newssting
BITING NEWS :
*ఢిల్లీలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఐదు రోజులుగా తగ్గుతున్న రికవరీ కేసులు, కొత్తగా 1,133 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య*మేఘాలయలో 18 మంది బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది సహా 23 మందికి కరోనా*కేరళ వర్షాలు: ఇడుక్కిలో 55 చేరిన మృతుల సంఖ్య*జగిత్యాల జిల్లా: ధర్మపురిలో కరోనా కలకలం... వివాహావేడుకలో పాల్గొన్న 16 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ*ఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం... ఆర్మీ ఆస్పత్రి హెల్త్‌ బులిటెన్‌ విడుదల... రక్త ప్రసరణ సవ్యంగానే సాగుతోంది.. వెంటిలేటర్‌పై చికిత్స*ప్రగతి భవన్ ముట్టడికి NSUi కార్యకర్తల యత్నం..పీపీఈ కిట్స్ తో ప్రగతి భవన్ ముందు ప్రత్యక్షం అయిన కార్యకర్తలు*నేడు వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్ *తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,897 క‌రోనా పాజిటివ్ కేసులు

కార్గిల్ విజయ దివస్.. దేశ చరిత్రలో సువర్ణాధ్యాయం

26-07-202026-07-2020 09:35:29 IST
2020-07-26T04:05:29.763Z26-07-2020 2020-07-26T04:03:07.515Z - - 12-08-2020

కార్గిల్ విజయ దివస్.. దేశ చరిత్రలో సువర్ణాధ్యాయం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జూలై 26.. 1999. భారతదేశంలో సైనికుల విజయగాథలు సువర్ణాక్షరాలతో లిఖించిన రోజు.  స్వతంత్ర భారతచరిత్రలో మన సైన్యం అద్భుత వీరోచిత విజయాన్ని కలకాలం గుర్తుంచుకోవాల్సిన రోజు. కార్గిల్‌ విజయోత్సవానికి సరిగ్గా ఇవాళ్టికి 21 ఏళ్లు. కార్గిల్‌లో పాక్‌ చొరబాటుదారులు ఆక్రమించిన భారత సైనిక శిబిరాలన్నింటినీ మన సైన్యం తిరిగి చేజిక్కించుకున్న విజయ దినోత్సవం.

1999 జూన్‌ 25న భారత సైన్యం ముష్కో లోయలో జులూ టాప్‌ వద్ద పాక్ ముష్కరులతో సాహసోపేతంగా తలపడింది. మన సైనిక దళాలు అపారమయిన ధైర్యసాహసాలు, తిరుగులేని నిబద్ధత వల్ల ఆ శిబిరం భారత్‌ పరమైంది."ఆపరేషన్‌ విజయ్‌" అనేది ధీర భారత సైనికుల సాహసం, శౌర్యం, పరాక్రమం, త్యాగాలతో కూడిన వీరగాథ అని చెప్పాలి. 

కార్గిల్ యుద్ధం 1999 మే, జులైల మధ్య నియంత్రణ రేఖ వద్ద జమ్మూ-కశ్మీర్‌లోని కార్గిల్‌ జిల్లాలో జరిగింది. పాకిస్థాన్‌ సైన్యం వెన్నుదన్నుతో ఆ దేశ ఉగ్రవాదులు కార్గిల్‌లోని భారత భూభాగంలోకి చొచ్చుకురాగా.. ఆ ప్రాంతంలో గస్తీ తిరుగుతున్న భారత సైన్యం వారిని గుర్తించింది. సాథానిక గొర్రెలకాపరులు ఇచ్చిన సమాచారం ఆధారంగా చొరబాటుదారులు ఎక్కడి నుంచి ఆకస్మిక దాడి చేస్తారో ఆ ప్రాంతాలను భారత సైన్యం గుర్తించగలిగింది. 1999 మే 26న కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందుకున్న భారత వాయుసేన... గగనతలం నుంచి భారీగా దాడులు చేసింది. చొరబాటుదారులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

ఒకవైపు దేశంలోకి చొరబడ్డ పాక్ తన ధోరణిని కొనసాగించింది. భారత దేశం కుట్రపూరితంగా దాడులు చేస్తోందని పాకిస్థాన్ ఆరోపించడంతో... భారత్... పాకిస్థాన్ సైన్యం చొరబడినట్లు, ఉగ్రవాదులు భారత్‌లోకి వచ్చినట్లు నిరూపించే డాక్యుమెంట్లను రిలీజ్ చేసింది. దాంతో పాకిస్థాన్‌కి అంతర్జాతీయంగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇది 1999 జూన్ 5న చోటుచేసుకుంది. 

పాక్‌ చొరబాట్లను తిప్పికొట్టేందుకు భారత్‌ ప్రారంభించిన సైనిక చర్య పేరు ‘ఆపరేషన్‌ విజయ్‌’. ఇదే రీతిలో మన వైమానిక దళం ‘సఫేద్‌ సాగర్‌’ పేరిట వైమానిక దాడులు చేసింది. అత్యంత కఠినమైన పరిస్థితుల్లో భారత సైనికులు కార్గిల్‌ యుద్ధంలో వీరోచితంగా పోరాడారు. 18,000 అడుగుల ఎత్తులో ఏమాత్రం అనుకూలంగా లేని ప్రాంతంలో అజేయమయిన పోరాటం జరిపారు. 527 మంది భారత సైనికులు ఈ యుద్ధంలో అమరులయ్యారు. 1363 మంది గాయపడ్డారు. అదే సమయంలో 3 వేల మందికి పైగా పాక్‌ సైనికులను మన సైన్యం మట్టుపెట్టింది.కార్గిల్ అమరవీరులను దేశం ఎప్పటికీ మర్చిపోదు. వారి అజరామరమయిన సేవలు చిరస్మరణీయం.కార్గిల్ యుద్ధంలో దేశం కోసం ప్రాణాలర్పించిన అమర జవాన్లకు భారత జాతి నివాళి అర్పిస్తోంది. 

 

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

   5 hours ago


రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

   13 hours ago


ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

   14 hours ago


మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   11-08-2020


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   11-08-2020


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   11-08-2020


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   11-08-2020


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle