newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

కరోనా రోగుల సంఖ్య వందలోపే.. కానీ 4 వేలమందిపై ప్రభావం

15-03-202015-03-2020 08:27:53 IST
2020-03-15T02:57:53.013Z15-03-2020 2020-03-15T02:57:47.669Z - - 12-08-2020

కరోనా రోగుల సంఖ్య వందలోపే.. కానీ 4 వేలమందిపై ప్రభావం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో కరోనా వైరస్ బారిన పడిన రోగుల సంఖ్య విషయంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్న సంఖ్య తేడా కొడుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం నాటికి 84 కరోనా వైరస్ కేసులు నమోదైనట్లు చెబుతుండగా రాష్ట్ర ప్రభుత్వాల వద్ద వున్న డేటా ప్రకారం 97 మందికి కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తోంది.

అయితే కరోనా వైరస్ సోకిన రోగుల కంటే వారితో సంబంధంలోకి వచ్చిన వారి సంఖ్య దాదాపు 4 వేలమందికి పెరిగిందని కేంద్రఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇంతవరకు దేశంలో కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలిన 84మంది రోగులతో సంబంధంలో ఉన్న వారు 4 వేలమందికి చేరినట్లు గుర్తించామని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి సంజీవ్ కుమార్ తెలిపారు. వీరందరినీ అదుపులోకి తీసుకుని నిఘాలో ఉంచామన్నారు.

కరోనా వ్యాధిగ్రస్తుల సంఖ్యకంటే వారితో సంబంధంలోకి వచ్చినట్లు అనుమానిస్తున్న వారి సంఖ్య నాలుగు వేలకు చేరడంతో దేశవ్యాప్తంగా అప్రమత్తంగా ఉండాలని ఆయా రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను హెచ్చరించారు. శనివారం నాడు ముంబై, నాగ్‌పూర్, యవత్మల్ ప్రాంతాల్లో కొత్తగా కరోనా వైరస్ బాధితులను గుర్తించడంతో మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 26 పెరిగింది. దీంతో పరిస్థితి భీతావహంగా మారింది.

దీంతో కమ్యూనిటీ నిఘా, క్వారంటైన, ఒంటరి వార్డులు, శిక్షణ పొందిన ఆరోగ్య సిబ్బంది, ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను అన్ని రాష్ట్రాల్లో బలోపేతం చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే కరోనా పాజిటివ్ అని తేలిన రోగులతో సంబంధంలోకి వచ్చిన వారిని క్వారంటైన్ చేయడానికి ప్రయత్నిస్తే చాలా చోట్ల వారు అంగీకరించడం లేదని సమాచారం.

కేరళలో కొత్తగా కరోనా వైరస్ కేసులు నమోదు కాకపోయినప్పటికీ రైలు, రోడ్ మార్గాల ద్వారా రాష్ట్రంలోకి వస్తున్న ప్రజలను తనిఖీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేరళ సరిహద్దుల లోపల ఉన్న తొలి రైల్వే స్టేషన్‌కు వచ్చిన ఇంటర్ స్టేట్ రైళ్లలోని ప్రయాణీకులను ప్రత్యేక బృదం తనిఖీ చేస్తుందని కేరళ సీఎం పినరయి విజయన్ తెలిపారు.

కరోనా వైరస్ రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతండటంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వెయ్యి నుంచి 4 వేలమంది వైరస్ బాధితులను క్వారంటైన్ చేయగలిగే వ్యవస్థల ఏర్పాటుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం 1400 మందిని, 4 వేలమందిని క్వారంటైన్ చేసే ఏర్పాట్లకు ప్రయత్నిస్తుండగా, తెలంగాణ ప్రభుత్వం వెయ్యి పడకలతో కూడిన క్వారంటైన్ కేంద్రాల ఏర్పాటుకు సిద్ధమవుతున్నట్లు తెలిపింది.

కాగా కరోనా అనుమానితులను ఇంటర్వ్యూ చేసిన విలేకరులకు 14 రోజుల గృహ నిర్బంధం తప్పదని మైసూరు జిల్లా కలెక్టర్‌ అభిరాం జయశంకర్‌ శనివారం చెప్పారు. కలబుర్గిలో వైర్‌స్‌తో మృతి చెందిన మహ్మద్‌  సిద్దిఖి కుమారుడిని ఇంటర్వ్యూ  చేసిన ఓ ఉర్దూ చానల్‌ విలేకరితోపాటు కన్నడ చానల్‌కు చెందిన విలేకరి, కెమెరామేన్‌లపైనా నిఘా ఉంచినట్లు కలబుర్గి జిల్లా కలెక్టర్‌ శరత్‌ తెలిపారు. వారిని 14 రోజులు ఇళ్లలోనే గడపాలని ఆదేశించామన్నారు.

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   9 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   10 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   12 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   21 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle