newssting
BITING NEWS :
*దేశంలో 20 లక్షల 25 వేల 409 కేసులు.. మరణాలు 41,638*విశాఖ: నేటి నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు వ్యాలీలో సంపూర్ణ లాక్డౌన్.వ్యాపార,వర్తక సంఘాలు నిర్ణయం.మూతపడనున్న ప్రైవేట్ హోటళ్లు*కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మంత్రి కేటీఆర్ లేఖ‌.. వాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల విషయంలో మరింత వికేంద్రీకరణ అవ‌స‌రం.. కోవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి-కేటీఆర్*అనంతపురం : తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద జైలు నుంచి బెయిలుపై విడుదలైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు... కాన్వాయ్ కు అనుమతి లేదంటూ అడ్డగించిన పోలీసులు.. వాగ్వాదం*తూర్పుగోదావరి : అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటీవ్.. హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి*నటుడు సుశాంత్ మరణంపై సిబిఐ కేసు నమోదు.. ప్రియురాలు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు*మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన బిజెపి ఏపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు... ఎపి బిజెపి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు అభినందనలు తెలిపిన చిరంజీవి*రామలింగారెడ్డి భార్యకే ఉపఎన్నికలో టికెట్ ఇవ్వాలి.. ఆమెకు టికెట్ ఇస్తేనే ఆయనకు నిజమైన నివాళి.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్‌తో నేను మాట్లాడతా-జ‌గ్గారెడ్డి*నల్లగొండ జిల్లా: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమా నిలిపివేయాలంటూ అమృత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈనెల 11కు వాయిదా వేసిన కోర్టు*విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు*తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,092 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 73,050కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

కరోనా వైరస్ కట్టడికి అదే మార్గం.. డబ్ల్యుహెచ్‌వో ఉపాయం

18-03-202018-03-2020 12:11:53 IST
Updated On 18-03-2020 12:46:23 ISTUpdated On 18-03-20202020-03-18T06:41:53.051Z18-03-2020 2020-03-18T06:41:50.389Z - 2020-03-18T07:16:23.852Z - 18-03-2020

కరోనా వైరస్ కట్టడికి అదే మార్గం.. డబ్ల్యుహెచ్‌వో ఉపాయం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రాణాంతక వైరస్‌పై గుడ్డిగా పోరాడితే నష్టమే మిగులుతుందని ఏ దేశమూ ఏమీ సాధించలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. అనుమానితులు ఎవ్వరినీ వదలకుండా నిర్ధారణ పరీక్షలు చేయడం ఒక్కటే కరోనా వైరస్ కట్టడికి ఏకైక మార్గమని ప్రపంచదేశాలకు సూచించింది. వ్యాధికి గురైన వారికి చికిత్స, అనుమానితులకు పరీక్షలు ఏకకాలంలోనే జరపాలని, పరీక్షించడం తప్ప మరే మార్గమూ కోవిడ్19 వైరస్ కట్టడికి ఉపకరించదని తేల్చి చెప్పింది. 

మనకాలంలో యావత్ ప్రపంచ ఆరోగ్య సంక్షోభకారిగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోందని సరిహద్దులు మూయడం, ఇళ్లలో జనాలను నిర్బంధించడం మాత్రమే కరోనా నివారణ మార్గం కాదని స్పష్టం చేసింది.

విశ్వ మహమ్మారిగా మారిని కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ టెడ్రోస్ కీలక సూచనలు చేశారు. అనుమానితులందరికీ వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయాలని ప్రపంచ దేశాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. వ్యాధికి గురైన వారికి చికిత్స అందించడంతోపాటు... అనుమానితులను పరీక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు. 

ప్రాణాంతక వైరస్‌పై గుడ్డిగా పోరాడితే నష్టమే మిగులుతుందని జెనీవాలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో హెచ్చరించారు. ‘వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు మన ముందున్న చక్కటి మార్గం టెస్‌, టెస్ట్‌, టెస్ట్‌’ అని వ్యాఖ్యానించారు.

వైరస్ సోకిన రోగులకు, సోకిందని భావిస్తున్న అనుమానితులకు పరీక్షలు చేయడంలో  చైనా, దక్షిణ కొరియా, సింగపూర్‌ దేశాలు అన్నిటికంటే ముందున్నాయని డబ్ల్యుహెచ్‌ఓ డైరక్టర్‌ జనరల్‌ తెలిపారు. అనుమానితులను గుర్తించి, చికిత్స అందించడం ద్వారానే ఆయా దేశాల్లో వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని గుర్తు చేశారు. 

అభివృద్ధి చెందిన దేశాలు సైతం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వెల్లడించారు. ఇక అల్పాదాయ దేశాల పరిస్థితి మరీ దారుణంగా మారనుందని అన్నారు. అసలే పోషకాహార లోపంతో, అనారోగ్య సమస్యలతో సతమతమయ్యేవారికి వైరస్‌ సోకితే నష్టం పెద్ద మొత్తంలో ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.

వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి.. రోగగ్రస్తుల్ని ఐసోలేషన్‌ వార్డుల్లో పెట్టకపోతే.. మనుషుల మధ్య వైరస్‌ వ్యాప్తి జరిగి.. నియంత్రించడం కష్టమవుతుదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ప్రాణాంతక కోవిడ్‌ను ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు పలు దేశాలు తీర్మానం చేయడం.. నిధులు సమకూర్చుకోవడం హర్షించదగ్గ విషయమని కొనియాడారు. అది నిధుల విషయమని కాకుండా.. మానవతా స్ఫూర్తి అని కొనియాడారు. 

కాగా, కరోనాపై పోరుకు ‘కోవిడ్‌–19 ఎమర్జెన్సీ ఫండ్‌’ను ఏర్పాటు చేయాలన్న భారత ప్రధాని మోదీ ప్రతిపాదనకు సభ్య దేశాల నేతలు ఏకీభావం తెలిపిన విషయం విదితమే. భారత్‌ తరఫున ఈ ఫండ్‌ కోసం కోటి డాలర్లను(రూ.73.95 కోట్లు) మోదీ విరాళంగా ప్రకటించారు.

మరోవైపున అమెరికాలో సైతం కరోనా పంజా విసురుతోంది. అనుమానితులను గుర్తించడంలో ఆ దేశం విఫలమవడంతో వైరస్‌ వ్యాప్తి పెరిగింది. అక్కడ మూడు వేలకు పైగా జనం వైరస్‌ బారిన పడగా.. 62 మంది మరణించారు. 

దీంతో తీవ్ర విమర్శలు రావడంతో ట్రంప్‌ ప్రభుత్వం కళ్లు తెరిచింది. వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం 2000 ల్యాబ్‌లను అందుబాటులోకి తెస్తున్నట్టు అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ ఆదివారం వెల్లడించారు.

ప్రాణాంతక వైరస్ పట్ల అజాగ్రత్తగా ఉంటే, యుద్ధప్రాతిపదికన మౌలిక వైద్య ఏర్పాట్లు చేయకపోతే ఏం జరగుతుందో మన కళ్లముందే ఇటలీ ఉదాహరణగా నిలుస్తోంది. లక్షమందికి పైగా రోగులకు చైనాలో కరోనా వైరస్ సోకితే చైనా అసాధారణ చర్యలకు పూనుకుని రెండు నెలల వ్యవధిలోనే ఊహాన్‌ నగరంలో వైరస్ ఆనవాళ్లు లేకుండా చేసుకోగలిగింది. రోగులు సంఖ్య పెరిగినప్పటికీ మృతుల సంఖ్యను గణనీయంగా తగ్గించడంలో చైనా అద్భుత విజయం సాధించింది. 

కానీ అదేసమయంలో వైరస్ విస్తరణ కేంద్రంగా ఇటలీ చెడు ఉదాహరణగా నిలిచిపోయింది. అతిచిన్న దేశమైన ఇటలీలో కరోనా వైరస్ మరణాల సంఖ్య ఇప్పటికే 2500లను దాటిపోయింది. చైనాతోసహా ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మృతుల సంఖ్య 7000కు దాటగా వాటిలో చైనా తర్వాత ఇటలీ, ఇరాన్, స్పెయిన్ దేశాల్లోనే 3500 పైగా రోగులు మృతి చెందడం భీతి కలిగిస్తోంది.

అందుకే జనాలను కట్టడి చేయడం కంటే అనుమానమున్న ప్రతి ఒక్కరికీ నిర్బంధంగా వ్యాధినిర్ధారణ పరీక్షలు చేయడం తప్పనిసరి చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.

కేరళలో వర్షబీభత్సం...  కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

కేరళలో వర్షబీభత్సం... కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

   8 hours ago


ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

   10 hours ago


గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

   14 hours ago


చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

   16 hours ago


దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

   19 hours ago


కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

   19 hours ago


ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

   20 hours ago


మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

   06-08-2020


కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

   06-08-2020


యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

   06-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle