newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

కలవర పెడుతున్న కరెన్సీ నోట్లు... ముట్టుకోకపోయినా షాకే..

13-04-202013-04-2020 09:37:40 IST
Updated On 13-04-2020 10:06:47 ISTUpdated On 13-04-20202020-04-13T04:07:40.613Z13-04-2020 2020-04-13T04:03:31.575Z - 2020-04-13T04:36:47.254Z - 13-04-2020

కలవర పెడుతున్న కరెన్సీ నోట్లు... ముట్టుకోకపోయినా షాకే..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సాధారణంగా మనం రోడ్డుపై నడిచి వెళుతుంటే కరెన్సీ నోటు కనిపిస్తే వెంటనే ఏం చేస్తాం. ఎవరూ చూడకుండా దానిని జేబులో పెట్టుకుంటాం. మరికొందరయితే ఆ డబ్బులు ఎవరివో తెలుసుకుంటారు. దగ్గర్లోని పోలీస్ స్టేషన్ కి వెళ్లి వాటిని అక్కడ అప్పగిస్తారు. కానీ కరోనా వైరస్ అలజడి రేపుతున్న చిన్నచిన్న సంఘటనలు కూడా భయాన్ని నింపుతున్నాయి. కరోనా వ్యాపించకుండా లాక్ డౌన్ విధించినా ఆకతాయిలు రోడ్లమీద తిరుగుతున్నారు. కొంతమంది తమ చర్యల ద్వారా జనాన్ని హడలగొట్టేస్తున్నారు. నేను కరోనాతో వచ్చాను.. ఈ డబ్బు తీసుకోండి: ఇంటి ముందు డబ్బు పెట్టి మాయమవుతున్న ఆగంతకుడు అందరిలో భయాన్ని నింపుతున్నాడు. 

బీహార్‌లో ఇళ్ల ముందు కనిపిస్తున్న కరెన్సీ నోట్లు స్థానికుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. సహస్ర పట్టణంలో గత నాలుగు రోజులుగా ఇళ్ల గుమ్మాల ముందు రూ. 20, రూ. 50, రూ. 100 నోట్లు దర్శనమిస్తున్నాయి. వాటితోపాటు ఓ చీటీ కూడా ఉంటోంది. అందులో తాను కరోనాతో వచ్చానని, తాను పెట్టిన ఈ నోట్లను స్వీకరించాలని, లేదంటే ప్రతి ఒక్కరినీ వేధిస్తానని అందులో రాసి ఉంది. దీంతో జనం ఏం చేయాలో తెలీక అయోమయానికి గురవుతున్నారు. దీంతో స్థానికులు విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటి వరకు ముగ్గురి ఇంటి ముందు ఇలా కరెన్సీ నోట్లు లభించాయని, చీటీలోని చేతిరాత ప్రకారం ఈ పనికి పాల్పడుతున్నది ఒక్కరేనని అనుమానిస్తున్నారు. జనాన్ని ఆటపట్టించేందుకే అతడు ఇలా చేస్తుండవచ్చని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

యూపీలో ఇంతకుముందే రెండు ఐదువందల నోట్లు రోడ్డమీద కనిపించి అందరినీ ఆలోచింపచేశాయి. భయానికి కారణం అయ్యాయి. లక్నోలో  రోడ్డుపై పడివున్న రెండు రూ. 500 నోట్లను తీసుకునేందుకు జనం ఎవ్వరూ ముందుకు రాలేదు.లక్నోలోని పేపర్ మిల్ కాలనీలో గురువారం రాత్రి స్థానికులు రోడ్డుపై రూ.500 నోట్లు రోడ్డుపై గమనించారు. భయంతో జనమంతా దూరం జరిగారు.

రెండు ఐదువందల నోట్లను ముట్టుకోవద్దని పోలీసులు వారికి సలహా ఇచ్చారు. కొంతమంది కరోనా వచ్చిన వేళ కరెన్సీ నోట్లు అయాచితంగా కనిపించినా వాటిని ముట్టుకోవడం లేదు. కరెన్సీ నోట్లతో కరోనా వైరస్ వ్యాపిస్తుందని సోషల్ మీడియాలో కొద్దిరోజుల క్రితం ప్రచారం జరిగింది. దగ్గరలోని వైద్యుడి వద్దకు వెళ్లి విషయం వివరించగా.. 24 గంటల పాటు వాటిని ముట్టుకోకుండా వేరుగా ఉంచాలని సూచించాడు. . కరెన్సీ నోట్లకు... కరోనాకు  సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండటమే జనం భయానికి కారణం అని, ఆ కరెన్సీ నోట్లు రెండూ తమవద్దే వున్నాయని పోలీసులు తెలపడం కొసమెరుపు. పైగా బ్యాంకుల్లో లావాదేవీలకు సంబంధించి విత్ డ్రా స్లిప్పులు, డిపాజిట్ల కోసం వచ్చే నోట్లను కూడా రెండుమూడు పర్యాయాలు ఇస్త్రీ చేసి మరీ పరిశీలిస్తున్నారు. అలాగే కరోనా భయంతో కర్నాటకలో కరెన్సీ నోట్లను కాల్చేస్తున్నారు. 

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   9 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   10 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   12 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   21 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle