newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

కాంగ్రెస్ వ్యూహాత్మక తప్పిదాలు.. అధికారం వచ్చినా నిలుపుకోలేని అసమర్థత

15-03-202015-03-2020 09:32:57 IST
2020-03-15T04:02:57.568Z15-03-2020 2020-03-15T04:02:54.033Z - - 12-08-2020

కాంగ్రెస్ వ్యూహాత్మక తప్పిదాలు.. అధికారం వచ్చినా నిలుపుకోలేని అసమర్థత
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అధికారం కోసం రాజకీయాల్లో అర్రులు చాసేవారుంటారు. తక్కువ మెజారిటీ వచ్చిన పార్టీలు కూడా అధికారం చేజిక్కుంచుకునేందుకు మేజిక్కులు చేస్తారు. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అదే జరుగుతోంది. కాంగ్రెస్ కు శత్రువులు ఎవరూ ఉండరు. వారికి వారే శత్రువులు. మరోసారి మధ్యప్రదేశ్ లో ఈ విషయం రుజువైంది. చాలా ఏళ్ల తర్వాత అందిన అధికారాన్ని నిలుపుకోవడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమయింది. ఈ నెపాన్ని బీజేపీపై నెట్టేకన్నా స్వయంకృతాపరాధమే కారణమని చెప్పక తప్పదు. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ కుప్ప కూలిపోతే దానికి కారణం ఆ పార్టీయే తప్ప మరెవ్వరూ కాదన్నది అందరికీ తెలిసిందే.

కాంగ్రెస్ పార్టీకి జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా చేసిన సంగతి తెలిపిందే. తనకు ఇవ్వబోయే పదవి గురించి హై కమాండ్ నుంచి స్పష్టత రాకపోవడంతో తిరుగుబాటు ఎగరవేశారు. వాస్తవానికి సింధియా సోమవారం కాంగ్రెస్ పార్టీకి సింధియా రాజీనామా చేయగా.. అదీ ఇవాళ వెలుగులోకి వచ్చింది. తనకు రాజ్యసభ సీటు ఇస్తామని మాటిచ్చి.. తీర్చకపోవడంతోనే సింధియా తిరుగుబాటు చేసినట్టు తెలుస్తోంది.

జ్యోతిరాదిత్య సింధియా వెంట ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారని కాంగ్రెస్ హైకమాండ్ కు తెలియదా? ముఖ్యమంత్రిగా ఉన్న కమల్ నాధ్ కంటికి కనపడలేదా? ఇవీ సగటు కాంగ్రెస్ అభిమాని నుంచి వస్తున్న ప్రశ్నలు. కేవలం పదిహేను నెలల క్రితమే కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టింది. దాదాపు పన్నెండు నెలల నుంచి కాంగ్రెస్ లో అగ్గిరాజుకుంటోంది. జ్యోతిరాదిత్య సింధియా, కమల్ నాధ్ ల మధ్య పొసగడం లేదన్న విషయం తెలుసు. దిగ్విజయ్ సింగ్ పుల్లలు పెడుతున్నారని అందరికీ తెలిసిందే.

జ్యోతిరాదిత్య సింధియాను ఏ మాత్రం బుజ్జగించే చర్యలు కాంగ్రెస్ చేపట్టలేదు. దీనికి తోడు ఆయన మరింత రెచ్చిపోయేలా కమల్ నాధ్ చర్యలు ఉన్నాయంటున్నారు. అధికారులు సింధియా మాట వినకకపోవడం, పార్టీ పట్టించుకోక పోవడంతోనే సింధియా సీరియస్ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. సింధియా ఆషామాషీ నేత కాదన్న సంగతి పార్టీ హైకమాండ్ కు తెలుసు. పార్టీకి భవిష్యత్తులో సింధియా దిక్కని కూడా తెలుసు. అయినా నిర్లక్ష్యం, నిర్లిప్తత కారణంగానే కాంగ్రెస్ కు మధ్యప్రదేశ్ లో ఈ పరిస్థితి దాపురించింది. 

రాహుల్‌ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన జ్యోతిరాదిత్య సింధియా ఆ పార్టీని వీడటం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సింధియా రాజీనామా, పార్టీ నుంచి బహిష్కరణ, ఎమ్మెల్యేల తిరుగుబాటు తదితర అంశాలతో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఏ క్షణమైనా కూలిపోవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో 18 ఏళ్లపాటు పార్టీకి సేవలు అందించినప్పటికీ సింధియాకు సముచిత గౌరవం దక్కనందువల్లే రాజీనామా నిర్ణయం తీసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఒక్కసారి టెన్ జన్ పథ్ కు సింధియాను పిలిచి చర్చలు జరిపి ఉంటే ఇంత తెగింపుకు ఆయన పాల్పడి ఉండేవారు కాదు. కానీ ఆ పని చేయలేదు. అందుకు ఇగోయే కారణం. దీంతోనే మమత బెనర్జీ, వైఎస్ జగన్, కేసీఆర్, శరద్ పవార్ లాంటి నేతలు పార్టీని వదిలేసి వేరు కుంపటి పెట్టుకునిసక్సెస్ అయ్యారు. ఆ ఇగోను వదిలేసుకుంటే తప్ప కాంగ్రెస్ బాగుపడే పరిస్థితి లేదంటున్నారు. మధ్యప్రదేశ్ లో పరిణామాలకు బీజేపీని నిందించి లాభం లేదు. కాంగ్రెస్ ఆత్మశోధన చేసుకుంటేనే బెటర్. భవిష్యత్తులోనైనా మరికొందరు నేతలు పార్టీని వీడకుండా ఉంటారు.

 

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   8 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   9 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   11 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   19 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle