newssting
Radio
BITING NEWS :
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై సస్పెన్స్‌కు తెరపడింది. బీఎస్‌ యడియూరప్ప సోమవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సాయంత్రం గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు. రాజీనామాపై ఆయన స్పందిస్తూ.. ‘‘ రాజకీయ జీవితంలో ఎన్నో అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నా. కర్ణాటక అభివృద్ధి కోసం చాలా చేశా. 75 ఏళ్లు దాటినా నాకు రెండేళ్ల పాటు అవకాశం ఇచ్చారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా’’ అని అన్నారు. * ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా సోమవారం 2,128 కోవిడ్‌ టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ అందిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల కోవిడ్‌ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. * చరిత్రలోనే మొట్టమొదటిసారి మన తెలుగు సంపద అయిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన రామప్ప ఆలయానికి ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన (పరిశోధన), సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా కోసం 2015లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. * టోక్యో ఒలింపిక్స్‌లో జపాన్‌కి చెందిన మోమిజీ నిషియా సంచలనం సృష్టంచింది. ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన రెండో అతి పిన్న వయస్కురాలిగా రికార్డు క్రియాట్‌ చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన స్కేట్‌బోర్డింగ్ లో నిషియా స్వర్ణ పతకం సాధించింది. * ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చోర్‌ బజార్‌’’. ‘దళం, జార్జ్‌ రెడ్డి’ చిత్రాల ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

కరోనా వైరస్ మూడోదశను భారత్ తట్టుకోగలదా?

24-03-202024-03-2020 07:23:40 IST
2020-03-24T01:53:40.641Z24-03-2020 2020-03-24T01:53:38.246Z - - 27-07-2021

కరోనా వైరస్ మూడోదశను భారత్ తట్టుకోగలదా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధం విషయంలో ఇంతవరకు భారత్ అనుసరిస్తున్న విధానం ప్రశంసనీయమే కాకుండా చాలావరకు సత్ఫలితాలనే ఇచ్చిందనడం వాస్తవం. విమానాశ్రయంలోనే ప్రయాణీకులందరికీ స్క్రీనింగ్ పరీక్ష జరపడం, ప్రజల్లో జాగరూకత పెంచడం, సందేహం వచ్చిన అన్ని ప్రాంతాల్లో కరోనా వైరస్ బారిన పడినవారి వివరాలకోసం గాలించడం వంటి అన్ని చర్యలూ ఇంతవరకు సరైన మార్గంలోనే వెళుతున్నాయి. కానీ కరోనావైరస్ మూడోదశలో కమ్యూనిటీ మొత్తానికి వైరస్ సోకే ప్రమాదం ప్రబలంగా ఉండటంతో వైరస్ కేసులు కుప్పలు తెప్పలుగా నమోదయ్యే అవకాశం ఉందని భీతిల్లుతున్నారు. ప్రమాదకరమైన మూడో దశకు చేరుతున్నందున ఈ సంక్షోభాన్ని ఎదుర్కోగలిగిన సాధన సంపత్తి భారత్‌కు లేదన్నది వాస్తవం.

ఇలాంటి పరిస్థితి ఎదురుకాదనే ఆశిద్దాం. ఒకవేళ ఈ పరిస్థితి ఎదురైతే భారత్ వైరస్ పరీక్షా కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన విస్తరించాల్సిన అవసరం ఉంది. రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి అనుమానం మీద వచ్చి కరోనా పరీక్షలు చేయించుకోవాలనున్న వందలాది వ్యక్తులకు పరీక్షే చేయకుండా పంపించేశారు. కారణం వీరు వైరస్ బారినపడిన దేశాలనుంచి తిరిగి రాలేదు. పైగా వైరస్ సోకిన వ్యక్తులతో వీరిలో ఎవరికీ కాంటాక్టు లేదు. అయితే పొరపాటున వీరిలో ఎవరికైనా కరోనా వైరస్ ఉండి ఉంటే అలాంటి వ్యక్తి ఇప్పటికే ఎంతమందికి కరోనా వైరస్‍‌ను అంటించివుంటారు అనేది ఊహించడానికి కూడా భయమేస్తుంది. కానీ భారతీయ వైద్య వ్యవస్థ ఇలాంటి సంభావ్యతల గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇలాంటి పేలవమైన పరిస్థితుల్లో భారత్‌లో కరోనా వైరస్ మూడవ దశ ప్రారంభమైందంటే ఊహకందని ప్రమాదం తప్పదని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరోవైపున కరోనా వైరస్‌ ధాటికి ప్రపంచ దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. చైనాలోని వుహాన్‌లో పురుడుపోసుకున్న మహ్మమారి కరోనా అనతికాలంలోనే ప్రపంచదేశాలను ఆవహించింది. అయితే ముందస్తు జాగ్రత్తలతో పలు దేశాలు త్వరతగతిన అప్రమత్తత ప్రకటించడంతో కొంతమేర కట్టడిచేయగలిగాయి. ఇక చైనా, ఇటలీ, ఇరాన్ దేశాల్లో నాలుగో దశకు చేరుకుని.. ఆయా దేశాలను చిగురుటాకులా వణికిస్తోంది. వైరస్‌ ప్రభావం కాస్త ఆలస్యమైనప్పటికీ భారత్‌లోనూ తీవ్ర ప్రభావం చూపుతోంది. పలు దేశాలు మాత్రం ముందస్తుగా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో రెండో దశ నుంచే కరోనాతో యుద్ధం చేస్తున్నాయి. ఈ జాబితాలో భారత్‌ కూడా ఉంది. అయితే రెండే దశలోనే వైరస్‌ పెద్ద ఎత్తన విజృంభిస్తుండటంతో భారత్‌లో త్వరలోనే మూడోదశకు చేరుకుంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

విదేశాలకు వెళ్లి కరోనా బారినపడి, మన దగ్గరుకు వచ్చిన తర్వాత వారి కుటుంబ సభ్యులు వైరస్‌ విస్తరింపజేసేది రెండో దశ. ప్రస్తుతం మనదేశంలో రెండోదశ కొనసాగుతుంది. ఈ దశను లోకల్‌ ట్రాన్స్‌మిషన్‌గా వ్యవహరిస్తుంటారు. విమానాశ్రయాల్లో విదేశీ ప్రయాణికులు దిగగానే వారిని స్క్రీనింగ్‌ చేయ డం, లక్షణాలు ఉన్నవారిని ఆస్పత్రులకు తరలించి, చికిత్సలు చేయించడం, వ్యాధి లక్షణాలు లేకపోయినా వారిని ఇతరులకు దూరంగా ఉంచడం ద్వారా ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ విస్తరించకుండా కట్టడి చేయవచ్చు. ప్రస్తుతమున్న పరిస్థితుల నేపథ్యంలో భారత్‌ కూడా మూడో దశ.. కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ (సామాజిక వ్యాప్తి) పోరుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరికలు వినిపిస్తున్నాయి. 

మూడో దశ అత్యంత ప్రమాదకరమైన దశ. రెండో దశలో వైరస్‌ బారిన పడిన వారి నుంచి చుట్టుపక్కల ఉన్న వారికి పెద్దఎత్తున వైరస్‌ విస్తరిస్తుంది. చాలా తక్కువ సమయంలోనే వేలాది మందికి విస్తరిస్తుంది. మరణాల సంఖ్య భారీగా ఉంటుంది. నియంత్రణ కష్టమవుతుంది. ఇటలీ, ఇరాన్‌లు ప్రస్తుతం ఇదే దశను ఎదుర్కొంటున్నాయి. కాగా చైనాతో పోలిస్తే భారత్‌లో జనసాంద్రత చాలా ఎక్కువ. మన దేశంలో ఒక చదరపు కిలోమీటర్‌ పరిధిలో 420 మంది నివశిస్తున్నారు. చైనాలో ఆసంఖ్య 148. అయితే భారత్‌లో రెండోదశ దాటి.. మూడోదశకు చేరితే వైరస్‌ను నియంత్రించడం చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారమని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు దేశంలో మురికివాడలు సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎజెన్సీ ప్రాంతాలూ ఎక్కువనే. దీంతో రెండోదశను దాటి మూడోదశకు చేరకుండానే జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.

‘వైరస్‌ వ్యాప్తి మూడో దశ కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌లోకి వ్యాపించడానికి దేశానికి కేవలం 30 రోజుల గడువే ఉంది. వైరస్‌ మూడు, నాలుగు దశలు దాటిపోతే వ్యవస్థలన్నీ కుప్పకూలే ప్రమాదం లేకపోలేదు. ప్రస్తుతం ఉన్న వైద్య సిబ్బంది, ఆస్పత్రులు, పడకలు ఇతర మౌలిక సదుపాయాలు ఏమాత్రం సరిపోవు. చిన్న వైరసే కదా అని నిర్లక్ష్యం చేస్తే జీవితమే కోల్పొవాల్సి వస్తుంది. ముందే మే ల్కొని ఎవరికి వారు స్వీయ నియంత్రణ చర్యలు చేపడితే.. వైరస్‌ భారీ నుంచి సులభంగా బయటపడొచ్చని’ వైద్యులు చెబుతున్నారు.

నాలుగో దశ  వైరస్‌ నియంత్రణ చేయి దాటిపోయే దశ ఇదే. ప్రస్తుతం ఇటలీ, ఇరాన్‌ ఇదే పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ దశను తొలిసారి చూసిన దేశం చైనా. ఈ దశలోనే అక్కడ కేసుల సంఖ్య 80 వేలు దాటిపోయింది. ఆలస్యంగా మేల్కొన్నప్పటికీ.. కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా ప్రస్తుతం వైరస్‌ వ్యాప్తి నియంత్రణలోకి వచ్చింది. కానీ ఇరాన్, ఇటలీ వంటి దేశాలు మాత్రం ఇప్పటికీ వైరస్‌తో పోరాడుతూనే ఉన్నాయి. కాగా ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. వైరస్‌ వ్యాప్తి నిరోధానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలను చేపడుతోంది. పలు ప్రాంతాల్లో 144 సెక్షన్‌ కూడా విధిస్తున్నారు. 

ఆదివారం జనతా కర్ప్యూ బ్రహ్మాండంగా సక్సెస్ కావడంతో మరో వారంరోజులు అంటే మార్చి 31 వరకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు. అంటే ప్రజల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోతాయి. విమానాలు, రైళ్లు, బస్సులు, కార్లు, ఆటోలు ప్రయాణీకుల వాహనాలు ఏవీ తిరగకుండా ఆంక్షలు విధించారు. ప్రజలను ఇళ్లలోనే ఉండాలని ఆదేశించారు.

రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ హోదా ఇచ్చిన యునెస్కో

రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ హోదా ఇచ్చిన యునెస్కో

   18 hours ago


దేశమంతటా అమృత్‌ మహోత్సవ్‌

దేశమంతటా అమృత్‌ మహోత్సవ్‌

   20 hours ago


హిమాచల్‌లో కొండచరియలు విరిగిపడి 8 మంది పర్యాటకులు మరణించారు

హిమాచల్‌లో కొండచరియలు విరిగిపడి 8 మంది పర్యాటకులు మరణించారు

   25-07-2021


పెగాసస్  స్నూపింగ్ పై సుప్రీంకోర్టు లో సీపీఎం పిటిషన్

పెగాసస్ స్నూపింగ్ పై సుప్రీంకోర్టు లో సీపీఎం పిటిషన్

   25-07-2021


లాక్ డౌన్ కి వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో వేలాది ప్రజల ర్యాలీలు, పోలీసులతో ఘర్షణలు.. అరెస్టులు

లాక్ డౌన్ కి వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో వేలాది ప్రజల ర్యాలీలు, పోలీసులతో ఘర్షణలు.. అరెస్టులు

   24-07-2021


భారతదేశం ఆర్థిక వ్యవస్థ యొక్క భవిష్యత్తు 1991 కంటే కఠినమైనది, గడ్డుకాలం తప్పదు: మన్మోహన్ సింగ్

భారతదేశం ఆర్థిక వ్యవస్థ యొక్క భవిష్యత్తు 1991 కంటే కఠినమైనది, గడ్డుకాలం తప్పదు: మన్మోహన్ సింగ్

   24-07-2021


సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ పై సిబిఐ రైడ్స్... గన్ లైసెన్స్ స్కామ్

సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ పై సిబిఐ రైడ్స్... గన్ లైసెన్స్ స్కామ్

   24-07-2021


పార్లమెంట్ లో ‘పెగాసస్’ పై రగడ.. మంత్రి చేతినుంచి పేపర్లు లాక్కుని చించివేసిన ఎంపీ

పార్లమెంట్ లో ‘పెగాసస్’ పై రగడ.. మంత్రి చేతినుంచి పేపర్లు లాక్కుని చించివేసిన ఎంపీ

   22-07-2021


ఈ రోజు ఢిల్లీ నడిబొడ్డున రైతులు నిరసన దీక్ష, సరిహద్దుల వద్ద గట్టి భద్రత

ఈ రోజు ఢిల్లీ నడిబొడ్డున రైతులు నిరసన దీక్ష, సరిహద్దుల వద్ద గట్టి భద్రత

   22-07-2021


భారతదేశంలో ఇప్పటివరకు 41.76 కోట్లు మందికి కోవిడ్-19 టీకా వేశారు

భారతదేశంలో ఇప్పటివరకు 41.76 కోట్లు మందికి కోవిడ్-19 టీకా వేశారు

   22-07-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle