newssting
BITING NEWS :
*కార్మికులతో చర్చలు జరపండి: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశం * విశాఖ భూ కుంభకోణంపై సిట్‌ ఏర్పాటు * ఆర్టీసీ జేఏసీ సమావేశం.*ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ.. కోర్టుకు నివేదిక సమర్పించిన తెలంగాణ ప్రభుత్వం*హైదరాబాద్‌ వనస్థలిపురంలో దారుణం...ప్రియురాలిని భవనం పైనుంచి కిందకు నెట్టి చంపిన ప్రియుడు*కేబినెట్ సమావేశాల నిర్వాహణలో సీఎం జగన్ కీలక నిర్ణయం..ఇకపై నెలలో రెండు సార్లు మంత్రి వర్గ సమావేశం *ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెపై గవర్నర్ తమిళిసై ఆరా...మంత్రి పువ్వాడ అజయ్ తో ఫోన్‌ లో మాట్లాడిన గవర్నర్ *హూజూర్‌నగర్‌లో భారీ వర్షం.. మార్గ మధ్యలో కూడా ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం.. కేసీఆర్ టూర్ రద్దు

కామ్రేడ్ల తప్పుల్ని రిపీట్ చేస్తున్న మమత

24-06-201924-06-2019 14:03:23 IST
Updated On 24-06-2019 14:33:38 ISTUpdated On 24-06-20192019-06-24T08:33:23.515Z24-06-2019 2019-06-24T08:33:19.552Z - 2019-06-24T09:03:38.726Z - 24-06-2019

కామ్రేడ్ల తప్పుల్ని రిపీట్ చేస్తున్న మమత
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒక‌ప్పుడు క‌మ్యూనిస్ట్ పార్టీలు చేసిన త‌ప్పిదాలే ఇప్పుడు ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌త బెన‌ర్జీ చేశార‌ట‌. అధికారం బ‌య‌ట వారికి పెత్త‌నం ఇస్తే, అస‌లుకే ఎస‌రు వ‌స్తుంద‌న్న చారిత్రిక త‌ప్పిదాన్ని ఆమె గుర్తించ‌డంలో చాలా ఆలస్యం అయింద‌ట‌.

ఎందుకంటే, 1980 ద‌శ‌కంలో రియ‌ల్ ఎస్టేట్, బిల్డింగ్ ప్రమోట‌ర్స్ పేరుతో పెట్టుబ‌డి దారుల‌ను య‌ధేచ్చగా ప్రోత్సహించింది అప్పటి లెఫ్ట్ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం. అధికార పార్టీ అండ ఉంద‌న్న ధీమాతో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారులు క‌నిపించిన ప్రతి స్థలాన్ని క‌బ్జా చేసేశార‌ట‌. 

ఇక చిన్నాపెద్దా క‌మ్యూనిస్ట్ నాయ‌కులు రియ‌ల్ వ్యాపారుల‌తో క‌ల్సి క‌బ్జాల్లో పాలుపంచుకోవ‌డం, అడ్డగోలుగా సంపాద‌న మొద‌లు పెట్టార‌ట‌. అదేమ‌ని ప్రశ్నించిన చాలా మంది మీద కేసులు పెట్టార‌ట‌.

అవినీతి విప‌రీతంగా పెరిగి పోవ‌డంతో చాలా మంది లెఫ్ట్ పార్టీల నేత‌లు రాజీనీమాలు చేసి, అప్పుడ‌ప్పుడే జ‌నంలోకి వ‌స్తున్న మ‌మ‌త బెన‌ర్జీ నాయ‌క‌త్వంలోని తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో జోన‌ల్ స్థాయి నుంచీ జిల్లా స్థాయి దాకా క‌మ్యూనిస్టు పార్టీలు బ‌ల‌హీన ప‌డ్డాయి. 

అప్పటి నుంచీ క్రమంగా బ‌ల‌ప‌డిన తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ, ప‌లు పోరాటాలు, ఉద్య‌మాలు చేసి 2011లో అధికారంలోకి వ‌చ్చింది. ముఖ్యమంత్రిగా బాధ్యత‌లు స్వీక‌రించిన మ‌మ‌త బెన‌ర్జీ, మొద‌టి ఐదేళ్లు రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారుల మీద చ‌ర్యలు తీసుకున్నారు.

క‌బ్జాలు చేసిన వారి మీద కేసులు పెట్టారు. కానీ 2016లో రెండోసారి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఆమె ధోర‌ణి మారిపోయింద‌ట‌. ఏ రియ‌ల్ వ్యాపారుల‌ను తొక్కి పెట్టారో, ఎవ‌రి మీద అయితే కేసులు బ‌నాయించారో వారికే అభివృద్ధి పేరుతో వెంచ‌ర్లు వేసుకునే అవ‌కాశాలు క‌ల్పించార‌ట మ‌మ‌త దీదీ. 

దీంతో వారు గ‌తంలో ఏం చేశారో ఇప్పుడు కూడా అదే త‌ర‌హాలో వ్యాపారం మొద‌లు పెట్టారు. ఇక మ‌మ‌త బెన‌ర్జీ మేన‌ల్లుడు అభిషేక్ బెన‌ర్జీ అండ‌దండ‌లు పుష్కలంగా ఉండ‌టంతో వారికి ఎదురే లేకుండా పోయింద‌ట‌.

య‌ధేచ్చగా క‌బ్జాలు, కేసుల బ‌నాయింపులు పున‌రావృతం కావ‌డంతో జ‌నాల‌కు తృణ‌మూల్ కాంగ్రెస్ మీద విర‌క్తి పుట్టింద‌ట‌. అందుకే టీఎంసీకి ప్ర‌త్యామ్నంగా ఎదిగిన బీజేపీ వైపు జ‌నం మ‌ళ్లిన‌ట్లు రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. 

ఇది ఒక్కటే కార‌ణం కాక‌పోయినా, బీజేపీ బ‌ల‌ప‌డ‌టానికి రియ‌ల్ వ్యాపారుల దోపిడీ కూడా ఓ కార‌ణంగా చెబుతున్నారు. అంతేకాదు, ఉద్యోగాల క‌ల్పన‌లో, అభివృద్ధి విష‌యంలో ఏమాత్రం చ‌ర్యలు తీసుకోని మ‌మ‌త బెన‌ర్జీ మీద యువ‌త‌లో నిరాశ బాగా పెరిగింద‌ట‌.

దీంతోపాటు దేశ వ్యాప్తంగా మోడీ నాయ‌క‌త్వంలో బీజేపీ బ‌లంగా మార‌డంతో ఇప్పుడు ప‌శ్చిమ బెంగాల్లో ఆ పార్టీ గ‌ణ‌నీయంగా ఎదిగింద‌ని భావిస్తున్నారు.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle