newssting
BITING NEWS :
*దేశంలో కరోనా పాజిటివ్ కేసులు.. 22 లక్షల 26 వేల 229, మరణాలు 44,597 * విజయవాడ స్వర్ణప్యాలెస్ ప్రమాదం కేసులో ముగ్గురి అరెస్ట్ * ఏపీలో 24 గంటల వ్యవధిలో 7,665 కరోనా కేసులు .. రాష్ట్రంలో 2,35,525కి చేరిన మొత్తం కరోనా కేసులు. 80 కరోనా మరణాలు .. 2,116కు చేరిన కరోనా మృతులు *రాజమండ్రి జిల్లా కొవిడ్ హాస్పిటల్ లో కరోనా పరీక్షలు చేసే 9 మంది ల్యాబ్ టెక్నీషియన్స్ కు, మెడికల్ ఆఫీసర్ కు పాజిటివ్ *రాష్ట్రపతికి లేఖ వ్రాసిన సీతానగరం మండలం మునికూడలికి చెందిన శిరోముండనం బాధితుడు ప్రసాద్..మావోయిస్టుల్లో కలిసిపోవడానికి అనుమతి ఇవ్వాలని కోరిన బాధితుడు..శిరోముండనం కేసులో నిందితులు అందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ *ఢిల్లీ: మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి క‌రోనా పాజిటివ్.. త్వరగా కోలుకోవాలని ట్వీట్లు *హైదరాబాద్‌: ఈఎస్ఐలోని బంగారు మైసమ్మ ఆలయంలో చోరీకీ విఫలయత్నం*సుశాంత్ కేసులో ఈడి ముందు హాజరైన నటి రియా.. ఈడీ నోటీసుల‌తో రెండోసారి హాజ‌రు*తెలంగాణలో 80 వేలు దాటిన పాజిటివ్ కేసులు.. గ‌త 24 గంట‌ల్లో 1256 పాజిటివ్ కేసులు న‌మోదు*ఢిల్లీ క‌రోనా హెల్త్ బులిటెన్ః కొత్త‌గా 707 కేసులు, 20 మ‌ర‌ణాలు

కరోనా విషయంలో ఏం చేసినా తప్పుపడుతున్నారు... వాపోయిన ట్రంప్

25-07-202025-07-2020 09:25:30 IST
2020-07-25T03:55:30.104Z25-07-2020 2020-07-25T03:55:18.337Z - - 11-08-2020

కరోనా విషయంలో ఏం చేసినా తప్పుపడుతున్నారు... వాపోయిన ట్రంప్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ విస్తరణ, కట్టడి విషయంలో  తాను ఏం మాట్లాడినా, ఏం చేసినా జనం తనను విమర్శించకమారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.  ప్రస్తుతం ప్రపంచ జనాభా అంతా కరోనా వ్యాక్సిన్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పలు దేశాల్లో కరోనా వ్యాక్సిన్‌ హ్యూమన్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కరోనా వ్యాక్సిన్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ట్రంప్‌ స్పందిస్తూ.. కరోనా వ్యాక్సిన్‌ విషయంలో జనాలు తనపై తప్పక విమర్శలు కురిపిస్తారని తెలిపారు. 

‘ఒకవేళ కరోనా వ్యాక్సిన్‌ను నేను ముందుగా తీసుకుంటే.. జనాలు ‘స్వార్థపరుడు, అందరి కంటే ముందు తనే తీసుకున్నాడు’ అంటారు. ఒకవేళ చివర్లో తీసుకుంటే.. ‘వ్యాక్సిన్‌ సరిగా పని చేయదనుకుంటా. అందుకే ఆఖరున తీసుకున్నాడని’ అంటారు. ఏం చేసినా తప్పు పట్టడం మాత్రం సాధారణమే’‌ అన్నారు ట్రంప్‌. వ్యాక్సిన్ ముందుగా తీసుకున్నా, లేక చివరలో తీసుకున్నా చెడ్డపేరు మాత్రం తనకే వస్తుందని ట్రంప్ వెల్లడించారు. 

వచ్చే డిసెంబరు నాటికి ఫైజర్, బయోఎంటెక్  కోవిడ్-19 వ్యాక్సిన్ 100 మిలియన్ల డోసుల పంపిణీ కోసం అమెరికా 1.95 బిలియన్ డాలర్లను మదుపుపెట్టింది. ఈ సందర్భంగానే ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో వరుసగా మూడవ రోజు 1000కి పైగా కరోనా మరణాలు నమోదయ్యాయి. యూఎస్‌ఏలో ఇప్పటివరకు 40 లక్షలకు పైగా కరోనావైరస్ కేసులు, 1.4 లక్షల మరణాలు సంభవించాయి. 

కరోనా కట్టడికి చైనాతో అయినా సరే కలిసి పనిచేస్తాం, కాగా కరోనా వ్యాక్సిన్‌ను చైనాతో సహా ముందుగా ఎవరు అభివృద్ధి చేసినా వారితో పనిచేసేందుకు తాము సిద్ధమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టం చేశారు. తొలి కరోనా వ్యాక్సిన్‌ను చైనా అభివృద్ధి చేస్తే డ్రాగన్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధమా అన్న ప్రశ్నకు ట్రంప్‌ బదులిస్తూ మనకు మంచి ఫలితాలను అందించే ఎవరితోనైనా పనిచేసేందుకు తాము సిద్ధమనేని అన్నారు. 

కోవిడ్‌-19కు ఔషధాల తయారీతో పాటు వ్యాక్సిన్‌ అభివృద్ధిలో అమెరికాలో పురోగతి సాధించామని ట్రంప్‌ పేర్కొన్నారు. కరోనా నియంత్రణలో కీలకమైన వ్యాక్సిన్‌ ఆశించినదాని కంటే ముందుగానే మార్కెట్‌ లోకి వస్తుందని, అమెరికా సైన్యం వ్యాక్సిన్‌ పంపిణీలో సహకరిస్తుండటంతో సత్వరమే అందరికీ అందుబాటులోకి వస్తుందని చెప్పారు.

గత ఏడాది చైనాలోని హుబే ప్రావిన్స్‌ వుహాన్‌ నగరంలో మొదలైన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కరోనా వైరస్‌ వ్యాప్తిపై వాస్తవాలను చైనా దాచిందని ట్రంప్‌ పదేపదే విమర్శిస్తూ ప్రాణాంతక వైరస్‌ను చైనీస్‌ వైరస్‌గా పలు సందర్భాల్లో అభివర్ణించారు.

 

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   2 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   19 hours ago


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   20 hours ago


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


స్వచ్చభారత్ లేకుంటే కరోనాతో దేశం ధ్వంసమయ్యేది...ప్రధాని మోదీ వ్యాఖ్య

స్వచ్చభారత్ లేకుంటే కరోనాతో దేశం ధ్వంసమయ్యేది...ప్రధాని మోదీ వ్యాఖ్య

   09-08-2020


భారత్ ని వేడుకొంటున్న చైనా.. వెనక్కు పోయాం.. నమ్మండి ప్లీజ్

భారత్ ని వేడుకొంటున్న చైనా.. వెనక్కు పోయాం.. నమ్మండి ప్లీజ్

   09-08-2020


10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

   08-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle