newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

కరోనా వైరస్‌..లాక్ డౌన్ పై మోదీ మన్ కీ బాత్

29-03-202029-03-2020 11:17:36 IST
Updated On 29-03-2020 11:52:37 ISTUpdated On 29-03-20202020-03-29T05:47:36.555Z29-03-2020 2020-03-29T05:26:19.749Z - 2020-03-29T06:22:37.537Z - 29-03-2020

కరోనా వైరస్‌..లాక్ డౌన్ పై మోదీ మన్ కీ బాత్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ అమలవుతున్న వేళ ప్రధాని మోదీ మన్ కీ బాత్ నిర్వహించారు. కరోనాపై ప్రధాని ఏం మాట్లాడతారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో కరోనా గురించి మాట్లాడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంతా భావించారు. కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ఈ కార్యక్రమం ద్వారా మోడీ చెబుతున్నారు.

తప్పనిసరి పరిస్థితుల్లోనే దేశంలో లాక్ డౌన్ అమలు నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆంక్షల వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, తనను క్షమించాలన్నారు. దినసరి కూలీలు పడుతున్న బాధల్ని తాను అర్థంచేసుకోగలనన్నారు.  ప్రజలు తమని తాము రక్షించుకుంటూ.. కుటుంబాల్ని కాపాడుకోవాలన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కఠిన నిర్ణయాలు తప్పడం లేదన్నారు. మన్ కీ బాత్  కార్యక్రమలో మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. మరికొద్దిరోజుల పాటు లక్ష్మణ రేఖ దాటకుండా ఉండాల్సిందే అన్నారు. ప్రతి ఒక్కరూ ధైర్యం వీడకుండా పోరాటం చేయాలన్నారు. వైరస్ కట్టడికి వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది చేస్తున్న కృషిని మోడీ అభినందించారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. లాక్ డౌన్ అమలవుతున్న తీరుపై వివిధ వర్గాల వ్యక్తులతో ప్రధాని మాట్లాడారు. కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలపై స్పందన అడిగారు. మీరంతా బాగుండాలని తాను కోరుకుంటున్నానన్నారు. మీ అందరికీ ధన్యవాదాలు అన్నారు మోడీ. 

ఇప్పటికే దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ని పొడిగించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అయితే, లాక్ డౌన్ ని దేశ పౌరులు సీరియస్ గా తీసుకోవడం లేదని మోడీ అసహనంతో వున్నారు. లాక్ డౌన్ అమలవుతున్న తీరుపై కొందరితో ప్రధాని మాట్లాడారు. కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలపై స్పందన అడిగారు. 

మీమొబైల్లో 1922 కి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా మన్ కీ బాత్ వినవచ్చు. ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్, నరేంద్రమోదీ మొబైల్ యాప్ లలో మోదీ మన్ కీ బాత్ వినవచ్చు. హిందీ భాషలో ప్రసంగించే ప్రధాని ఉపన్యాసాన్ని అనంతరం ఆకాశవాణి ప్రాంతీయ భాషల్లోనూ వినవచ్చు. జనతా కర్ఫ్యూ అనంతరం మోడీ లాక్ డౌన్ ప్రకటించారు. తరవాత ఆర్థికమంత్రి నిర్యలా సీతారామన్ ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటన చేశారు.

మూడునెలల పాటు నిరుపేదలకు సాయం చేస్తామన్నారు. లాక్ డౌన్ తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలను ఆదుకునేందుకు  ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద వచ్చే మూడు నెలల పాటు పేదలకు నేరుగా సాయం అందించనున్న కేంద్రం. రూ. లక్షా 70 వేల కోట్లతో భారీ ఆర్ధిక ప్యాకేజీ. .వలస కార్మికులు, పట్టణ, గ్రామీణ పేదలు, రోజువారి కూలీలను ఆదుకునేందుకు చర్యలు చేపట్టింది.

దేశంలోని పేదలను ఆదుకునేందుకు కేంద్రం రూ.1.70 లక్షల కోట్లతో ‘ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన’  ప్రకటించిన మర్నాడే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టర్మ్‌ లోన్ల ఈఎంఐలపై మూడు నెలల మారటోరియం విధించడం మధ్యతరగతికి ఊరట కలిగించనుంది. వర్కింగ్‌ క్యాపిటల్‌ లోన్లపై మూడు నెలలు వడ్డీ  వాయిదా వేయాలని ఆర్బీఐ బ్యాంకులకు సూచించడం వల్ల వ్యపార వర్గాలకు వడ్డీ భారం తగ్గనుంది. కరోనా ప్రభావం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా ఆర్బీఐ గవర్నర్ తీసుకున్న చర్యలను అంతా స్వాగతించారు.

 

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   9 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   9 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   11 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   20 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle