newssting
BITING NEWS :
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థి ఎవరనే అంశంపై అన్నాడీఎంకేలో అసంతృప్తులు. సీఎం ఎడపాడి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం ఎవరికివారు నేనంటే నేనే అంటూ వాదులాడుకునే స్థాయికి చేరిన వివాదం. వివాదానికి తెరదించేలా అక్టోబరు 7న అధికారిక ప్రకటిన చేయనున్నట్లు స్పష్టం చేసిన పార్టీ * కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టం బిల్లు ఆమోదాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన కేరళకు చెందిన కాంగ్రెస్‌ ఎంపీ టీఎన్‌ ప్రతాపన్‌. వ్యవసాయ రంగం అనేది రాష్ట్ర పరిధిలోని అంశమని, కేం‍ద్రప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరిస్తోందని సుప్రీం పిటిషన్ లో పేర్కొన్న ఎంపీ. కేం‍ద్రప్రభుత్వం తీసుకువచ్చిన ఈ మూడు చట్టాలు రాజ్యాంగ విరుద్దమని, చెల్లదని రద్దుచేయాలంటూ సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరిన ఎంపీ * అసోం మాజీ మహిళా ముఖ్యమంత్రి సైదా అన్వర తైమూర్ (84) అనారోగ్యంతో ఆస్ట్రేలియాలో కన్నుమూత. అసోం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా 4 దశాబ్దాల పాటు పనిచేసిన సైదా అన్వర తైమూర్. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సైదా అన్వర అసోం మొట్టమొదటి మహిళా సీఎం. గత కొన్నేళ్లుగా ఆస్ట్రేలియాలో ఉన్న తన కుమారుడి వద్ద ఉంటున్న సైదా అన్వర తీవ్ర అనారోగ్యానికి గురై కన్నుమూత * బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి(61)కి కరోనా సోకిన సంగతి తెలిసిందే. హిమాలయాల పర్యటనలో ఉండగా స్వల్ప జ్వరం రావడంతో పరీక్షలు చేయగా పాజిటివ్‌ ఫలితాలు. రిషికేశ్‌ ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చేరినట్లుగా ట్వీట్. తన డ్రైవర్‌కు పాజిటివ్‌ వచ్చిందని, అతడి ద్వారా వ్యాపించి ఉంటుందని ట్వీట్ లో వెల్లడించిన ఉమా భారతి * రైలు ప్రయాణికుల నెత్తిన చార్జీల భారం మోపేందుకు రైల్వే శాఖ కసరత్తులు. అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దిన రైల్వే స్టేషన్ల ప్రయాణికులపై చార్జీల మోత. ప్రయాణికుడు కొనుగోలు చేసే టికెట్ ధరను బట్టి పెరుగుదలకు అవకాశం. గరిష్ఠంగా రూ.35 నుండి కనిష్ఠంగా పది రూపాయల వరకు వసూలు చేయనున్న వినియోగ రుసుము* దేశవ్యాప్తంగా మొత్తం 7 వేల రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వీటిలో రద్దీగా ఉండే స్టేషన్లలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించి వినియోగ రుసుమును వసూలు చేస్తామని రైల్వే శాఖ ఇది వరకే ప్రకటించింది. ఇలా అభివృద్ధి చేసిన స్టేషన్లు దాదాపు 1000 వరకు ఉన్నాయి. రైల్వే శాఖ ప్రతిపాదనకు కేంద్రం కనుక ఆమోద ముద్ర వేస్తే ఈ స్టేషన్లలోని ప్రయాణికుల జేబులకు చిల్లులు పడడం ఖాయం * నిర్మాణంలో ఉన్న ఓ భవనం ఆకస్మాత్తుగా కుప్పకూలడంతో ముగ్గురు దుర్మరణం. గుజరాత్ రాష్ట్రంలోని వడోదర నగరంలో సోమవారం రాత్రి జరిగిన ఘటన. బావామాన్ పురా ప్రాంతంలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న భవనం. ఈ ఘటనలో అక్కడికక్కడే మరణించిన ముగ్గురు వ్యక్తులు. కరోనా బారిన పడ్డ ఒడిశా డిప్యూటీ స్పీకర్ రజనీకాంత్ సింగ్‌తోపాటు 11 మంది ఎమ్మెల్యేలు. నేటి నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు, పాత్రికేయులకు ప్రత్యేకంగా కరోనా పరీక్షలు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్, 11 మంది ఎమ్మెల్యేలకు కరోనా సోకినట్టు నిర్ధారణ * ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి అధికంగా సాగుతున్న వరద నీటి ప్రవాహం. జలాశయం 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటి విడుదల చేస్తున్న అధికారులు. జలాశయం ఇన్ ఫ్లో 2,05,017 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 3,06,819 క్యూసెక్కులు. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. 883.90 అడుగులకు చేరిన ప్రస్తుతం నీటి మట్టం * తమ భూములకు సరైన నష్టపరిహారం చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన సినీ నటుడు కృష్ణంరాజు. గన్నవరం ఎయిర్‌పోర్ట్ విస్తరణలో తమ భూమికి సరైన నష్టపరిహారం చెల్లించాలని పిటిషన్ దాఖలు. పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసిన హైకోర్టు * దేశంలో సోమవారం నుండి ప్రారంభమైన వాయువ్య భారతం నుంచి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ. రాజస్థాన్‌లోని జైసల్మీర్‌, బికనీర్‌ల నుంచి ఈనెల 17నే ఉపసంహరణ ప్రారంభం కావాల్సి ఉండగా, ఈసారి 11 రోజులు ఆలస్యం. ఏపీ నుంచి అక్టోబరు 15న రుతుపవనాలు నిష్క్రమిస్తాయని అంచనా. కాగా, దక్షిణ ఏపీలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. దీని ప్రభావంతో రాష్ట్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం * నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం. 18 క్రస్టు గేట్లు 10 ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 3,10,631 క్యూసెక్కులు కాగా పూర్తి స్థాయి నీటి నిల్వ 312.0450 టీఎంసీలు, ప్రస్తుత నీటి నిల్వ 309.6546 టీఎంసీలుగా నమోదు. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుత నీటిమట్టం 589.20 అడుగులకు చేరిక * మూసీ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం అధికంగా ఉండటంతో 2 గేట్ల నుంచి నీటి విడుదల చేస్తున్న అధికారులు. ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 645 అడుగులు(4.46టీఎంసీలు) కాగా 644 అడుగుల(4.20టీఎంసీలు)కు చేరిన ప్రస్తుత నీటి మట్టం. అలాగే ఇన్ ఫ్లో 4,505 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 3,978 క్యూసెక్కులుగా నమోదు * కీసర మాజీ తహసీల్దార్‌ నాగరాజు లంచం కేసులో అరెస్టయిన ముగ్గురు సహనిందితులకు ఏసీపీ ప్రత్యేక కోర్టు బెయిల్‌ మంజూరు. చేసింది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి శ్రీనాథ్‌యాదవ్‌, మధ్యవర్తి అంజిరెడ్డి, వీఆర్‌ఏ సాయిరాజ్‌కు బెయిల్‌

కరోనా విలయంతో ఇండియా విలవిల- దేశంలో అరకోటి దాటిన కరోనా కేసులు

16-09-202016-09-2020 18:47:43 IST
Updated On 16-09-2020 18:47:40 ISTUpdated On 16-09-20202020-09-16T13:17:43.899Z16-09-2020 2020-09-16T13:16:10.224Z - 2020-09-16T13:17:40.978Z - 16-09-2020

కరోనా విలయంతో ఇండియా విలవిల- దేశంలో అరకోటి దాటిన కరోనా కేసులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా రికవరీలో ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో భారత్ ఉందంటూ ప్రభుత్వాలు ఘనంగా గొప్పలు చెప్పుకుంటున్న వేళ దేశంలో కరోనా కేసుల సంఖ్య అరకోటికి చేరుకుంది. రోజుకు తక్కువలో తక్కువ 90 వేల మందికి కొత్తగా కరోనా సోకుతోంది. కనిష్టంలో కనిష్టం రోజుకు వెయ్యి మంది వరకూ మహమ్మారి కాటుకు మృత్యువాత పడుతున్నారు.

దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రత విలయం సృష్టిస్తున్నది. గత పక్షం రోజులుగా రోజుకు హీనపక్షం 90వేల పాజిటివ్ కేసులు నమోదౌతున్నాయి. మరణాల సంఖ్య దగ్గరదగ్గర రోజుకు వెయ్యి దాటుతోంది. ప్రపంచంలోనే అత్యధిక కేసులు నమోదైన దేశాల జాబితాలో భారత్ పై నుంచి రెండో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో అమెరికా కొనసాగుతోంద. బ్రెజిల్, రష్యాలలో కూడా కరోనా వ్యాప్తి తీవ్రంగానే ఉన్నప్పటికీ భారత్ లో కేసుల నమోదు జోరు చూస్తుంటే అత్యధిక కేసుల దేశాల జాబితాలో తొలి స్థానాన్ని అక్రమించడానికి ఎన్నో రోజులు పట్టదనిపిస్తున్నది.

కరోనా కట్టడి చర్యలు సమర్ధంగా అమలు చేయడం వల్ల ప్రాణనష్టాన్ని తగ్గించగలిగామని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్థన్ ఘనంగా ప్రకటిస్తూ..దేశంలో కరోనా మరణాల సంఖ్య ప్రపంచ దేశాలతో పోలిస్తే చాలా స్వల్పమనీ, రికవరీ విషయంలో కూడా భారత్ ఎంతో ముందుందనీ చెబుతున్నారు. గణాంకాల కంటే ప్రజలకు కావలసింది ఫలితం.

కరోనా సోకుతుందన్న భయంతో బతుకీడ్చాల్సిన పరిస్థితి ప్రస్తుతం దేశంలో ఉంది. కరోనా మహమ్మారి విషయంలో ఎవరూ అతీతులు కారని సంపన్నులూ, సామాన్యులూ అన్న తేడా లేదనీ ఇప్పటి వరకూ కరోనా కేసుల తీరు చూస్తే అర్ధమౌతుంది. ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, విపక్ష నేతలు ఇలా రాజకీయ నాయకుల నుంచి కళాకారులు, క్రీడాకారులు, పారిశ్రామిక వేత్తలు, సామాన్యులు అన్న తేడా లేకండా అన్ని వర్గాల వారూ కరోనా బారిన పడ్డారు. లాక్ డౌన్ సమయంలో రోజుకు వందల సంఖ్యలో కేసులు నమోదౌతున్న సమయంలో దేశంలో కరోనా కట్టడి చర్యలు పకడ్బందీగా అమలు చేసిన ప్రభుత్వాలు...అన్ లాక్ ప్రక్రియ ఆరంభమైన తరువాత మౌలిక భద్రతను పట్టించుకోవడం మానేశాయి. పేరుకు కంటైన్మెంట్ జోన్లు అని బోర్డులు తగిలించి చేతులు దులిపేసుకున్నాయి. ఆ నిర్లక్ష్యం, నిర్లిప్తత ఫలితమే నేటి పరిస్థితి.

లాక్ డౌన్ సమయంలో వలస కార్మికుల సంఖ్య విషయంలోనూ, వారి కష్టాల విషయంలోనూ ఎలాంటి అంచనా, అవగాహనా లేకుండా కేంద్రం వ్యవహరించిన తీరే మహమ్మారి మూరుమూల గ్రామాలకు సైతం విస్తరించడానికి కారణమైందన్నది కాదనలేని సత్యం. తొలి రోజుల్లో అర్బన్ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన కరోనా వ్యాప్తి...దశల వారీ అన్ లాక్ లు ప్రారంభం కాగానే దేశం నలుమూలలలకూ, మారుమూల పల్లెలకూ విస్తరించింది. ఇప్పటికైనా అన్ లాక్ 4 ముగియవస్తున్న ఈ తరుణంలో అన్ లాక్ 5 అంటూ మరిన్ని మినహాయింపులు ఇవ్వకుండా కరోనా కట్టడి...అదే సమయంలో కరోనా కష్టాల నుంచి జనాన్ని కాపాడడానికి కేంద్రం నిర్దుష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. వర్షాకాలం, శీతాకాం సీజనల్ వ్యాధులు ప్రబలడం సహజం.

కరోనా కాలంలో ఆ మామూలు సీజనల్ వ్యాధులకు వైద్యులు అందుబాటులో ఉండని పరిస్థితి ఉంది. అంతే కాకుండా సీజనల్ గా వచ్చే జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కరోనా సింప్టమ్స్ కూడా కావడంతో మూములూ జలుబు, దగ్గుకు కూడా ప్యానిక్ అయ్యే ప్రమాదం ఉంది. ఇది మరింత ప్రమాదకరం. దేశంలో ఆరోగ్య రక్ష వ్యవస్థను లాక్ డౌన్ సమయలో పటిష్టం చేశామని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ...ప్రైవేటు కోరలకు కరోనా బాధితుడిని అప్పగించడం వినా  మరేం కనిపించడం లేదు. ఇప్పటికీ కరోనా బాధితులకు ప్రభుత్వ పరంగా అందుతున్నది అరకొర వైద్యమేననడంలో సందేహం లేదు.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle