newssting
BITING NEWS :
*ఇవాళ గురుపూర్ణిమ.. చంద్రగ్రహణం **దేశంలో కరోనా వీరవిహారం.. పాజిటివ్ కేసులు 6,72,695, మరణాలు 19,279 *దేశవ్యాప్తంగా అంగరంగవైభవంగా గురుపూర్ణిమ వేడుకలు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శనం ఇస్తున్న సాయినాధుడి ఆలయాలు *ఈనెల 7,8 తేదీల్లో ఇడుపులపాయలో సీఎం జగన్ పర్యటన. జులై 8 న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పించనున్న జగన్ *నెల్లూరు జిల్లాలో దారుణం..ఏడేళ్ళ బాలిక పై పీజీ‌ విద్యార్థి మనోజ్ అత్యాచారయత్నం..తప్పించుకుని తల్లిని తీసుకురాగా తల్లి పై దాడి చేసిన నిందితుడు *విద్యుత్ డిస్కంలు PFC, REC నుంచి 12,600 కోట్ల రుణం తీసుకోవడానికి అనుమతి ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం *క‌రోనా ఎఫెక్ట్‌: ఈ నెల 6వ తేదీ నుంచి 19వ తేదీ వ‌ర‌కు కోల్‌క‌తాకు విమానాల రాక‌పోక‌ల‌పై ఆంక్ష‌లు*జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కటింగ్ యంత్రంతో గొంతు కోసుకుని వృద్ధుడి ఆత్మహత్య*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,850 పాజిటివ్ కేసులు న‌మోదు, ఐదుగురు మృతి, జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే 1,572 కొత్త క‌రోనా కేసులు..10,487 యాక్టివ్ కేసులు..11,537 డిశ్చార్జ్ అయిన కేసులు*మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. శనిగాపురం శివారు తుమ్మల చెరువులో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి *ఢిల్లీ: కరోనావైరస్‌నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీల‌క నిర్ణ‌యం.. ఈవీఎం బటన్‌ నొక్కేందుకు చేతి వేళ్లకు బదులుగా కర్ర చెక్కలను ఉపయోగించాలని నిర్ణయం*ఏపీలో ఇవాళ 7 65 కొత్త కేసులు నమోదు. గడిచిన 24 గంటల్లో 12 మంది మృతి. ఏపీలో 17,699కి చేరిన కరోనా కేసులు. ఇందులో 9473 యాక్టివ్ కేసులు ఉండగా, 8008 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో మొత్తం 218కి చేరిన కరోనా మరణాలు

కలల ప్రాజెక్టుకు కరోనా దెబ్బ.. 40 శాతం చైనా ప్రాజెక్టుల్లో స్తంభన

29-06-202029-06-2020 16:18:02 IST
2020-06-29T10:48:02.870Z29-06-2020 2020-06-29T10:47:53.974Z - - 05-07-2020

కలల ప్రాజెక్టుకు కరోనా దెబ్బ.. 40 శాతం చైనా ప్రాజెక్టుల్లో స్తంభన
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చైనా కలల ప్రాజెక్టులను కరోనా గట్టిగా దెబ్బ తీసింది. ఆసియా, ఆఫ్రికా, యూరప్‌లతో వాణిజ్య సంబంధాల బలోపేతం, పెట్టుబడులే లక్ష్యంగా ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగాలని డ్రాగన్‌ దేశం చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు వైరస్‌ సెగ తగిలింది. బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌ (బీఆర్‌ఐ) పేరిట చైనా ప్రారంభించిన మహానిర్మాణంలో అయిదో వంతు ప్రాజెక్టులపై కోవిడ్‌–19 ప్రభావం పడిందని చైనా విదేశాంగ శాఖలో అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాల డైరెక్టర్‌ జనరల్‌ జియోలాంగ్‌ వెల్లడించారు.

40 శాతం ప్రాజెక్టులపై అత్యంత తీవ్ర ప్రభావం, 30–40 శాతం ప్రాజెక్టులపై కొంతమేరకు కరోనా ప్రభావం పడిందని ఆయన చెప్పినట్టుగా సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్టు పత్రిక వెల్లడించింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ 2013లో అధికారంలోకి వచ్చిన వెంటనే బీఆర్‌ఐని ప్రారంభించారు. 

ఆగ్నేయాసియా, మధ్య ఆసియా, గల్ఫ్‌ ప్రాంతం, ఆఫ్రికా, యూరప్‌లను రహదారి, సముద్ర మార్గాల ద్వారా కలుపుతూ బీఆర్‌ఐ మహా నిర్మాణంలో మొదలైంది. ఈ ఏడాది జనవరి నాటికి మొత్తం 2,951 ప్రాజెక్టుల నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి. వీటి విలువ 3.87 లక్షల కోట్ల డాలర్లు ఉంటుందని ఒక అంచనా. ఈ ప్రాజెక్టుల్లో అధిక భాగం పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయి.

6 వేల కోట్ల వ్యయంతో నిర్మాణంలో ఉన్న చైనా–పాకిస్తాన్‌ ఎకనమిక్‌ కారిడార్‌ (సీపీఈసీ)పై కరోనా ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంది. ఈ కారిడార్‌ పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ మీదుగా వెళుతూ ఉండడంతో భారత్‌ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. 

ఇక కాంబోడియాలో సిహనౌకువిలే ప్రత్యేక ఆర్థిక మండలి, ఇండోనేసియాకు చెందిన జకార్తా–బాండంగ్‌ హైస్పీడు రైలు ప్రాజెక్టుల పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. దీనికి సంబంధించి చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్‌ యీ వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశం నిర్వహించి త్వరగా ఈ ప్రాజెక్టుల్ని ప్రారంభించాలని సూచించారు.

 

అరుణాచల్, లద్దాఖ్, కార్గిల్‌లలో భూకంపం

అరుణాచల్, లద్దాఖ్, కార్గిల్‌లలో భూకంపం

   40 minutes ago


భారత్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. చైనా కంపెనీల తాజా రాగం

భారత్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. చైనా కంపెనీల తాజా రాగం

   3 hours ago


ఒక్క రోజులో 60 వేల కేసులు.. అల్లాడుతున్న అమెరికా

ఒక్క రోజులో 60 వేల కేసులు.. అల్లాడుతున్న అమెరికా

   3 hours ago


ఈసీ కీలక నిర్ణయాలు... కరోనా ఎఫెక్టే కారణమా?

ఈసీ కీలక నిర్ణయాలు... కరోనా ఎఫెక్టే కారణమా?

   9 hours ago


భారత్‌లో రికార్డు స్థాయిలో కేసులు.. ఒక్కరోజులో 23వేలు, 442 మంది మృతి

భారత్‌లో రికార్డు స్థాయిలో కేసులు.. ఒక్కరోజులో 23వేలు, 442 మంది మృతి

   10 hours ago


భారత్‌పై దుందుడుకు వైఖరి..  చైనా నిజ స్వరూపం ఇదే.. ట్రంప్‌ స్పష్టత

భారత్‌పై దుందుడుకు వైఖరి.. చైనా నిజ స్వరూపం ఇదే.. ట్రంప్‌ స్పష్టత

   10 hours ago


భారత్‌లో కరోనా బీభత్సం.. 30 రోజుల్లో 4 లక్షల కేసులు.. ఐదు రోజుల్లో లక్ష కేసులు

భారత్‌లో కరోనా బీభత్సం.. 30 రోజుల్లో 4 లక్షల కేసులు.. ఐదు రోజుల్లో లక్ష కేసులు

   04-07-2020


భారత్ వివాదాలను పెంచుకోదలుస్తోందా.. మోదీ వ్యాఖ్యకు చైనా ఖండన

భారత్ వివాదాలను పెంచుకోదలుస్తోందా.. మోదీ వ్యాఖ్యకు చైనా ఖండన

   04-07-2020


రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. 24 గంటల్లో 20,903 కొత్త కేసులు.. 379 మంది మృతి

రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. 24 గంటల్లో 20,903 కొత్త కేసులు.. 379 మంది మృతి

   04-07-2020


చైనా, పాక్‌ల నడ్డివిరిచిన భారత్.. విద్యుత్ పరికరాల దిగుమతిపై నిషేధం

చైనా, పాక్‌ల నడ్డివిరిచిన భారత్.. విద్యుత్ పరికరాల దిగుమతిపై నిషేధం

   04-07-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle