newssting
Radio
BITING NEWS :
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై సస్పెన్స్‌కు తెరపడింది. బీఎస్‌ యడియూరప్ప సోమవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సాయంత్రం గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు. రాజీనామాపై ఆయన స్పందిస్తూ.. ‘‘ రాజకీయ జీవితంలో ఎన్నో అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నా. కర్ణాటక అభివృద్ధి కోసం చాలా చేశా. 75 ఏళ్లు దాటినా నాకు రెండేళ్ల పాటు అవకాశం ఇచ్చారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా’’ అని అన్నారు. * ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా సోమవారం 2,128 కోవిడ్‌ టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ అందిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల కోవిడ్‌ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. * చరిత్రలోనే మొట్టమొదటిసారి మన తెలుగు సంపద అయిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన రామప్ప ఆలయానికి ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన (పరిశోధన), సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా కోసం 2015లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. * టోక్యో ఒలింపిక్స్‌లో జపాన్‌కి చెందిన మోమిజీ నిషియా సంచలనం సృష్టంచింది. ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన రెండో అతి పిన్న వయస్కురాలిగా రికార్డు క్రియాట్‌ చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన స్కేట్‌బోర్డింగ్ లో నిషియా స్వర్ణ పతకం సాధించింది. * ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చోర్‌ బజార్‌’’. ‘దళం, జార్జ్‌ రెడ్డి’ చిత్రాల ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

కరోనా వైరస్‌పై భారత్ అలుపెరుగని పోరాటం

15-04-202015-04-2020 12:50:52 IST
Updated On 15-04-2020 12:58:59 ISTUpdated On 15-04-20202020-04-15T07:20:52.305Z15-04-2020 2020-04-15T07:20:16.925Z - 2020-04-15T07:28:59.592Z - 15-04-2020

కరోనా వైరస్‌పై భారత్ అలుపెరుగని పోరాటం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. కరోనా బాధితుల సంఖ్య 11 వేలు దాటింది. బుధవారం ఉదయం నాటికి కరోనా బాధితుల సంఖ్య  11,439కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించారు. దాదాపు 9,756 మందికి చికిత్స కొనసాగుతోంది. కరోనా నుండి ఇప్పటి వరకు 1,306 మంది బాధితులు కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో ఈ మహమ్మారి బారిన పడి 38 మంది మృతి చెందారు. మొత్తంగా ఇప్పటి వరకు 377 మంది కరోనాతో మరణించారు.

ఇటు ఏపీలోనూ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకి పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా 19 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు 502 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మంగళవారం సాయంత్రం 5 గంటల నుండి బుధవారం 9 గంటల వరకు జరిపిన పరీక్షల్లో 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

వైద్య ఆరోగ్య శాఖ బులిటిన్ ప్రకారం గుంటూరులో 4, పశ్చిమగోదావరి జిల్లాలో 8, కర్నూలులో 6, కృష్ణాలో 1 నమోదు అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా గుంటూరులో అత్యధికంగా 118 కరోనా పాజిటివ్ కేసులు వున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరూ కరోనా పాజిటివ్ తో 11 గురు మృతి చెందగా, కరోనా పాజిటివ్ చికిత్స తీసుకుని 16 మంది డిశ్చార్జ్ అయ్యారు. 

దేశంలో వైద్య పరికరాలు, సౌకర్యాలను మెరుగుపరచడం ద్వారా కోవిడ్ 19 నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంది భారత ప్రభుత్వం. లాక్ డౌన్ మరోసారి పొడిగించడం ద్వారా కరోనా మే నెల మొదటి వారం నాటికి తగ్గుముఖం పట్టనుంది. 

* కోవిడ్ 19 రోగులకు అత్యవసర చికిత్స అందించేందుకు 600 ఆస్పత్రులు, 1.40 లక్షల ఐసోలేషన్ బెడ్లు, 11 వేల ఐసీయూ బెడ్లు సిద్ధం చేశాం. పీపీఇ పరికరాల కొరత లేకుండా దేశ వ్యాప్తంగా 39 ఫ్యాక్టరీలలో వీటిని తయారుచేస్తోంది. 

*ఇప్పటికే 27 లక్షల పీపీఇలను పంపిణీ చేశాం. అలాగే భారీ స్థాయిలో పీపీఇల దిగుమతికి ఆర్డర్లు జారీచేసింది. ఎన్ 95 మాస్కులు 48 లక్షల పంపిణీ చేశాం. అలాగే కోటి మాస్కుల తయారీకి ఆయా కంపెనీలకు ఆర్డర్లు ఇచ్చాం. అన్ని విధాలుగా ఉపయోగపడేలా మాస్కుల తయారీ శరవేగంగా సాగుతోంది. 

*ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేట్ ఆస్పత్రులలోనూ కోవిడ్ 19 రోగులకు ఉచిత చికిత్స అందించాలని ఆదేశించాం అని కేంద్రం తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ 19 కేసుల్లో ఉపయోగించే హైడ్రోక్లోరోక్విన్ డ్రగ్ 70 శాతం భారత్ ఉత్పత్తి చేస్తోంది. దేశీయ అవసరాలకు ఎక్కువ మొత్తంలో మందులను అందుబాటులో ఉంచడంతో పాటు అమెరికా, బ్రెజిల్ వంటి దేశాలకు వాటిని పంపిస్తోంది కేంద్రం. ఇప్పటికే ఇతర దేశాలు భారత్ కు ఈ మందు పంపించాలని కోరుతూనే వున్నాయి. 

*ఏప్రిల్ 14 నాటికి దేశవ్యాప్తంగా 229 కరోనా టెస్టింగ్ ల్యాబ్ లు అందుబాటులోకి వచ్చాయి. కరోనా వైరస్ సోకినవారు ఎలాంటి ఆందోళనలకు గురికావలసిన అవసరం లేదు. భారత్ పకడ్బందీగా, ఖచ్చితంగా, కఠినంగా అమలుచేస్తున్న లాక్ డౌన్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇతర దేశాలతో పోలిస్తే కోవిడ్ 19 వ్యాప్తి, మరణాల సంఖ్య తక్కువగానే వుంది. 

 

రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ హోదా ఇచ్చిన యునెస్కో

రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ హోదా ఇచ్చిన యునెస్కో

   19 hours ago


దేశమంతటా అమృత్‌ మహోత్సవ్‌

దేశమంతటా అమృత్‌ మహోత్సవ్‌

   21 hours ago


హిమాచల్‌లో కొండచరియలు విరిగిపడి 8 మంది పర్యాటకులు మరణించారు

హిమాచల్‌లో కొండచరియలు విరిగిపడి 8 మంది పర్యాటకులు మరణించారు

   25-07-2021


పెగాసస్  స్నూపింగ్ పై సుప్రీంకోర్టు లో సీపీఎం పిటిషన్

పెగాసస్ స్నూపింగ్ పై సుప్రీంకోర్టు లో సీపీఎం పిటిషన్

   25-07-2021


లాక్ డౌన్ కి వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో వేలాది ప్రజల ర్యాలీలు, పోలీసులతో ఘర్షణలు.. అరెస్టులు

లాక్ డౌన్ కి వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో వేలాది ప్రజల ర్యాలీలు, పోలీసులతో ఘర్షణలు.. అరెస్టులు

   24-07-2021


భారతదేశం ఆర్థిక వ్యవస్థ యొక్క భవిష్యత్తు 1991 కంటే కఠినమైనది, గడ్డుకాలం తప్పదు: మన్మోహన్ సింగ్

భారతదేశం ఆర్థిక వ్యవస్థ యొక్క భవిష్యత్తు 1991 కంటే కఠినమైనది, గడ్డుకాలం తప్పదు: మన్మోహన్ సింగ్

   24-07-2021


సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ పై సిబిఐ రైడ్స్... గన్ లైసెన్స్ స్కామ్

సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ పై సిబిఐ రైడ్స్... గన్ లైసెన్స్ స్కామ్

   24-07-2021


పార్లమెంట్ లో ‘పెగాసస్’ పై రగడ.. మంత్రి చేతినుంచి పేపర్లు లాక్కుని చించివేసిన ఎంపీ

పార్లమెంట్ లో ‘పెగాసస్’ పై రగడ.. మంత్రి చేతినుంచి పేపర్లు లాక్కుని చించివేసిన ఎంపీ

   22-07-2021


ఈ రోజు ఢిల్లీ నడిబొడ్డున రైతులు నిరసన దీక్ష, సరిహద్దుల వద్ద గట్టి భద్రత

ఈ రోజు ఢిల్లీ నడిబొడ్డున రైతులు నిరసన దీక్ష, సరిహద్దుల వద్ద గట్టి భద్రత

   22-07-2021


భారతదేశంలో ఇప్పటివరకు 41.76 కోట్లు మందికి కోవిడ్-19 టీకా వేశారు

భారతదేశంలో ఇప్పటివరకు 41.76 కోట్లు మందికి కోవిడ్-19 టీకా వేశారు

   22-07-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle