newssting
BITING NEWS :
*దేశంలో 20 లక్షల 25 వేల 409 కేసులు.. మరణాలు 41,638*విశాఖ: నేటి నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు వ్యాలీలో సంపూర్ణ లాక్డౌన్.వ్యాపార,వర్తక సంఘాలు నిర్ణయం.మూతపడనున్న ప్రైవేట్ హోటళ్లు*కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మంత్రి కేటీఆర్ లేఖ‌.. వాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల విషయంలో మరింత వికేంద్రీకరణ అవ‌స‌రం.. కోవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి-కేటీఆర్*అనంతపురం : తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద జైలు నుంచి బెయిలుపై విడుదలైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు... కాన్వాయ్ కు అనుమతి లేదంటూ అడ్డగించిన పోలీసులు.. వాగ్వాదం*తూర్పుగోదావరి : అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటీవ్.. హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి*నటుడు సుశాంత్ మరణంపై సిబిఐ కేసు నమోదు.. ప్రియురాలు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు*మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన బిజెపి ఏపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు... ఎపి బిజెపి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు అభినందనలు తెలిపిన చిరంజీవి*రామలింగారెడ్డి భార్యకే ఉపఎన్నికలో టికెట్ ఇవ్వాలి.. ఆమెకు టికెట్ ఇస్తేనే ఆయనకు నిజమైన నివాళి.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్‌తో నేను మాట్లాడతా-జ‌గ్గారెడ్డి*నల్లగొండ జిల్లా: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమా నిలిపివేయాలంటూ అమృత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈనెల 11కు వాయిదా వేసిన కోర్టు*విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు*తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,092 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 73,050కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

కరోనా మృతులు @ 42,000... 8.6 లక్షల మందికి సోకిన వైరస్

01-04-202001-04-2020 09:10:51 IST
Updated On 01-04-2020 09:42:32 ISTUpdated On 01-04-20202020-04-01T03:40:51.595Z01-04-2020 2020-04-01T03:40:49.705Z - 2020-04-01T04:12:32.495Z - 01-04-2020

కరోనా మృతులు @ 42,000... 8.6 లక్షల మందికి సోకిన వైరస్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మృత్యుఘంటికలు మోగిస్తోంది. కోవిడ్‌-19 బారిన పడిన బాధితుల సంఖ్య మంగళవారం నాటికి 8 లక్షలు దాటేసింది. చైనాలో ఈ వైరస్ బయటపడిన తర్వాత కేవలం మూడు నెలల కాలంలో 42000 వేలమంది మరణాలు, 8.6 లక్షలమందికి వైరస్ విస్తరించడం అసాధారణం అంటున్నారు. ఒకవైపుఅమెరికాలో ఇప్పటికే కరోనా పాజిటివ్‌ కేసులు లక్షన్నర దాటిపోగా, తాజాగా ఇటలీలో లక్ష దాటాయి. కరోనా సోకి మృతి చెందిన వారి సంఖ్య 39 వేలు దాటింది. ఇప్పటివరకు అంతర్జాతీయంగా 42,200 మరణాలు నమోదయ్యాయి.

జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ తాజా గణాంకాల ప్రకారం.. అమెరికాలో 188,578 మంది కోవిడ్‌ బారిన పడగా 3,890 మరణాలు సంభవించాయి. తాజాగా 45 మంది మృత్యువాత పడ్డారు. ఇటలీలో 105,799, కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, అత్యధికంగా 12,591 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే కొత్తగా మరణాలు నమోదుకాకపోవడం ఇటాలియన్లకు ఊరట కలిగిస్తోంది. 

మరో యూరోపియన్‌ దేశం స్పెయిన్‌లో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. కోవిడ్‌ బారిన పడుతున్నవారు, ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య వేగంగా పెరుగుతుండటం తీవ్ర భయాందోళన కలిగిస్తోంది. 95,923 మందికి కరోనా సోకగా, 12,591 మంది చనిపోయారు. కొత్తగా 553 మరణాలు నమోదు కావడం స్పెయిన్‌ వాసులను వణికిస్తోంది. బ్రిటన్‌లోనూ తాజాగా 381 మరణాలు సంభవించడంతో యూరప్‌ దేశాలు భీతిల్లుతున్నాయి. బ్రిటన్‌లో 25,150 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 1,789 మంది మృతి చెందారు.

కఠిన ఆంక్షలతో ఐరోపాలో వేలాది మరణాలకు అడ్డుకట్ట

కరోనా కట్టడికి చేపట్టిన చర్యలతో ఐరోపాలో వేల సంఖ్యలో మరణాలను నివారించినట్టు ఓ అధ్యయనం వెల్లడించింది. సామాజిక దూరం పాటించడం, పాఠశాలలను మూసివేయడం, లాక్‌డౌన్‌ వంటి చర్యల కారణంగా బ్రిటన్‌తో సహా 11 ఐరోపా దేశాల్లో కనీసం 59 వేల మరణాలను నివారించగలిగారని లండన్‌ ఇంపీరియల్‌ కాలేజీ పరిశోధకుల అధ్యయం తెలిపింది. సరైన సమయంతో ప్రభుత్వం జోక్యం చేసుకుని చర్యలు చేపట్టడంతో పెను ముప్పు తప్పినట్టు పేర్కొంది. 

ప్రభుత్వం చేపట్టిన చర్యల ఫలితాలను అంచనా వేయడానికి సరికొత్త నమూనాను ఉపయోగించినట్టు తెలిపింది. మార్చి చివరి వరకు 21,000 నుంచి 120,000 మధ్య మరణాలు నివారించబడతాయని లెక్కించినట్టు వివరించింది. ఈ గణాంకాల ఆధారంగా మార్చి 31 నాటికి 59 వేల మరణాలను నివారించే అవకాశముందని అంచనా వేశామని తెలిపింది. 

‘కరోనా వైరస్‌ వ్యాప్తి బాగా తగ్గిపోయే వరకు ఆంక్షలు కొనసాగిస్తే మరణాలను ఇంకా ఎక్కువగా నివారించవచ్చు. ఐరోపాలోని 11 దేశాల్లో 7 నుంచి 43 మిలియన్ల మంది మార్చి 28 నాటికి సార్స్‌-కోవ్‌-2 బారిన పడతారని అంచనా వేశాం. కరోనా మహమ్మారి ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆంక్షలు విధించకపోతే పరిస్థితి ఇంకా భయంకరంగా ఉండేది. సరైన సమయంలో ఆంక్షలు విధించడం అనేది చాలా కీలకమ’ని అధ్యయనకర్త అక్సెల్‌ గ్రాండీ పేర్కొన్నారు. 

ఆస్ట్రియా, బెల్జియం, డెన్మార్క్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, నార్వే, స్పెయిన్‌, స్వీడన్‌, స్విట్జర్లాండ్‌, బ్రిటన్‌ దేశాల్లోని ప్రస్తుత పరిస్థితులు ఆధారంగా అధ్యయం చేసినట్టు వెల్లడించారు. దేశంలోని మొత్తం జనాభాతో పోల్చిచూసినప్పుడు కరోనా సోకిన వారి సంఖ్య ఎక్కువగా ఉన్న యూరప్‌ దేశాల్లో స్పెయిన్‌ ముందువరుసలో నిలిచింది. ఇటలీ రెండో స్థానంలో ఉంది. జర్మనీ, నార్వే దేశాల్లో పరిస్థితి మెరుగ్గా ఉందని అధ్యయంలో తేలింది. 

ఇటలీలో కరోనా పాజిటివ్‌ కేసులు లక్ష దాటిపోగా, స్పెయిన్‌ లక్షకు చేరువయింది. ఇటలీలో ఇప్పటివరకు 105,799, స్పెయిన్‌లో 95,923 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి ఇటలీలో 12,591, స్పెయిన్‌లో 8,489 మంది మృత్యువాత పడ్డారు. 

 

గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

   3 hours ago


చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

   5 hours ago


దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

   7 hours ago


కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

   8 hours ago


ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

   9 hours ago


మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

   06-08-2020


కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

   06-08-2020


యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

   06-08-2020


కరోనా రోగులకు గుడ్ న్యూస్.. సన్ ఫార్మా ట్యాబ్లెట్ @Rs 35

కరోనా రోగులకు గుడ్ న్యూస్.. సన్ ఫార్మా ట్యాబ్లెట్ @Rs 35

   05-08-2020


మొన్న నేపాల్.. నిన్న పాకిస్తాన్.. భారత్ మ్యాప్‌నే మార్చేశాయి

మొన్న నేపాల్.. నిన్న పాకిస్తాన్.. భారత్ మ్యాప్‌నే మార్చేశాయి

   05-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle