newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

కల్నల్‌తో సహా 5గురు సైనికుల వీరమరణం.. దేశం ఘననివాళి

04-05-202004-05-2020 07:46:07 IST
2020-05-04T02:16:07.341Z04-05-2020 2020-05-04T02:16:03.304Z - - 14-06-2021

కల్నల్‌తో సహా 5గురు సైనికుల వీరమరణం.. దేశం ఘననివాళి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశమంతటా లాక్‌డౌన్‌ అమలవుతున్న వేళ..కశ్మీర్‌లో సైన్యానికి భారీ నష్టం వాటిల్లింది. ఇక్కడ జరిగిన ఎదురు కాల్పుల్లో కల్నల్, మేజర్‌ స్థాయి అధికారులు, ఇద్దరు జవాన్లతోపాటు పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఒకరు నేలకొరిగారు.  శనివారం సాయంత్రం నుంచి ఆదివారం వేకువజాము వరకు కొనసాగిన ఈ కాల్పుల ఘటనలో ఇద్దరు ముష్కరులు కూడా హతమయ్యారు. మృతులను 21వ రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన కల్నల్‌ అశుతోష్‌ శర్మ(44), మేజర్‌ అనూజ్‌ సూద్‌(30), నాయక్‌ రాజేశ్‌ కుమార్‌(29), లాన్స్‌ నాయక్‌ దినేశ్‌ సింగ్‌(24), జమ్మూకశ్మీర్‌ పోలీసు సబ్‌ఇన్‌స్పెక్టర్‌ షకీల్‌ ఖాజీ(41)గా గుర్తించారు. అంతమైన ఓ ఉగ్రవాదిని నిషేధిత లష్కరే తాయిబా సంస్థ కమాండర్‌ హైదర్‌గా గుర్తించారు. అతను పాకిస్థాన్‌ దేశస్థుడని, ప్రస్తుతం ఉత్తర కశ్మీర్‌లో క్రియాశీలకంగా ఉంటున్నాడని జమ్మూకశ్మీర్‌ డీజీపీ దిల్బాగ్‌ సింగ్‌ చెప్పారు. 

హంద్వారాలో వీరోచితంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు ప్రధాని మోదీ సహా దేశం ఘన నివాళి అర్పించింది. ‘వారి శౌర్యం, త్యాగం ఎప్పటికీ మరువలేనివి. వారు అంకిత భావంతో దేశానికి సేవ చేశారు. మన పౌరులను కాపాడేందుకు అవిరామంగా కృషి చేశారు. వారి కుటుంబసభ్యులకు, స్నేహితులకు నా సంతాపం’ అని ప్రధాని ట్వీట్‌ చేశారు. ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు కూడా జవాన్లకు నివాళి అర్పించారు. ఉగ్రవాదం మానవాళికి శత్రువని, దాన్ని అంతమొందించేందుకు ప్రపంచదేశాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.  

అమర జవాన్లకుదేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని హోంమంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. ఇది చాలా బాధాకరమైన ఘటన అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ట్వీట్‌ చేశారు. అమరవీరుల కుటుంబాలకు దేశం అండగా ఉంటుందన్నారు. కశ్మీర్‌ ప్రజల ప్రాణాలు కాపాడటంలో భద్రతాదళాల నిబద్ధతకు ఈ ఆపరేషన్‌ నిదర్శనమని భారత మహాదళపతి బిపిన్‌ రావత్‌ పేర్కొన్నారు. అమర జవాన్లకు ఆర్మీ చీఫ్‌ నరవణే సహా అన్ని ర్యాంకుల అధికారులు నివాళి అర్పించినట్టు ఆర్మీ ట్వీట్‌ చేసింది. 

Colonel, Major among 5 personnel killed in J&K's Handwara - The Hindu

కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా హంద్వారా ప్రాంతంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. చంగీముల్లా గ్రామానికి చెందిన మహిళలు, చిన్నారులు సహా సుమారు 11 మందిని ఉగ్రవాదులు ఓ ఇంట్లో బందీలుగా ఉంచుకున్నట్లు సైన్యానికి సమాచారం అందింది. దీంతో కల్నల్‌ శర్మ, పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఖాజీ నేతృత్వంలో సైన్యం, పోలీసులు సంయుక్త ఆపరేషన్‌ చేపట్టారు. ఆ ఇంటిని దిగ్బంధించారు. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య భారీగా ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే జవాన్లు ప్రాణాలకు తెగించి బందీలను, గ్రామస్తులను సురక్షితంగా వెలుపలికి తీసుకువచ్చారు.

అనంతరం కల్నల్‌ శర్మ నేతృత్వంలోని బృందం లోపలికి చొచ్చుకెళ్లింది. కానీ, లోపలే పొంచి ఉన్న ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో వారు అక్కడికక్కడే నేలకొరిగారు. వెలుపల వేచి చూస్తున్న బలగాలకు కల్నల్‌ శర్మ బృందం నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. వారికి చేసిన ఫోన్‌ కాల్స్‌కు ఉగ్రవాదులు సమాధానం ఇవ్వడంతో ప్రమాదాన్ని శంకించారు. ఆ వెంటనే లోపలికి వెళ్లిన పారాట్రూపర్లు ఇద్దరు ఉగ్రవాదులను మట్టికరిపించారు. నేలకొరిగిన కల్నల్‌ అశుతోష్‌ శర్మ, మేజర్‌ అనూజ్‌ సూద్, నాయక్‌ రాజేశ్, లాన్స్‌ నాయక్‌ దినేశ్‌లు 21 రాష్ట్రీయ రైఫిల్స్‌లోని గార్డ్స్‌ రెజిమెంట్‌కు చెందిన వారు.

వీరితోపాటు  లోపలికి వెళ్లిన జమ్మూకశ్మీర్‌ పోలీస్‌ సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ షకీల్‌ కాజీ కూడా బలయ్యారు. ఉగ్రహతుల్లో ఒకరిని లష్కరే తోయిబా కమాండర్, పాక్‌కు చెందిన హైదర్‌ కాగా, గుర్తు తెలియని మరో వ్యక్తి ఉన్నాడు. కాల్పులు జరుగుతుండగా మరో ఇద్దరు లేదా ముగ్గురు ఉగ్రవాదులు అటవీ ప్రాంతంలోకి పరారైనట్లు బలగాలు అనుమానిస్తున్నాయి. వీరంతా పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ నుంచి సరిహద్దులు దాటి అక్రమంగా చొరబడే ఉగ్రవాదుల కోసం అక్కడ వేచి ఉన్నట్లు అనుమానిస్తున్నామని సైన్యం తెలిపింది. ఇదే ఉగ్రవాదుల ముఠాతో గురువారం సాయంత్రం కూడా ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయనీ, అనంతరం వీరంతా అటవీ ప్రాంతంలోకి పారిపోయారని తెలిపింది.

అప్పటి నుంచి ఇక్కడ గాలింపు కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. నేలకొరిగిన జవాన్ల అంత్యక్రియలు సోమవారం వారివారి స్వస్థలాల్లో జరగనున్నాయని పేర్కొంది. కల్నల్‌ అశుతోష్‌ శర్మ భౌతిక కాయాన్ని సొంతూరు జైపూర్‌కు, మేజర్‌ అనూజ్‌ సూద్‌ భౌతిక కాయాన్ని పుణేకు అధికారులు తరలించారు. కాగా, కశ్మీర్‌లోయలో కల్నల్‌ స్థాయి అధికారి ప్రాణాలు కోల్పోవడం 2015 తర్వాత ఇదే ప్రథమం. ఈ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలకు ప్రధాని మోదీ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. భద్రతాబలగాల త్యాగాలు జాతి మరువలేనివని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.  

ఎప్పుడూ జవాన్లతోనే ఉండేందుకు ఇష్టపడే కల్నల్‌ శర్మ నేతృత్వంలోనే ముగ్గురు ఆర్మీ సిబ్బంది, సబ్‌ఇన్‌స్పెక్టర్‌ షకీల్‌ ఆ ఇంటి వద్దకు చేరుకున్నారు. ఆ ఇంటిపక్కనే పశువుల పాక ఉండటంతో ఉగ్రవాదులు అందులో ఉంటారని భావించిన శర్మ బృందం పక్కనున్న ఇంట్లోకి సాయంత్రం 5.30 గంటలకు ప్రవేశించి బందీల వద్దకు చేరుకుంది. అయితే, అదే ఇంట్లో ఉన్న ఉగ్రవాదులు వారిపై  కాల్పులు జరిపారు. తర్వాత కొద్ది గంటల వరకూ శర్మ బృందం నుంచి మిగిలిన ఆర్మీ బృందాలకు ఫోన్‌ సమాచారం నిలిచిపోయింది. సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు ఆ బృందంతో మాట్లాడేందుకు సైన్యం అనేకసార్లు ఫోన్‌ చేసింది. 

చివరికి రాత్రి పది గంటల సమయంలో కల్నల్‌ శర్మ ఫోన్‌ నుంచి ‘అస్సలామలైకుం’ అంటూ ఒకే ఒక్క పదం వినిపించింది. దీంతో ఆదివారం తెల్లవారుజామున అసాల్ట్‌ బృందాలు ఆ ఇంట్లోకి ప్రవేశించి ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. వారి నిర్బంధంలోని ప్రజలను కాపాడాయి. ఐదుగురు ఆర్మీ సిబ్బంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయి. కల్నల్‌ స్థాయి అధికారి ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించడం ఐదేళ్లలో జరుగలేదు. 2015లో కల్నల్‌ ఎంఎన్‌ రాయ్‌, కల్నల్‌ సంతోష్‌ మహాదిక్‌ ప్రాణాలు కోల్పోయారు. 

ఉగ్రవాదులతో పోరులో అసువులుబాసిన కల్నల్‌ అశుతోష్‌ శర్మకు దేశభక్తి ఎక్కువ. ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఆర్మీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 21 రాష్ట్రీయ రైఫిల్‌ (21-ఆర్‌ఆర్‌) కమాండింగ్‌ ఆఫీసర్‌గా ఆయన వ్యవహరిస్తున్నారు. స్థానికులను బంధించిన లష్కర్‌ ఎ తొయిబా కమాండర్‌ హైదర్‌ను టార్గెట్‌గా చేసుకుని ఆయన ఈ ఆపరేషన్‌ను అమలు చేశారు. ఆపరేషన్‌కు ముందు కూడా ఆయన తన టీమ్‌ సభ్యులకు ఇదే విషయాన్ని చెప్పారు. ఆయన టార్గెట్‌ ప్రకారం హైదర్‌ హతమయ్యాడు కానీ.. ఈ క్రమంలో శర్మ కూడా వీర మరణం పొందారు.ఉత్తర ప్రదేశ్‌కు చెందిన శర్మకు భార్య, 12 ఏళ్ల కుమార్తె ఉన్నారు. శర్మ సాహసానికి మెచ్చిన ఆర్మీ రెండుసార్లు అతన్ని సేన పతకంతో గౌరవించింది. ఆర్మీలో ఇది అరుదైన ఘనత. కాగా.. మూడు దశాబ్దాల క్రితం 21-ఆర్‌ఆర్‌ ప్రారంభమైన తర్వాత ఈ విభాగం ఒక కల్నల్‌ను కోల్పోవడం ఇది రెండోసారి.

కోవిడ్ -19: అంబులెన్స్‌పై జిఎస్‌టి 28 శాతం నుంచి 12 శాతానికి తగ్గింపు: నిర్మలా సీతారామన్

కోవిడ్ -19: అంబులెన్స్‌పై జిఎస్‌టి 28 శాతం నుంచి 12 శాతానికి తగ్గింపు: నిర్మలా సీతారామన్

   24 minutes ago


అయోధ్య శ్రీరామ మందిరంపై రాజకీయ రగడ

అయోధ్య శ్రీరామ మందిరంపై రాజకీయ రగడ

   an hour ago


బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే లీటర్ పెట్రోలు..

బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే లీటర్ పెట్రోలు..

   6 hours ago


బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినం: అలీఘర్ పిల్లలకు విడుదల ఎప్పుడు ?

బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినం: అలీఘర్ పిల్లలకు విడుదల ఎప్పుడు ?

   21 hours ago


దేశ రాజధానిలో లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు

దేశ రాజధానిలో లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు

   13-06-2021


ఉత్తర ప్రదేశ్ మూడు ముక్కలు కానుందా..?

ఉత్తర ప్రదేశ్ మూడు ముక్కలు కానుందా..?

   13-06-2021


కరోనా ఔషధాలు, వైద్య పరికరాలకి భారీగా జీఎస్టీ తగ్గింపు

కరోనా ఔషధాలు, వైద్య పరికరాలకి భారీగా జీఎస్టీ తగ్గింపు

   13-06-2021


గత 24 గంటల్లో ఇండియాలో 84,332 కోవిడ్ కేసులు..

గత 24 గంటల్లో ఇండియాలో 84,332 కోవిడ్ కేసులు..

   13-06-2021


కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో సహాయం చేసిన దేశాలకు ధన్యవాదాలు G7 సమ్మిట్ లో PM మోడీ

కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో సహాయం చేసిన దేశాలకు ధన్యవాదాలు G7 సమ్మిట్ లో PM మోడీ

   13-06-2021


జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి..  ఇద్దరు పోలీసులు, ఒక పౌరుడు మరణించారు

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి.. ఇద్దరు పోలీసులు, ఒక పౌరుడు మరణించారు

   12-06-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle