్యత సంతరించుకుంది. కాశ్మీర్‌పై భారత్, పాకిస్థాన్ నిగ్రహం పాటించాలని ఇప్పటికే సూచించారు. దీనిపై మూడోపక్షం జోక్యానికి అవకాశం లేదని, సిమ్లా ఒప్పందం ప్రాతిపదికన ముదుకెళ్లాలని ఆయన సూచించిన సంగతి తెలిసిందే. ఈ రహస్య భేటీలో ఏయే అంశాలు చర్చిస్తారో తేలాల్చి ఉంది. భారత విదేశాంగ శాఖ ఈ సమావేశంపై ఆరా తీస్తోంది. 

రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ హోదా ఇచ్చిన యునెస్కో

రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ హోదా ఇచ్చిన యునెస్కో

   18 hours ago


దేశమంతటా అమృత్‌ మహోత్సవ్‌

దేశమంతటా అమృత్‌ మహోత్సవ్‌

   20 hours ago


హిమాచల్‌లో కొండచరియలు విరిగిపడి 8 మంది పర్యాటకులు మరణించారు

హిమాచల్‌లో కొండచరియలు విరిగిపడి 8 మంది పర్యాటకులు మరణించారు

   25-07-2021


పెగాసస్  స్నూపింగ్ పై సుప్రీంకోర్టు లో సీపీఎం పిటిషన్

పెగాసస్ స్నూపింగ్ పై సుప్రీంకోర్టు లో సీపీఎం పిటిషన్

   25-07-2021


లాక్ డౌన్ కి వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో వేలాది ప్రజల ర్యాలీలు, పోలీసులతో ఘర్షణలు.. అరెస్టులు

లాక్ డౌన్ కి వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో వేలాది ప్రజల ర్యాలీలు, పోలీసులతో ఘర్షణలు.. అరెస్టులు

   24-07-2021


భారతదేశం ఆర్థిక వ్యవస్థ యొక్క భవిష్యత్తు 1991 కంటే కఠినమైనది, గడ్డుకాలం తప్పదు: మన్మోహన్ సింగ్

భారతదేశం ఆర్థిక వ్యవస్థ యొక్క భవిష్యత్తు 1991 కంటే కఠినమైనది, గడ్డుకాలం తప్పదు: మన్మోహన్ సింగ్

   24-07-2021


సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ పై సిబిఐ రైడ్స్... గన్ లైసెన్స్ స్కామ్

సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ పై సిబిఐ రైడ్స్... గన్ లైసెన్స్ స్కామ్

   24-07-2021


పార్లమెంట్ లో ‘పెగాసస్’ పై రగడ.. మంత్రి చేతినుంచి పేపర్లు లాక్కుని చించివేసిన ఎంపీ

పార్లమెంట్ లో ‘పెగాసస్’ పై రగడ.. మంత్రి చేతినుంచి పేపర్లు లాక్కుని చించివేసిన ఎంపీ

   22-07-2021


ఈ రోజు ఢిల్లీ నడిబొడ్డున రైతులు నిరసన దీక్ష, సరిహద్దుల వద్ద గట్టి భద్రత

ఈ రోజు ఢిల్లీ నడిబొడ్డున రైతులు నిరసన దీక్ష, సరిహద్దుల వద్ద గట్టి భద్రత

   22-07-2021


భారతదేశంలో ఇప్పటివరకు 41.76 కోట్లు మందికి కోవిడ్-19 టీకా వేశారు

భారతదేశంలో ఇప్పటివరకు 41.76 కోట్లు మందికి కోవిడ్-19 టీకా వేశారు

   22-07-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle