newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

కరోనా రోగి అనుభవం మనందరికీ కావాలి గుణపాఠం

23-03-202023-03-2020 08:39:25 IST
Updated On 23-03-2020 08:39:43 ISTUpdated On 23-03-20202020-03-23T03:09:25.746Z23-03-2020 2020-03-23T03:09:18.536Z - 2020-03-23T03:09:43.323Z - 23-03-2020

కరోనా రోగి అనుభవం మనందరికీ కావాలి గుణపాఠం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశాలకు దేశాలే కరోనా మహమ్మారి బారినపడి వేలాదిమంది పిట్టల్లాగా రాలిపోతున్న తరుణంలో.. కరోనా గురించి ఆందోళన చెందవద్దని, కాస్త అవగాహన పెంచుకుంటే చాలు కరోనా నుంచి సులువుగా బయటపడవచ్చని ఒక అమెరికన్ కరోనా రోగి చెబుతోంది. ఆమె అనుభవం మనందరికీ గుణపాఠం కావాలి.

కరోనా వైరస్ ఎంత సులువుగా మనపై సోకుతుందో ముందుగా అర్థమైతే దాని బారినుంచి బయటపడటం అంత సులభమని ఆమె చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండీ అవుతున్నాయి. ఫిబ్రవరి మూడోవారంలో ఒక చిన్న హౌస్ పార్టీకి హాజరయ్యాయని దానికి హాజరైనవారిలో 40 శాతం మంది మూడురోజుల్లోపే కరోనా జ్వర లక్షణాల బారిన పడ్డారని ఆమె వివరించింది. ఒక్క రోగిలో కరోనా లక్షణాలు మిగిలిపోయినా మొత్తం సమజానికంతటికీ అది ప్రమాదరకమని, మనుషులుందరి నుంచి దాన్ని దూరం చేయడం ఒక్కటే కరోనా వ్యాప్తి నిరోధానికి కీలకమని ఆమె చెబుతోంది.

వివరాల్లోకి వెళితే.. ఆమెరికాకు చెందిన ఓ యువతి తాను కరోనా వైరస్‌ బారిన పడ్డానని.. ప్రస్తుతం కోలుకుంటున్నానని శనివారం తన ఫేస్‌బుక్‌ ఖాతాలో ప్రకటించింది. ఈ వైరస్‌పై ఒత్తిడి, ఆందోళన వద్దని.. అవగాహనతో వైరస్‌ బారి నుంచి బయటపడొచ్చని తెలిపింది. అమెరికాలో నివసిస్తున్న ఎలిజబెత్ షినెడర్ (Elizabeth Schneider) అనే యువతి కరోనాపై బయటపడాల్సిన అవసరం లేదని సరైన అవగాహనతో వైరస్‌ను తగ్గించుకోవచ్చని చెప్పింది. 

చాలామందికి 40 లేక 50 సంవత్సరాల వయసుదాటిన వారికే కరోనా వస్తుందని చెబుతున్నారు కానీ యవ్వనంలో ఉన్నవారికి అది రాకూడదని నియమం లేదని 35 ఏళ్ల వయసులో తనకు ఈ వైరస్ సోకిందని, అంత సులువుగా కరోనా తనను సమీపిస్తుందని నమ్మలేకపోయానని ఆమె చెప్పింది. హౌస్ పార్టీలో ఏ ఒక్కరికీ దగ్గు, జలుబు లక్షణాలు కనబడలేదని కానీ మూడు రోజుల తర్వాత దానికి హాజరైనవారిలో 40 శాతం మంది కరోనాలక్షణాలకు గురయ్యారని షాకింగ్ న్యూస్ చెప్పిందామె.

‘ఫిబ్రవరి చివరలో ఒక చిన్న హౌస్ పార్టీకి వెళ్లాను. ఆ తర్వాత మొదట నాకు తేలికపాటి పొడి దగ్గు, గొంతు నొప్పితో ప్రారంభమైంది. ఆ తర్వాత కాసేపటికి అలసటగా అనిపించింది. ఆ మరుసటి రోజు అసౌకర్యంగా అనిపించడమే కాకుండా చలిజ్వరం వచ్చింది. ఆ తర్వాత కళ్లు మంటగా అనిపించి నీరు కారడం మొదలైంది. దీనికితోడు తలనొప్ప కూడా రావండంతో ఓ రోజు మొత్తం  విశ్రాంతి తీసుకున్నాను. కానీ ఆ తర్వాత రోజు తీవ్రత మరింత ఎక్కువైంది’ అంటూ ఆమె ట్వీట్‌ చేసింది.

అంతేకాకుండా ‘‘పొడిదగ్గు, గొంతు నొప్పి, జ్వరం, ముక్కు నుంచి అతిగా నీరు కారడం, ఇంకా ఆలసటగా అనిపించడంతో డాక్టర్‌ను సంప్రదించాలని నిర్ణయించుకున్నాను. ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నాను. పరీక్షలో నెగటివ్‌ వచ్చింది. డాక్టర్లు కూడా ఫ్లూ లేదా ఇతర ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవని తేల్చారు. అయితే ఇంటికి వచ్చాక కాస్తా ఆలసట, జ్వరం తగ్గినప్పటీకీ.. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డాను. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన కరోనా వైరస్‌ లక్షణాలను కనుగొన్నాను. దీంతో భయపడి కరోనా పరీక్షలు చేయించుకోవాలని నిర్ధారించుకున్నా’’  అంటూ ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చారు. 

ఇక మరుసటి రోజు ఆసుపత్రికి కరోనా పరీక్షలు చేయించుకున్నానని. చివరకూ కరోనా పాజిటివ్‌ వచ్చిందని చెప్పింది. వెంటనే తనకు తానుగా ఐసోలేషన్‌కు వెళ్లినట్లు పేర్కొంది. ఈ క్రమంలో రోజూ కాస్తా ఎండలో ఉండటంతో పాటు, అమెరికా వ్యాధి నియంత్రణ నివారణ కేంద్రాలు (సీడీసీ) సూచించిన జాగ్రత్తలు తీసుకుంటున్నానని ఎలిజబెత్ షెనిడర్ చెప్పారు. ఇక క్రమంగా నాలోని వ్యాధి లక్షణాలు తగ్గడం ప్రారంభమైందని, ఇప్పటికీ స్వీయ నిర్భంధంలోనే ఉన్నానని తెలిపింది. 

కరోనా వ్యాధి సోకాక 10 నుంచి 16 రోజులపాటు అస్వస్థత ఉంటుంది. అసలు సమస్య ఏమిటంటే మనలో కాస్త దగ్గు ఉన్నా, శ్వాస సమస్య ఏర్పడినా పరీక్ష చేయించుకోవడానికి ఒప్పుకోం. మొదట్లో నేనుకూడా మామూలు జ్వరమే అనుకున్నా. డాక్టర్లు కూడా ఫ్లూ లక్షణాలు లేవని చెప్పడంతో సరిపెట్టుకున్నాను. కానీ కరోనా లక్షణాలు ఇవీ అని ఆన్‌లైన్‍లో చదివాక సందేహం వచ్చింది. వెంటనే కరోనా వ్యాధి నిర్ధారణ కేంద్రానికి వెల్లి పరీక్ష చేయించుకుంటే పాజిటివ్ అని తేలింది. మార్చి 9 నాటికి నాలో కరోనా వైరస్ లక్షణాలు బయటపడి 13 రోజులయ్యాయి. నా జ్వరం తగ్గుముఖం పట్టాక 72 గంటల పాటు ఏకాంతంలో ఉన్నాను. వ్యాధిలక్షణాలు బయటపడ్డాక 7 రోజులు, జ్వరం తగ్గాక మరో 72 గంటలు ఏకాంతంలోనే ఉండాలని డాక్టర్లు చెప్పిన మాట పాటిస్తున్నానని ఆమె చెప్పింది.

నా స్నేహితులు అనేకమంది కరోనా వైరస్ బారినపడ్డాక నా అనుభవం తప్పకుండా పంచుకోవాలని చెప్పడంతో ఇలా మీముందుకు వచ్చాను. నా అనుభవం మీకు మంచి సమాచారాన్ని ఇస్తుందని, మనసును శాంతపరుస్తుందని భావిస్తున్నానని ఎలిజబెత్ షెనిడర్ చెప్పింది. కాస్త తలనొప్పి, కాస్త జ్వరం, తర్వాత ఒళ్లు నొప్పులు,  కీళ్ల నొప్పులు, 3  రోజుల తర్వాత తీవ్రంగా నిస్సత్తువ ఏర్పడిందంటే ఏమాత్రం జాగు చేయకుండా వెంటనే కరోనా నిరోధక కేంద్రానికి వెళ్లి తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని, నిర్ధారణ అయ్యాక పూర్తిగా ఏకాంతంలో ఉండాలని షెనిడర్ చెప్పింది.

103 డిగ్రీల జ్వరం వచ్చి తర్వాత 100కి ఆ తర్వాత 99.5 డిగ్రీల వరకు తగ్గుతుందని, కొందరికి ముక్కుదిబ్బడ ఏర్పడుతుందని, గొంతు నొప్పి వస్తుందని, కొందరికి గొంతు గరగరమంటూ దగ్గుకూడా వస్తుందని, కొద్దిమందికి గుండె భారంగా అనిపిస్తుందని, ఇతర శ్వాస సమస్యలు కూడా ఏర్పడతాయని ఆమె చెప్పింది

కరోనా వ్యాధి నివారకు సంబందించిన రెండు డెడ్ లైన్లూ నేను దాటేశాను. ఇప్పుడు నేను ఏకాంతంలో లేను. కానీ జనం ఎక్కువగా ఉన్న చోట్లకు నేను వెళ్లడం లేదు. పబ్లిక్‍లో ఎవరైనా నన్ను చూసినా నేను ఎవరి దగ్గరకూ వెళ్లడం లేదు. కానీ నేను ఆసుపత్రికి వెళ్లలేదు. ఇంట్లోనే ఉండి కరోనా వైరస్‌ని నయం చేసుకున్నాను. కరోనా వైరస్‌కి గురైన అందరినీ ఏ దేశమైన సరే ఆసుపత్రుల్లో పెట్టలేదు. కరోనా అని తేలిన తర్వాత నేను ఏ డాక్టర్ వద్దకూ వెళ్లలేదు. ఇంట్లోనే ఉండి నాకు నేనుగా ఆ వైరస్ నుంచి బయటపడ్డాను అని ఎలిజబెత్ చెప్పింది.

మాకు జ్వరం లేక జలుబు మాత్రమే చేసింది. మాకెందుకు పరీక్షలు అంటూ నిర్లక్ష్యం ప్రదర్శించినవారే పబ్లిక్‌లోకి వెళ్లి కరోనా వైరస్‌ని వ్యాప్తి చేస్తున్నారు కాబట్టి ఈ ఒక్క జాగ్రత్త తీసుకుని ఎవరికి వారు కరోనా పరీక్షలు చేయించుకుంటే చాలు వైరస్‌ని సులువుగా అరికట్టవచ్చని ఆమె చెప్పింది.

ఇక ఈ ట్వీట్‌కు ఇప్పటి వరకు 1.1 మిలియన్ల హార్ట్‌ ఎమోజీలు రాగా వాటి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ విషయాన్ని పంచుకున్నందుకు ఎలిజబెత్ షెనిడర్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

‘ఇది నిజంగా అద్భుతం. ఈ విషయాన్ని మాతో షేర్‌ చేసుకున్నందుకు ధన్యవాదాలు’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కాగా ప్రాణాంతక కరోనా వైరస్‌ వ్యాపించకుండా ప్రపంచ దేశ ప్రభుత్వాలు అవగాహన చర్యలు చేపడుతున్నాయి. ప్రముఖులు సెలబ్రెటీలు సైతం కరోనా వ్యాప్తి చెందకుండా తమ వంతు కృషి చేస్తున్నారు. ఇక కరోనాను అరికట్టేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ‘జనత కర్ఫ్యూ’ దేశ ప్రజలకు పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే.

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   3 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   3 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   6 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   14 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle