newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

కరోనా పరీక్షలను 'ప్రైవేటు'కు అప్పగిస్తే ముంచేయడం ఖాయం

21-03-202021-03-2020 11:18:36 IST
2020-03-21T05:48:36.023Z21-03-2020 2020-03-21T05:48:34.294Z - - 05-08-2020

కరోనా పరీక్షలను 'ప్రైవేటు'కు అప్పగిస్తే ముంచేయడం ఖాయం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇంతవరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తుండగా ఇకనుంచి ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ ఈ పరీక్షలను నిర్వహిచేందుకు అనుమతి ఇవ్వాలని భారతీయ వైద్య పరిశోధనా మండలి పిలుపునివ్వడంతో రోగుల జేబులకు చిల్లులు పడటం ఖాయమని తెలుస్తోంది. కరోనా పరీక్షలను ప్రైవేటుకు అప్పగిస్తే అధిక పీజుల మోతతో రోగుల కొంపలు ముంచేయడం ఖాయమని భీతిల్లుతున్నారు.

దేశంలో వేగంగా విస్తరిస్తోన్న కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) సోకిందా, లేదా అన్న విషయాన్ని నిర్ధారించేందుకు నిర్వహించే ఒక్కో పరీక్షకు 4,500 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు ఖర్చు అవుతుందట. దేశవ్యాప్తంగా డయోగ్నోస్టిక్స్‌ ల్యాబ్‌ల నెట్‌వర్క్‌ను నిర్వహిస్తోన్న ‘ట్రివిట్రాన్‌ న్యూబర్గ్‌ డయాగ్నోస్టిక్స్‌’ చైర్మన్‌ జీఎస్‌కే వేలు  దీని గురించి తెలిపారు. 

ఈ పరీక్షను నిర్వహించేందుకు అవసరమైన అత్యాధునిక పరిజ్ఞానాన్ని భారత్‌ ల్యాబ్‌లు జర్మనీ, అమెరికా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాయని, దేశంలోనే అభివృద్ధి చేసుకున్నట్లయితే 500 రూపాయల చొప్పున పరీక్షలు నిర్వహించవచ్చని ఆయన తెలిపారు.

భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) ప్రకారం కరోనా వైరస్‌ ప్రాథమిక పరీక్షకు 1500 రూపాయలు, అనంతరం నిర్వహించే నిర్ధారణ పరీక్షకు 3000 రూపాయలు ఖర్చు అవుతాయి. ఇప్పటి వరకు కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలను ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రభుత్వ ల్యాబ్‌లే నిర్వహించగా, ఇక ముందు నుంచి ప్రైవేటు ఆస్పత్రులు కూడా ఉచితంగా నిర్వహించాలని భారతీయ వైద్య పరిశోధనా మండలి బుధవారం పిలుపునిచ్చింది. 

అయితే ఈ విషయంలో ఎలాంటి మార్గదర్శకాలను విడుదల చేయకపోవడంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. కాసులకు కక్కుర్తిపడే ప్రైవేటు ఆస్పత్రులు ఉచితంగా ఈ వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తాయా అప్పుడు వాటి పరీక్షల్లో ప్రామాణికత ఉంటుందా అన్నది ప్రజల సందేహం.

ప్రభుత్వ ఆస్పత్రులు కూడా ప్రస్తుతం అనుమానితులందరికి ఈ వైద్య పరీక్షలు నిర్వహించకుండా, కరోనా విస్తరించిన దేశాల నుంచి వచ్చిన వారికి, వైరస్‌ నిర్ధారిత సన్నిహితులకు, కుటుంబ సభ్యులకు మాత్రమే ఈ పరీక్షలను నిర్వహిస్తోంది. ప్రస్తుతం థర్మల్‌ గన్‌తో పరీక్షిస్తూన్నది జ్వరం ద్వారా అనుమానితులను గుర్తించేందుకు మాత్రమే! 

దేశంలో వందలోపు వ్రైవేటు ల్యాబ్‌లకే కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే సామర్ధ్యం ఉందని జీఎస్‌కే వేలు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో రోజుకు వేలాది మందికి వైరస్‌ పరీక్షలు నిర్వహించాల్సి వస్తే కష్టమే!

దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

   9 hours ago


కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

   17 hours ago


రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

   19 hours ago


ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   03-08-2020


చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

   03-08-2020


అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

   02-08-2020


నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

   02-08-2020


అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

   02-08-2020


అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

   02-08-2020


కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

   01-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle