newssting
BITING NEWS :
*కరోనా కట్టడిలో అన్ని వర్గాల కృషిని ప్రశంసించిన ప్రధాని మోడీ. మన్ కీ బాత్ లో పలు అంశాలను ప్రస్తావించిన మోడీ ఆత్మనిర్భర భారత్ ద్వారా ఆర్థికవ్యవస్థకు ఊతం *తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. కొత్తగా 74, మరణాలు 77, మొత్తం కేసులు 2499 * జూన్ 30 వరకూ ఐదవ విడత లాక్ డౌన్.. పలు సడలింపులు *దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం..ఈ సారి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు..కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం*మాల్స్, రెస్టారెంట్లు జూన్ 8 వ తేదీ నుంచి పునఃప్రారంభం..కర్ఫ్యూ సమయం కుదింపు..దేశ వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ*ఆదివారం మన్ కీ బాత్ లో పలు వివరాలు వెల్లడించనున్న ప్రధాని మోడీ * మాల్స్, రెస్టారెంట్ల, దేవాలయాలు, చర్చిలు జూన్ 8 నుంచి ప్రారంభం *పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలు ప్రారంభంపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం *విద్యాసంస్థల ప్రారంభంపై జూలైలో నిర్ణయం*నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామక ఉత్తర్వులు వెనక్కి *ఏపీలో మొత్తం కేసులు 3461

కరోనా మృత్యుఘోషలో భారత్.. ఒక్కరోజులో 132 మంది మృతి.. 5,609 పాజిటివ్ కేసులు

22-05-202022-05-2020 10:10:59 IST
Updated On 22-05-2020 10:14:15 ISTUpdated On 22-05-20202020-05-22T04:40:59.745Z22-05-2020 2020-05-22T04:40:57.933Z - 2020-05-22T04:44:15.414Z - 22-05-2020

కరోనా మృత్యుఘోషలో భారత్.. ఒక్కరోజులో 132 మంది మృతి.. 5,609 పాజిటివ్ కేసులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో కరోనా మృత్యుఘోష ఇప్పట్లో ఆగే పరిస్థితి కనిపించడం లేదు. బుధవారం నుంచి గురువారం వరకు ఒక్క రోజు వ్యవధిలో 5,609 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 132 మంది కోవిడ్‌తో మరణించారు. దీంతో దేశంలో ఇప్పటిదాకా పాజిటివ్‌ కేసులు 1,12,359కి, మొత్తం మరణాలు 3,435కి చేరాయని ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కరోనా కేసులు 63,624 కాగా, 45,299 మంది బాధితులు చికిత్సతో కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. రికవరీ రేటు 40.32 శాతానికి చేరడం కొంత ఉపశమనం కలిగిస్తోంది.

దేశంలో పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా గురువారం పేర్కొన్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే ప్రభుత్వ మర్గదర్శకాల ప్రకారం లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించారు.  

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ సివిల్‌ ఆసుపత్రి ‘కరోనా శ్మశానం’గా మారింది. గుజరాత్‌లో కోవిడ్‌తో 749 మంది కన్నుమూయగా, అందులో దాదాపు సగం.. అంటే 351 మరణాలు అహ్మదాబాద్‌ సివిల్‌ ఆసుపత్రిలో మరణించారు. ఈ హాస్పిటల్‌లో కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ప్రత్యేక రైళ్లలో మహారాష్ట్రలో మాత్రమే ప్రయాణించే వారి టికెట్లను రైల్వే శాఖ రద్దు చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం అంతర్‌ జిల్లా ప్రయాణాలపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

దేశంలో నమోదైన కేసుల్లో 30 శాతానికి పైగా కేవలం మహారాష్ట్రలోనే ఉన్నాయి. అక్కడ మొత్తం 39,297 కరోనా కేసులు నమోదు కాగా, 10,318 మంది కోలుకున్నారు. 1,390 మంది మృతిచెందారు. మహారాష్ట్ర తర్వాత తమిళనాడు(13,191), గుజరాత్‌(12,537), ఢిల్లీ(11,088)లలో కేసులు అధికంగా ఉన్నాయి.  

కాగా ఇంతవరకు వెయ్యిపైగా కరోనా కేసులు నమోదైన రాష్ట్రాలు పశ్చిమబెంగాల్ (3013) ఆంద్రప్రదేశ్ (2602), పంజాబ్ (2005), బీహార్ (1674), తెలంగాణ (1661), కర్నాటక (1462), జమ్మూకశ్మీర్ (1390), ఒడిశా (1052). 

ఇక కరోనా మృతుల విషయానికి వస్తే దేశవ్యాప్తంగా 3,435 మంది చనిపోయారు. మహారాష్ట 1,390 మరణాలతో అగ్రస్థానంలో ఉండగా, గుజరాత్ 749, మధ్యప్రదేశ్ 267, పశ్చిమబెంగాల్ 253, ఢిల్లీ 176, రాజస్తాన్ 147, ఉత్తరప్రదేశ్ 127, తమిళనాడు 87, ఆంద్రప్రదేశ్ 53 మరణాలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

రెండు నెలల తర్వాత కూడా కరోనా మృతుల సంఖ్యలో తెలుగు రాష్ట్రాలు చివరి స్థానాల్లో ఉండటం విశేషం.

లాక్ డౌన్ నియంత్రణ ఇక చాలు.. కరోనాకు భయపడం అంటున్న అమెరికన్లు

లాక్ డౌన్ నియంత్రణ ఇక చాలు.. కరోనాకు భయపడం అంటున్న అమెరికన్లు

   18 hours ago


భారత్ గ్లోబల్ లీడర్‌గా ఎదిగే రోజు సాకారం.. దేశ ప్రజలకు మోదీ లేఖ

భారత్ గ్లోబల్ లీడర్‌గా ఎదిగే రోజు సాకారం.. దేశ ప్రజలకు మోదీ లేఖ

   18 hours ago


 లాక్ డౌన్ పై రాష్ట్రాలదే నిర్ణయం ..ఆ నగరాలపైనే  ఫోకస్

లాక్ డౌన్ పై రాష్ట్రాలదే నిర్ణయం ..ఆ నగరాలపైనే ఫోకస్

   30-05-2020


ఒక్కరోజే 7,466 కరోనా కేసులు.. కరోనా మరణాల్లో చైనాను దాటేసిన భారత్?

ఒక్కరోజే 7,466 కరోనా కేసులు.. కరోనా మరణాల్లో చైనాను దాటేసిన భారత్?

   30-05-2020


ట్విట్టర్‌ను మూసేస్తా : ట్రంప్‌.. తిప్పికొట్టిన సంస్థ సీఈఓ

ట్విట్టర్‌ను మూసేస్తా : ట్రంప్‌.. తిప్పికొట్టిన సంస్థ సీఈఓ

   29-05-2020


కరోనా ఆందోళన.. ప్రపంచంలో 9వ స్థానానికి ఇండియా

కరోనా ఆందోళన.. ప్రపంచంలో 9వ స్థానానికి ఇండియా

   29-05-2020


నేపాల్ ప్రధానికి భారత్ గట్టి కౌంటర్.. కొత్త మ్యాపులకు బ్రేక్

నేపాల్ ప్రధానికి భారత్ గట్టి కౌంటర్.. కొత్త మ్యాపులకు బ్రేక్

   29-05-2020


కాశ్మీర్లో ఐఈడీతో భారీ కుట్ర.. భగ్నం చేసిన భద్రతాదళాలు

కాశ్మీర్లో ఐఈడీతో భారీ కుట్ర.. భగ్నం చేసిన భద్రతాదళాలు

   28-05-2020


లాక్ డౌన్ 5.O.. మరో రెండువారాలు గ్యారంటీనా?

లాక్ డౌన్ 5.O.. మరో రెండువారాలు గ్యారంటీనా?

   28-05-2020


కరోనా వ్యాప్తిలోనే కాదు వేసవి తీవ్రతలోనూ మనమే టాప్

కరోనా వ్యాప్తిలోనే కాదు వేసవి తీవ్రతలోనూ మనమే టాప్

   27-05-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle