newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

కరోనా రోగికి 14 రోజుల క్వారంటైన్ శిక్షేనా.. లాన్సెట్ స్పష్టీకరణ

16-03-202016-03-2020 11:44:29 IST
2020-03-16T06:14:29.005Z16-03-2020 2020-03-16T06:14:26.576Z - - 03-08-2020

కరోనా రోగికి 14 రోజుల క్వారంటైన్ శిక్షేనా.. లాన్సెట్ స్పష్టీకరణ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా రాజకీయనాయకులను, విధాన నిర్ణేతలను, జర్నలిస్టులను, మెడికల్ జర్నల్ సంపాదకులను కూడా బోలెడు పనిపెడుతోంది. ఈ తాజా వైరస్ గురించిన  ప్రచారానికి అంతే లేకుండా పోతోంది. కరోనా వ్యాధిగ్రస్తులను ఏకాంతంగా ఉంచటం, ఈ ప్రక్రియలో జరుగుతున్న జాప్యం, వాక్సిన్‌ తయారీ ప్రయత్నాలు, రాజకీయ నాయకుల మానసిక స్థితి వంటి అనేక అంశాలు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశంలోని వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రాలను అప్రమత్తం చేయడంలో పరమ నిర్లక్ష్యం చేయడం అమెరికన్లను దిగ్భ్రాంతి కలిగిస్తోంది. 

అదేసమయంలో ప్రపంచంలో ఇప్పటికే 3 కోట్ల 80 లక్షలమంది ప్రజలు హెచ్ఐవి ప్రభావానికి గురయ్యారని, 7,70,000 మంది ప్రజలు ప్రతిఏటా ఎయిడ్స్ రోగంతో చనిపోతున్నారనే వాస్తవాన్ని పక్కనబెట్టి లక్షమందికి మాత్రమే సోకిన కరోనా వైరస్ కు మితిమీరిన ప్రచారం కలగిస్తున్నారు. ఈ నేరథ్యంలో అంతర్జాతీయ ప్రముఖ వైద్య పత్రిక ది లాన్సెట్ తాజాగా పొందుపర్చిన నివేదక.. కరోనాపై అత్యంత శాస్త్రీయమైన అంచనాను అందించి ప్రపంచానికి భరోసా కలిగిస్తోంది. వైరస్‌ సోకడాన్ని సకాలంలో గమనించి వైద్య సహాయం అందిస్తే అది హెచ్ఐవి, ఎయిట్స్ లనుమించిన మహమ్మారిగా మారిపోదని లాన్సెట్ తాజా నివేదిక చెబుతోంది.

కరోనా ప్రపంచదేశాలను హడలెత్తిస్తోంది. ఈ వైరస్‌ మనిషిలో ఎన్ని రోజులు ఉంటుంది  ఏ రోజుల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుంది  వైరస్‌ సోకితే ఏ లక్షణం మొట్టమొదట బయటకి వస్తుంది  ఈ సందేహాలకు సమాధానాలను ప్రముఖ జర్నల్‌ లాన్సెట్‌ ఒక నివేదికలో వెల్లడించింది. చైనాలోని వూహాన్‌ పల్మనరీ ఆస్పత్రిలో కరోనా బాధితులు 191 మందిని ఎంపిక చేసుకొని మూడు వారాల పాటు వారిని నిశితంగా పరిశీలించి రూపొందించిన నివేదికని తాజా సంచికలో ప్రచురించింది. 

లాన్సెట్‌ నివేదిక ప్రకారం ఈ వైరస్‌ సోకిన వెంటనే ఎలాంటి లక్షణాలు కనిపించవు. అయిదు రోజుల తరవాత జ్వరం, గొంతు నొప్పి, జలుబుతో మొదలవుతుంది. ఒక్కోసారి లక్షణాలు బయటపడడానికి 14 రోజులు కూడా పడుతుంది. అందుకే విదేశాల నుంచి వచ్చిన వారిని 14 రోజుల పాటు నిర్బంధంలో ఉంచాలని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా వైరస్‌ మన శరీరంపై ప్రభావం చూపించడం ప్రారంభించాక ఏయే రోజుల్లో ఎలాంటి లక్షణాలు వస్తాయంటే.. 

గొంతు నుంచి ఊపిరితిత్తులు, అక్కడ్నుంచి రక్తంలోకి వైరస్ పాకుతుంది. కరోనా వ్యాధి ప్రక్రియలోని వివిధ దిశలు

1-3 రోజులు:

కరోనా వైరస్‌ శరీరంపై ప్రభావం చూపించగానే మొదట జ్వరం వస్తుంది. గొంతు నొప్పి, దగ్గు, జలుబు వంటివి మూడో రోజు నుంచి కనిపిస్తాయి. కరోనా బాధితుల్లో లక్షణాలు ఇలా మొదలైన వారు 80% మంది.

4-9 రోజులు:

మూడు నుంచి నాలుగు రోజుల మధ్య ఈ వైరస్‌ ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తుంది. దీంతో శ్వాస తీసుకోవడంలో సమస్యలు తలెత్తుతాయి. జ్వరం కూడా పెరుగుతుంది. తొమ్మిది రోజులు గడిచేసరికి ఊపిరి అందడం చాలా కష్టమవుతుంది. కొంతమందిలో గ్యాస్ట్రిక్‌ సమస్యలు కూడా తలెత్తాయి. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నవారు 14% మంది.

8-15 రోజులు:

ఊపిరితిత్తులకు చేరిన ఇన్‌ఫెక్షన్‌ రక్తంలోకి వస్తుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన స్థితి. ప్రాణాంతకమైన సెప్సిస్‌ (బ్లడ్‌ ఇన్‌ఫెక్షన్‌) ఒక వారం తర్వాత మొదలవుతుంది. అప్పట్నుంచి రెండు వారాల పాటు బాధితుల్ని కాపాడుకోవడానికి అత్యంత జాగరూకత అవసరం. ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో ఉంచి వారికి చికిత్స అందించాలి. బాధితుల్లో ఈ పరిస్థితి వచ్చిన వారు 5% మంది.

3 వారాల తర్వాత

రోగనిరోధక శక్తి అధికంగా ఉండి మరే ఇతర జబ్బులు లేని వారు మూడు వారాలు చికిత్స ఇస్తే కరోనాను జయించడం సులభమే. హైపర్‌ టెన్షన్‌ వంటి వ్యాధులు ఉండి వయసు మీద పడిన వారికి ఈ వైరస్‌ను ఎదుర్కోవడం కష్టం 

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   4 hours ago


చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

   8 hours ago


అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

   20 hours ago


నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

   02-08-2020


అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

   02-08-2020


అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

   02-08-2020


కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

   01-08-2020


అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి..  తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి.. తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

   01-08-2020


కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

   01-08-2020


ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

   01-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle