newssting
BITING NEWS :
*దేశంలో కరోనా వీరవిహారం.. పాజిటివ్ కేసులు 6,72,695, మరణాలు 19,279 *దేశవ్యాప్తంగా అంగరంగవైభవంగా గురుపూర్ణిమ వేడుకలు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శనం ఇస్తున్న సాయినాధుడి ఆలయాలు *ఈనెల 7,8 తేదీల్లో ఇడుపులపాయలో సీఎం జగన్ పర్యటన. జులై 8 న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పించనున్న జగన్ *నెల్లూరు జిల్లాలో దారుణం..ఏడేళ్ళ బాలిక పై పీజీ‌ విద్యార్థి మనోజ్ అత్యాచారయత్నం..తప్పించుకుని తల్లిని తీసుకురాగా తల్లి పై దాడి చేసిన నిందితుడు *విద్యుత్ డిస్కంలు PFC, REC నుంచి 12,600 కోట్ల రుణం తీసుకోవడానికి అనుమతి ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం *క‌రోనా ఎఫెక్ట్‌: ఈ నెల 6వ తేదీ నుంచి 19వ తేదీ వ‌ర‌కు కోల్‌క‌తాకు విమానాల రాక‌పోక‌ల‌పై ఆంక్ష‌లు*జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కటింగ్ యంత్రంతో గొంతు కోసుకుని వృద్ధుడి ఆత్మహత్య*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,850 పాజిటివ్ కేసులు న‌మోదు, ఐదుగురు మృతి, జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే 1,572 కొత్త క‌రోనా కేసులు..10,487 యాక్టివ్ కేసులు..11,537 డిశ్చార్జ్ అయిన కేసులు*మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. శనిగాపురం శివారు తుమ్మల చెరువులో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి *ఢిల్లీ: కరోనావైరస్‌నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీల‌క నిర్ణ‌యం.. ఈవీఎం బటన్‌ నొక్కేందుకు చేతి వేళ్లకు బదులుగా కర్ర చెక్కలను ఉపయోగించాలని నిర్ణయం*ఏపీలో ఇవాళ 7 65 కొత్త కేసులు నమోదు. గడిచిన 24 గంటల్లో 12 మంది మృతి. ఏపీలో 17,699కి చేరిన కరోనా కేసులు. ఇందులో 9473 యాక్టివ్ కేసులు ఉండగా, 8008 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో మొత్తం 218కి చేరిన కరోనా మరణాలు

కరోనా దూకుడు.. భారత్‌లో 5.48 లక్షలకు చేరిన కేసులు

29-06-202029-06-2020 10:48:45 IST
Updated On 29-06-2020 11:47:41 ISTUpdated On 29-06-20202020-06-29T05:18:45.724Z29-06-2020 2020-06-29T05:17:58.735Z - 2020-06-29T06:17:41.966Z - 29-06-2020

కరోనా దూకుడు.. భారత్‌లో  5.48 లక్షలకు చేరిన కేసులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశవ్యాప్తంగా కరోనా కేసులు ఉధృతి కొనసాగుతూనే వుంది. గడిచిన 24 గంటల్లో 19,459 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 5,48,318కి చేరింది.  24 గంటల్లో 380 మంది కరోనాతో మరణించారు.  దీంతో కరోనా మరణాల సంఖ్య 16,475 కి చేరింది. ఇటు దేశంలో పలు రాష్ట్రాలు మళ్ళీ లాక్ డౌన్ వైపు మొగ్గుచూపుతున్నాయి. తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ లో జూలై 1 నుంచి 15 వరకూ లాక్ డౌన్ కట్టడి చేయాలనే ఆలోచనలో వుంది. మరోవైపు మణిపూర్ లో మరో 15 రోజులు లాక్ డౌన్ విదించింది.  జులై 1 నుంచి జులై 15 వరకు పూర్తిగా లాక్ డౌన్ అమలుచేయనున్నారు.

కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఈశాన్య రాష్ట్రాలు నిర్ణయం తీసుకుంటున్నాయి.  ఇప్పటికే లాక్ డౌన్ 15 రోజులు విధించింది అసోం సర్కార్.  బెంగాల్, ఝార్ఖండ్ లో జులై 31 వరకు లాక్ డౌన్ అమలులో వుంది. మహారాష్ట్ర సర్కార్ లాక్ డౌన్ విషయంలో ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

నవీముంబైలోని పది కట్టడి ప్రాంతాల్లో జూన్‌ 29 నుంచి జూలై 5 దాకా కఠిన లాక్‌డౌన్‌ ఆంక్షలు అమలుకానున్నాయి. మహారాష్ట్ర వ్యాప్తంగా కూడా లాక్‌డౌన్‌ ఆంక్షలను పూర్తిగా తొలగించబోమని సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే స్పష్టం చేశారు. ముంబై ప్రజలు తమ నివాసానికి రెండు కిలోమీటర్ల పరిధి దాటి బయటకు వెళ్లొద్దని పోలీసులు సూచించారు.  

మరోవైపు తమిళనాడులో కొన్ని జిల్లాల్లో లాక్ డౌన్ అమలవుతోంది. వచ్చే నెల ఐదో తేదీ నుంచి.. ఆదివారాలు పూర్తిగా లాక్‌డౌన్‌ ప్రకటించాలని కర్ణాటక సర్కారు నిర్ణయించింది. జూలై 10 నుంచి ప్రభుత్వ కార్యాలయాలేవీ శనివారం పనిచేయవు. దేశంలో కొత్త కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ రికవరీ రేటు కూడా పెరుగుతుండడం ఊరట కలిగిస్తోంది. ప్రస్తుతం 58.56 శాతం రికవరీ రేటుగా వుంది.  

దేశంలో యాక్టివ్‌ కేసులు, కరోనా నుంచి కోలుకున్నవారి మధ్య తేడా లక్షకుపైగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ వ్యత్యాసం ఆదివారం నాటికి 1,06,661 అని తెలియజేసింది.  దేశవ్యాప్తంగా 1,055 ఆసుపత్రుల్లో కరోనా బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటళ్లలో 1.77 లక్షల ఐసోలేషన్‌ పడకలు, 23,168 ఐసీయూ పడకలు, 78,060 ఆక్సిజన్‌ సపోర్టెడ్‌ బెడ్లు ఉన్నాయి. అలాగే 2,400 కోవిడ్‌ హెల్త్‌ సెంటర్లలోనూ సేవలందిస్తున్నారు. 

అరుణాచల్, లద్దాఖ్, కార్గిల్‌లలో భూకంపం

అరుణాచల్, లద్దాఖ్, కార్గిల్‌లలో భూకంపం

   2 hours ago


భారత్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. చైనా కంపెనీల తాజా రాగం

భారత్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. చైనా కంపెనీల తాజా రాగం

   4 hours ago


ఒక్క రోజులో 60 వేల కేసులు.. అల్లాడుతున్న అమెరికా

ఒక్క రోజులో 60 వేల కేసులు.. అల్లాడుతున్న అమెరికా

   4 hours ago


ఈసీ కీలక నిర్ణయాలు... కరోనా ఎఫెక్టే కారణమా?

ఈసీ కీలక నిర్ణయాలు... కరోనా ఎఫెక్టే కారణమా?

   10 hours ago


భారత్‌లో రికార్డు స్థాయిలో కేసులు.. ఒక్కరోజులో 23వేలు, 442 మంది మృతి

భారత్‌లో రికార్డు స్థాయిలో కేసులు.. ఒక్కరోజులో 23వేలు, 442 మంది మృతి

   11 hours ago


భారత్‌పై దుందుడుకు వైఖరి..  చైనా నిజ స్వరూపం ఇదే.. ట్రంప్‌ స్పష్టత

భారత్‌పై దుందుడుకు వైఖరి.. చైనా నిజ స్వరూపం ఇదే.. ట్రంప్‌ స్పష్టత

   11 hours ago


భారత్‌లో కరోనా బీభత్సం.. 30 రోజుల్లో 4 లక్షల కేసులు.. ఐదు రోజుల్లో లక్ష కేసులు

భారత్‌లో కరోనా బీభత్సం.. 30 రోజుల్లో 4 లక్షల కేసులు.. ఐదు రోజుల్లో లక్ష కేసులు

   04-07-2020


భారత్ వివాదాలను పెంచుకోదలుస్తోందా.. మోదీ వ్యాఖ్యకు చైనా ఖండన

భారత్ వివాదాలను పెంచుకోదలుస్తోందా.. మోదీ వ్యాఖ్యకు చైనా ఖండన

   04-07-2020


రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. 24 గంటల్లో 20,903 కొత్త కేసులు.. 379 మంది మృతి

రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. 24 గంటల్లో 20,903 కొత్త కేసులు.. 379 మంది మృతి

   04-07-2020


చైనా, పాక్‌ల నడ్డివిరిచిన భారత్.. విద్యుత్ పరికరాల దిగుమతిపై నిషేధం

చైనా, పాక్‌ల నడ్డివిరిచిన భారత్.. విద్యుత్ పరికరాల దిగుమతిపై నిషేధం

   04-07-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle