newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

కరోనా వీరవిహారం.. ప్రిన్స్ చార్లెస్ కు కరోనా పాజిటివ్

25-03-202025-03-2020 18:33:08 IST
2020-03-25T13:03:08.895Z25-03-2020 2020-03-25T12:57:51.370Z - - 05-08-2020

కరోనా వీరవిహారం.. ప్రిన్స్ చార్లెస్ కు కరోనా పాజిటివ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు కరోనా వైరస్ ఎవరినీ వదలడం లేదు.  సాక్షాత్తూ బ్రిటన్ రాజకుటుంబం కరోనాతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తాజాగా బ్రిటన్ యువరాజు ప్రిన్స్ చార్లెస్ కు కరోనా టెస్ట్ లు చేయగా పాజిటివ్ అని తేలింది. ఆయన వయసు 71 ఏళ్ళు. ప్రిన్స్ ఛార్లెస్ ఆరోగ్యం నిలకడగా ఉందని బ్రిటన్ మీడియా వెల్లడించింది. ఇదిలా ఉంటే ప్రిన్స్ చార్లెస్ భార్య కామిలియాకు కరోనా నెగిటివ్ రిపోర్టు వచ్చింది. ముందుస్తుగానే ఆమెను క్వారంటైన్లోకి పంపారు. బ్రిటన్లో ఇప్పటి వరకూ 8077 కేసులు నమోదు కాదా, 422 మంది మరణించారు. అక్కడ కూడా లాక్ డౌన్ అమలుచేస్తున్నారు. 

స్పెయిన్లో మరణాలు ఇటలీ, చైనాను మించిపోవడం ఆందోళన కలిగిస్తోంది ఈ వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య స్పెయిన్‌లో 3400 దాటింది. దీంతో ఆ దేశం కోవిడ్ మృతుల్లో చైనాను దాటేసింది. అలాగే, అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. మంగళవారం ఒక్కరోజే సుమారుగా కొత్త కేసులు 10 వేలు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం బాధితుల సంఖ్య 55 వేలకు చేరుకోగా.. 784 మంది ఈ వ్యాధి బారిన పడి మృతి చెందారు. నిన్న 150 మంది ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్ కారణంగా చైనాలో 3281 మంది చనిపోయారు.

 ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ బారిన పడిన వారి సంఖ్య 4.34 లక్షలు దాటగా.. మరణించిన వారి సంఖ్య 20 వేలకు చేరువలో ఉంది. రెండున్నర నెలలపాటు చైనాలో విజృంభించిన ఈ వైరస్ ప్రస్తుతం అక్కడ శాంతించింది. ఇప్పుడు ఇటలీ, స్పెయిన్, ఇరాన్, అమెరికాల్లో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. కరోనా మరణాల్లో ఇటలీ ఇప్పటికే చైనాను దాటేసింది. భారత్ లో కరోనా బాధితుల సంఖ్య 582 కాగా, మరణించిన వారి సంఖ్య 12కి చేరింది. తెలంగాణలో కేసులు 39కి చేరింది. 

భారతదేశంలో కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు దేశమంతా లాక్​డౌన్​ విధిస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. ఇల్లు విడిచి బయటకు రావటాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు తెలిపారు.జనతా కర్ఫ్యూను మించి లాక్​డౌన్​ను అమలు చేస్తామని స్పష్టం  చేశారు. ప్రజలు తమకు సహకరించాలని ప్రజల్ని కోరుతున్నారు పోలీసు అధికారులు. 21 రోజుల పాటు ఈ లాక్​డౌన్​ కొనసాగుతుందని తెలిపారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు 21 రోజులు కావాలని నిపుణులు చెబుతున్నారని.అందువల్ల రానున్న 21 రోజులు చాలా కీలకమని స్పష్టం చేశారు. 

దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

   10 hours ago


కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

   18 hours ago


రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

   19 hours ago


ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   03-08-2020


చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

   03-08-2020


అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

   02-08-2020


నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

   02-08-2020


అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

   02-08-2020


అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

   02-08-2020


కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

   01-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle