newssting
BITING NEWS :
*దేశంలో కరోనా పాజిటివ్ కేసులు.. 22 లక్షల 26 వేల 229, మరణాలు 44,597 * విజయవాడ స్వర్ణప్యాలెస్ ప్రమాదం కేసులో ముగ్గురి అరెస్ట్ * ఏపీలో 24 గంటల వ్యవధిలో 7,665 కరోనా కేసులు .. రాష్ట్రంలో 2,35,525కి చేరిన మొత్తం కరోనా కేసులు. 80 కరోనా మరణాలు .. 2,116కు చేరిన కరోనా మృతులు *రాజమండ్రి జిల్లా కొవిడ్ హాస్పిటల్ లో కరోనా పరీక్షలు చేసే 9 మంది ల్యాబ్ టెక్నీషియన్స్ కు, మెడికల్ ఆఫీసర్ కు పాజిటివ్ *రాష్ట్రపతికి లేఖ వ్రాసిన సీతానగరం మండలం మునికూడలికి చెందిన శిరోముండనం బాధితుడు ప్రసాద్..మావోయిస్టుల్లో కలిసిపోవడానికి అనుమతి ఇవ్వాలని కోరిన బాధితుడు..శిరోముండనం కేసులో నిందితులు అందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ *ఢిల్లీ: మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి క‌రోనా పాజిటివ్.. త్వరగా కోలుకోవాలని ట్వీట్లు *హైదరాబాద్‌: ఈఎస్ఐలోని బంగారు మైసమ్మ ఆలయంలో చోరీకీ విఫలయత్నం*సుశాంత్ కేసులో ఈడి ముందు హాజరైన నటి రియా.. ఈడీ నోటీసుల‌తో రెండోసారి హాజ‌రు*తెలంగాణలో 80 వేలు దాటిన పాజిటివ్ కేసులు.. గ‌త 24 గంట‌ల్లో 1256 పాజిటివ్ కేసులు న‌మోదు*ఢిల్లీ క‌రోనా హెల్త్ బులిటెన్ః కొత్త‌గా 707 కేసులు, 20 మ‌ర‌ణాలు

‘‘కరోనా వైరస్ అంతమే అందరి పంతం’’ మన్ కీ బాత్ లో మోడీ

26-07-202026-07-2020 13:10:31 IST
Updated On 26-07-2020 13:13:48 ISTUpdated On 26-07-20202020-07-26T07:40:31.834Z26-07-2020 2020-07-26T07:40:19.444Z - 2020-07-26T07:43:48.017Z - 26-07-2020

‘‘కరోనా వైరస్ అంతమే అందరి పంతం’’ మన్ కీ బాత్ లో మోడీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని అంతా సమర్థవంతంగా ఎదుర్కోవాలని, కరోనా వైరస్ అంతమే అందరి పంతం కావాలన్నారు ప్రధాని మోడీ. రానున్న స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్ట్‌ 15న కరోనా వైరస్‌ నుంచి స్వేచ్ఛ కోసం ప్రజలు ప్రతినబూనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుఇచ్చారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ కోసం కొత్త విషయాలు నేర్చుకుంటూ మన కర్తవ్యాలకు కట్టుబడాలని అన్నారు.

కరోనా వైరస్‌ ప్రపంచదేశాలకే ప్రమాదకరంగా మారిందని, వ్యాధి తీవ్రత మరింతగా పెరగడంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మహమ్మారి పలు ప్రాంతాలకు విస్తరిస్తూ ప్రమాదఘంటికలు మోగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ఆదివారం మన్‌ కీ బాత్‌లో భాగంగా దేశ ప్రజలకు సందేశం ఇచ్చారు.  ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో మెరుగ్గా ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు. ‘పలు దేశాలతో పోలిస్తే భారత్‌లో మరణాల రేటు తక్కువగా ఉంది.. మనం లక్షలాది ప్రజల ప్రాణాలు కాపాడాం..అయినా కరోనా వైరస్‌ ముప్పు ఇంకా ముగిసిపోలేదని, మన అప్రమత్తతమే మనకు రక్షణగా వుంటుందన్నారు మోడీ.

త్వరలో రాఖీ పండుగ రానుందని, పలు సంఘాలు..ప్రజలు రక్షాబంధన్‌ను ఈసారి విభిన్నంగా జరుపుకునేందుకు ప్రయత్నించడం హర్షణీయమని అన్నారు. గతంలో క్రీడలు ఇతర రంగాల్లోకి పెద్ద నగరాలు, ప్రముఖ కుటుంబాలు, పేరొందిన పాఠశాలల నుంచే పలువురు దూసుకొచ్చేవారని, ఇప్పుడు గ్రామాలు, చిన్న పట్టణాలు, సాధారణ కుటుంబాల నుంచి ఆయా రంగాల్లోకి పెద్ద సంఖ్యలో ముందుకు రావడం అభినందనీయం అన్నారు ప్రధాని నరేంద్రమోడీ. కార్గిల్‌ యుద్ధంలో గెలిచి నేటికి 21 సంవత్సరాలైన సందర్భంగా సైనికుల త్యాగాలను కొనియాడారు. 

‘ఈ రోజు చాలా ప్రత్యేకమైంది..కార్గిల్‌ యుద్ధం ఎలాంటి సమయంలో ఏ పరిస్థితిలో జరిగిందో ఏ ఒక్కరూ మరువలేరు..పాకిస్తాన్‌తో మెరుగైన సంబంధాలను భారత్‌ కోరుకుంటే అలా జరగలేద’ని కార్గిల్‌ యుద్ధం నాటి పరిస్థితులను ప్రస్తావించారు. మన సైనికుల ధైర్యానికి ధన్యవాదాలు, అమరుల త్యాగాలను మరిచపోవద్దన్నారు. దేశంలో ఆందోళనకర స్థాయిలో కరోనా కేసులు పెరిగిపోవడం పట్ల మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలంతా మాస్కులు ధరించి జాగ్రత్తగా వుండాలన్నారు. 

 

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   2 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   19 hours ago


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   20 hours ago


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


స్వచ్చభారత్ లేకుంటే కరోనాతో దేశం ధ్వంసమయ్యేది...ప్రధాని మోదీ వ్యాఖ్య

స్వచ్చభారత్ లేకుంటే కరోనాతో దేశం ధ్వంసమయ్యేది...ప్రధాని మోదీ వ్యాఖ్య

   09-08-2020


భారత్ ని వేడుకొంటున్న చైనా.. వెనక్కు పోయాం.. నమ్మండి ప్లీజ్

భారత్ ని వేడుకొంటున్న చైనా.. వెనక్కు పోయాం.. నమ్మండి ప్లీజ్

   09-08-2020


10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

   08-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle