newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

కరోనా వైరస్‌తో ముంచుకొస్తున్న మరో ముప్పు

10-07-202010-07-2020 15:14:54 IST
2020-07-10T09:44:54.780Z10-07-2020 2020-07-10T09:44:43.369Z - - 03-08-2020

 కరోనా వైరస్‌తో ముంచుకొస్తున్న మరో ముప్పు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ ఒక్కటే రావడం లేదు...ఈ మహమ్మారి తనతో పాటు అనేక అనారోగ్యాలను వెంట తెస్తోంది. కరోనా మహమ్మారిని నిలువరించేందుకు ప్రపంచ దేశాలు అష్టకష్టాలు పడుతున్నసమయంలో మరో విభ్రాంతికర విషయం వెలుగులోకి వచ్చింది. కోవిడ్‌-19 రోగుల్లో పలు రకాల మెదడు, నాడీ సంబంధిత సమస్యలను గుర్తించామని లండన్‌ పరిశోధకులు తాజాగా వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సమస్యలను గుర్తించినట్టు పరిశోధకులు  తెలిపారు. అంతేకాదు కరోనా గాలి ద్వారా కూడా వ్యాపిస్తోందని, అంతా అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. 

లివర్‌పూల్ విశ్వవిద్యాలయం సహా, ఇతర శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం కరోనా రోగుల్లో గుండె జబ్బులు, మతిమరుపు ఇతర నాడీ సంబంధిత,మానసిక సమస్యలను కరోనాకు భారీగా ప్రభావితమైన దేశాలు నివేదించాయి. ది లాన్సెట్ న్యూరాలజీలో ప్రచురించిన ఈ అధ్యయనాల ప్రకారం గందరగోళం, స్ట్రోక్, మెదడు వాపు, వెన్నుపాము, నరాల వ్యాధి వంటి ఇతర సమస్యలు కూడా సంభవించవచ్చని పరిశోధకులు వెల్లడించారు. 

కరోనా సోకిన వారిలో దాదాపు వెయ్యి మంది రోగులు ఇలాంటి సమస్యలకు గురయ్యారు. ఇవి అరుదుగా కనిపించే సమస్య లైనప్పటికీ, బాధితుల సంఖ్య చాలా ఎక్కువుగా ఉంటుందని లివర్‌పూల్ విశ్వవిద్యాలయం తెలిపింది. ప్రధానంగా కరోనా వైరస్ సోకిన బాధితుల్లో వినాశకర, తీవ్ర పరిణామాలకు దారితీసే మెదడులో ఇన్ఫెక్షన్‌ లేదా వాపుముప్పు ఒకటనీ ఈ విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా వైద్యులు గుర్తించడం చాలా ముఖ్యమని మరో శాస్త్రవేత్త అవా ఈస్టన్ చెబుతున్నారు.

ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఇటువంటి సమస్యలుండగా, దీనిపై సమగ్ర వివరాలు తమకు అందలేదని పేర్కొన్నారు.  ఈ అంశంపై పూర్తి అవగాహన రావాలంటే  ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన  డేటాను మరింతగా క్రోడీకరించాల్సి వుంది. 

అత్యంత అరుదైన, మెదడులో మంట పుట్టించే ఏడీఈఎం అనే ఇన్ఫెక్షన్‌ కరోనా వచ్చిన వారిలో పెరుగుతోందని ‘బ్రెయిన్‌’ పత్రికలో ప్రచురించిన పరిశోధనలో వెల్లడైంది. కరోనా విస్తరిస్తున్న క్రమంలో ఈ తరహా బాధితుల సంఖ్య కూడా భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా మెదడులో డెలిరియం, బ్రెయిన్‌ స్ట్రోక్‌ వంటి ప్రమాదకర పరిస్థితులు తలెత్తే అవకాశముందని  పరిశోధనలో తేలినట్టు నివేదించింది. దీంతోపాటు న్యూమోనియా కూడా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. 

 

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   5 hours ago


చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

   8 hours ago


అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

   20 hours ago


నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

   02-08-2020


అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

   02-08-2020


అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

   02-08-2020


కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

   01-08-2020


అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి..  తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి.. తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

   01-08-2020


కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

   01-08-2020


ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

   01-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle