newssting
BITING NEWS :
*నేడు సిద్ధిపేట జిల్లాలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ క్షేత్ర పర్యటన*నేడు ఢిల్లీకి దేవేందర్‌గౌడ్‌*గుంటూరు ప్రాంతంలో చంద్రబాబు పర్యటన*నేడు సనత్‌నగర్‌లో కేంద్ర మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ పర్యటన *కర్ణాటక బీజేపీ నూతన అధ్యక్షుడిగా నళినీకుమార్ కటీల్*హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో చిదంబరం పిటిషన్

కర్నాటకీయమే ఆదర్శమా? రాజకీయ భ్రష్టత్వానికి నిదర్శనమా?

13-08-201913-08-2019 13:04:53 IST
Updated On 13-08-2019 13:05:44 ISTUpdated On 13-08-20192019-08-13T07:34:53.637Z13-08-2019 2019-08-13T07:34:50.249Z - 2019-08-13T07:35:44.107Z - 13-08-2019

కర్నాటకీయమే ఆదర్శమా? రాజకీయ భ్రష్టత్వానికి  నిదర్శనమా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

రాజకీయ భష్టత్వానికి నిలువెత్తు నిదర్శనంగా ఇటీవల కర్నాటకలో 14 నెలల పైచిలుకు కొనసాగిన రసవత్తర నాటకాన్ని చెప్పుకోవలసి ఉంటుంది. అధికారం లేదా, ప్రత్యర్థి పార్టీని అధికారానికి దూరంగా ఉంచడం అన్న ఏకైక లక్ష్యంతో సిద్ధాంత సారూప్యతలతో పని లేకుండా పొత్తులు కుదుర్చోకోవడం కర్నాటకీయం ప్రత్యేకత. కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ అటువంటి అనైతిక పొత్తుతో ఏర్పడిన సర్కారే. అందుకే ఆ ప్రభుత్వం అంత వేగంగా పతనమైపోయింది.

అయితే ఇటువంటి అనైతిక రాజకీయ పొత్తులు, మైత్రీ బంధాలు కర్నాటకతోనే ప్రారంభం కాలేదు...కర్నాటకతోనే అంతమైపోతాయని చెప్పలేం. ఎందుకంటే కర్నాటకం కంటే ముందు కాశ్మీరంలో కూడా పీడీపీ- బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కూడా ఇలాంటి అనైతిక పొత్తుతో ఏర్పడినదే. పీడీపీ- బీజేపీ పార్టీల సిద్ధాంతాలు ఏ విధంగా చూసినా పరస్పర విరుద్ధమైనవి, సైద్ధాంతిక ప్రాతిపదికన  ఏ విధంగా చూసినా ఆ రెండు పార్టీలూ కలిసే అవకాశం లేదు. 

కానీ కాశ్మీర్ లో అధికారం లేదా అధికారంలో భాగస్వామ్యం అన్న ఏకైక లక్ష్యంతో ఆ రాష్ట్రంలో రెండు పార్టీలూ కలిసి ప్రభుత్వానన్ని ఏర్పాటు చేశాయి. అయితే ఈ సంకీర్ణ ప్రభుత్వం కూడా ఎక్కువ కాలం అధికారంలో కొనసాగలేదు. అయితే ఇప్పుడు బీజేపీ మాత్రం నాటి సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న సమయంలో ఉగ్రవాదులకు నిధులు అందే మార్గాల అనుపానులను కనిపెట్టేందుకు, వాటి దారులు మూసేందుకు తీసుకోవలసిన చర్యలపై ఒక అవగాహనకు వచ్చేందుకు ఉపయోగించుకున్నామని చెబుతున్నది. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా ఆ పని చేయాలంటే ప్రజా తీర్పును అవహేళన చేయాలా అన్న అనుమానం సగటు మనిషికి సహజంగానే కలుగుతుంది. అయితే ఆ సందేహ నివృత్తికి నాడే కాదు నేడు కూడా సమాధానం చెప్పే బాధ్యతను మోడీ నేతృత్వంలోని కేంద్రం తీసుకోవడం లేదు. అధికారమో, అధికారంలో భాగస్వామ్యమో అదే లక్ష్యంగా నేడు రాజకీయాలు సాగుతున్నాయనడానికి కర్నాటక, కాశ్మీర్ ఉదంతాలు ఉదాహరణలుగా చెప్పవచ్చు. 

ఎన్నికల ముందు పరస్పర విమర్శలతో హోరెత్తించుకున్న పార్టీలే ఎన్నికల అనంతరం పొత్తుల పేరిట కలవడం...పరస్పరం ప్రశంసలు కురిపించుకోవడం ప్రజలకు ఎలాంటి సంకేతాలు ఇస్తాయి. రాజకీయ పార్టీలు, నాయకులు చేసే విమర్శలకు విలువ ఇవ్వనక్కర్లేదనే కదా! అదే పొతు విచ్ఛిన్నమై..సంకీర్ణం పతనమైన తరువాత మళ్లీ ఆ పార్టీలు విమర్శల దాడులకు తెగబడటానికి ఇసుమంతైనా వెనుకాడవు. కర్నాటకలో, జమ్మూ కాశ్మీర్ లో జరుగుతున్నది అదే. 

నిన్న మొన్నటి దాకా అధికారంలో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, జేడీఎస్ లు ఇప్పుడు పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. అలాగే కాశ్మీర్ లో పీడీపీ-బీజేపీ సంకీర్ణం పతనమైనప్పటి నుంచీ ఈ రెండు పార్టీల మధ్యా విమర్శల యుద్ధం నడుస్తున్నది. పీడీపీ ఉగ్రవాద అనుకూల పార్టీ అనీ, ఆ పార్టీ విధానాలు పాక్ అనుకూలమైనవనీ కాంగ్రెస్ విమర్శిస్తుంటే...ఆర్ఎస్ఎస్ రహస్య అజెండా అమలుకు అడ్డుపడినందుకే రాష్ట్రంలో ప్రభుత్వ పతనాన్ని బీజేపీ శాశించిందని పీడీపీ విమర్శిస్తున్నది. సరే  ఆర్టికల్ 370 రద్దు తో కాశ్మీర్ లో బీజేపీ తన పాపం కడిగేసుకున్నదని  జనం భావిస్తున్న పరిస్థితి ఉంది. అయితే కర్నాటకం మాత్రం  ఇంకా రంజుగా కొనసాగుతున్నది. ఇటువంటి రాజకీయాలు  ప్రజాస్వామ్యానికి ఇసుమంతైనా మేలు చేయవు సరికదా, ప్రజలకు ప్రజాస్వామ్యంపై విశ్వాసం సన్నగిల్లేందుకు దోహదపడతాయి. పార్టీ ఫిరాయింపులు, కప్పదూకుళ్లకు అడ్డుకట్ట వేసే విధంగా పటిష్టమైన చట్టాలు రావలసిన అవసరం ఎంతైనా ఉంది. 

అదే సమయంలో స్పీకర్ విచక్షణ అంటూ పార్టీ మార్పిళ్లు, రాజీనామాల విషయంలో ఆ స్థానానికి విశేష అధికారాలు ఉండటం కూడా పరిస్థితి దిగజారడానికి దోహదపడుతున్నదా అనిపిస్తున్నది. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి ఫిరాయించే నేతల శాసన సభ్యత్వం ఆటోమెటిగ్గా రద్దయ్యేలా, ఆ విషయంలో స్పీకర్ నిర్ణయం కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేని విధంగా చట్టాలను రూపొందించాల్సిన అవసరం ఉంది. ఆ పని చేయాల్సింది కూడా చట్టసభలే కావడం, అటువంటి పటిష్ట చట్టం తెచ్చి తాము కూర్చున్న కొమ్మను తామే నరుక్కుంటామా? అన్నట్లుగా రాజకీయ పార్టీలు అందుకు ముందుకు రావడం లేదు. కానీ ఫిరాయింపులపై ఎవరి అనుకూలతను బట్టి వారు విమర్శలు గుప్పించడానికి మాత్రం వెనుకాడటం లేదు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle