newssting
Radio
BITING NEWS :
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై సస్పెన్స్‌కు తెరపడింది. బీఎస్‌ యడియూరప్ప సోమవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సాయంత్రం గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు. రాజీనామాపై ఆయన స్పందిస్తూ.. ‘‘ రాజకీయ జీవితంలో ఎన్నో అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నా. కర్ణాటక అభివృద్ధి కోసం చాలా చేశా. 75 ఏళ్లు దాటినా నాకు రెండేళ్ల పాటు అవకాశం ఇచ్చారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా’’ అని అన్నారు. * ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా సోమవారం 2,128 కోవిడ్‌ టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ అందిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల కోవిడ్‌ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. * చరిత్రలోనే మొట్టమొదటిసారి మన తెలుగు సంపద అయిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన రామప్ప ఆలయానికి ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన (పరిశోధన), సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా కోసం 2015లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. * టోక్యో ఒలింపిక్స్‌లో జపాన్‌కి చెందిన మోమిజీ నిషియా సంచలనం సృష్టంచింది. ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన రెండో అతి పిన్న వయస్కురాలిగా రికార్డు క్రియాట్‌ చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన స్కేట్‌బోర్డింగ్ లో నిషియా స్వర్ణ పతకం సాధించింది. * ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చోర్‌ బజార్‌’’. ‘దళం, జార్జ్‌ రెడ్డి’ చిత్రాల ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

కరోనా తొలిదెబ్బ మొదలైంది... క్రూడాయిల్ ధర ఢమాల్.. చరిత్రలోనే భారీపతనం

21-04-202021-04-2020 08:03:42 IST
2020-04-21T02:33:42.641Z21-04-2020 2020-04-21T02:33:40.558Z - - 27-07-2021

కరోనా తొలిదెబ్బ మొదలైంది... క్రూడాయిల్ ధర ఢమాల్.. చరిత్రలోనే భారీపతనం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మానవ ప్రాణాలను లక్షల్లో హరించివేస్తున్న కరోనా వైరస్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మొట్టమొదటి బారీ దెబ్బ తీసింది. అమెరికాలో లైట్ స్వీట్ క్రూడ్ బేరల్ మే నెల కాంట్రాక్ట్ ధర చరిత్రలో అత్యంత దారుణంగా పతనమైపోయింది. దీంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి దిగజారుతున్న పరిస్థీతులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక దశలో క్రూడ్ ధర మైనస్ 28 డాలర్లక స్థాయికి పతనమైంది. దీంతో ప్రపంచ చమురు చరిత్రలో మొదటిసారిగా కొనుగోలు దారులకు ఉత్పత్తిదారులే ఎదురుడబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడినట్లే. ఈ నేపథ్యంలో చమురు ధర అత్యంత కనిష్ట స్థాయినుంచి అత్యంత గరిష్ట స్థాయికి చేరుకోవాలంటే సంవత్సరాల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మహా పతనం మొదలైపోయిందని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు.

న్యూయార్క్‌ ఫ్యూచర్స్‌ మార్కెట్‌– నైమెక్స్‌లో లైట్‌ స్వీట్‌ క్రూడ్‌(డబ్లూటీఐ) బేరల్‌ మే నెల కాంట్రాక్ట్‌ ధర సోమవారం ఒకానొక దశలో కుప్పకూలి... మైనస్‌ 28 డాలర్ల స్థాయికి పడిపోయింది. చరిత్రలో క్రూడ్‌ ధర ఈ స్థాయిలో పతనాన్ని చవిచూడడం ఇదే మొదటి సారి. కరోనా ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తుండటంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో చమురుకు డిమాండ్‌ భారీగా తగ్గిపోయింది. ఉత్పత్తిదారుల వద్ద నిల్వలు గరిష్ట స్థాయిలకు చేరుకుంటున్నాయి. దీంతో తమ నిల్వలను తగ్గించుకునేందుకు ఉత్పత్తిదారులే కొనుగోలుదారులకు ఎదురు డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడినట్టే.  

నిల్వలు భారీగా పేరుకుపోతున్న ధోరణి, కనుచూపుమేర కనిపించని ఆర్థిక రికవరీ నేపథ్యంలో మళ్లీ ముడిచమురు ధరలు ఎప్పుడు పుంజుకుంటాయోనని ఉత్పత్తిదారులు గగ్గోలు పెడుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే  ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న కరోనా మహమ్మారి దెబ్బకు ముడిచమురు ధర పాతాళానికి పడిపోయింది. 

నిజానికి 2020 తొలి నాలుగు నెలల్లోనే అంతర్జాతీయంగా క్రూడ్‌ ధర తీవ్ర హెచ్చుతగ్గులను చవిచూసింది. 2020 జనవరిలో అమెరికా  దాడుల్లో ఇరాన్‌ మేజర్‌ జనరల్‌ ఖాసిం సులేమానీ మరణించడం, దీనితో భౌగోళిక ఉద్రిక్త పరిణామాలతో క్రూడ్‌ ధర ఒక్కసారిగా ఎగిసి 52 వారాల గరిష్ట స్థాయిని తాకింది. అయితే  ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు, తర్వాత  కరోనా ప్రభావంతో రష్యా, సౌదీ అరేబియాల మధ్య చోటుచేసుకున్న ఈ  ‘ధరల యుద్ధం’తో క్రూడ్‌  ధర పతనమవుతూ వచ్చింది.

క్రూడ్‌ ధరలు మరింత పతనమై, తమ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలకుండా  పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య ఒపెక్‌ పది రోజుల క్రితం అసాధారణ చర్యలు తీసుకుంది. ఈ మేరకు కుదిరిన ఒక డీల్‌ ప్రకారం జూలై దాకా ఒపెక్, దాని భాగస్వామ్య దేశాలు చమురు ఉత్పత్తిని రోజుకు 10 మిలియన్‌ బ్యారెళ్ల మేర (బీపీడీ) తగ్గించుకోవాలని నిర్ణయించాయి. అమెరికాతో పాటు మరిన్ని దేశాలు కూడా తమవంతుగా ఉత్పత్తి కోతలపై నిర్ణయాలు తీసుకోవడంపై దృష్టి పెట్టాయి.  ఆయా పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా చమురు ఉత్పత్తిలో 15 శాతానికి కోతపడుతుందన్న అంచనాలు వెలువడ్డాయి.

అయితే, డిమాండ్‌ పెంచేందుకు ఒపెక్, అమెరికాలు చేసిన ప్రయత్నమేదీ ఫలించలేదని కేవలం 10 రోజులకే స్పష్టమైపోయింది. ఇప్పటికే నిల్వలు భారీగా పేరుకుపోయిన పరిస్థితి నెలకొనడం ఇక్కడ ఒక కారణమైతే,  ఉత్పత్తి కోతలపై ఆయా దేశాలు ఆలస్యంగా నిర్ణయాలు తీసుకున్నాయన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఒకవేళ ఉత్తర అమెరికన్‌ సంస్థలు 5 మిలియన్‌ బ్యారెళ్ల మేర ఉత్పత్తిని తగ్గించుకున్నా.. ఇంకా 5–10 మిలియన్‌ బీపీడీ మేర సరఫరా అధికంగానే ఉంటుందని విశ్లేషణ.  ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు స్టోరేజీ పూర్తి స్థాయిలో నిండుగా ఉందని అంచనా.

7.4 బిలియన్‌ బ్యారెళ్ల చమురు, తత్సంబంధ ఉత్పత్తుల నిల్వలు ఉన్నాయని.. ఇవి కాకుండా 1.3 బిలియన్‌ బ్యారెళ్లు రవాణాలో ఉన్నాయని పరిశ్రమవర్గాలు తెలిపాయి. ప్రత్యేకించి అమెరికాలోని ఒక్లహోమాలో క్రూడ్‌ నిల్వల హబ్‌లో నిల్వల పరిస్థితి దాదాపు దాని పూర్తి సామర్థ్యానికి చేరుకుంటోందని వార్తలు వస్తున్నాయి.  ఇక్కడ వర్కింగ్‌ స్టోరేజ్‌ సామర్థ్యం 76 మిలియన్‌ బేరళ్లయితే, 55 మిలియన్‌ బేరళ్లకు ఈ స్టోరేజ్‌కి చేరినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం ఇదే పరిస్థితి కొనసాగితే,  కొనుగోలు చేసిన క్రూడ్‌ ఆయిల్‌ను తీసుకువెళ్లాలని తమ కస్టమర్లపై చమురు ఉత్పత్తిదారులు ఒత్తిడి తీసుకుని వచ్చే పరిస్థితి ఉంటుందన్నది విశ్లేషణ. అంతేకాదు అవసరమైతే కొనుగోలుదారులకు ఎదురు డబ్బులు ఇచ్చిమరీ నిల్వలు తగ్గించుకోవాల్సి రావచ్చని కూడా నిపుణులు పేర్కొంటున్నారు.

వచ్చే దశాబ్దంలో ఎప్పడో ఒకప్పుడు ముడిచమురు ధర 4–10 డాలర్ల స్థాయికి పడిపోవచ్చునని ఎలియవేటివ్ సిద్దాంతం చెబుతుంది. దీనిప్రకారం  మళ్లీ ఆల్‌టైమ్‌ గరిష్టాన్ని (147.67 డాలర్లు) చూడాలంటే

చాలా ఏళ్లే పడుతుంది. 1999 జనవరిలో క్రూడ్‌ కనిష్ట స్థాయి 11.72 డాలర్లు. 2008 జూన్‌ క్రూడ్‌ ఆల్‌టైమ్‌ గరిష్టం  147.67 డాలర్లు. కాగా 2020 ఏప్రిల్‌ 20న క్రూడ్‌ కనిష్ట స్థాయి మైనస్‌ 28 డాలర్లకు చేరుకుంది

రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ హోదా ఇచ్చిన యునెస్కో

రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ హోదా ఇచ్చిన యునెస్కో

   18 hours ago


దేశమంతటా అమృత్‌ మహోత్సవ్‌

దేశమంతటా అమృత్‌ మహోత్సవ్‌

   20 hours ago


హిమాచల్‌లో కొండచరియలు విరిగిపడి 8 మంది పర్యాటకులు మరణించారు

హిమాచల్‌లో కొండచరియలు విరిగిపడి 8 మంది పర్యాటకులు మరణించారు

   25-07-2021


పెగాసస్  స్నూపింగ్ పై సుప్రీంకోర్టు లో సీపీఎం పిటిషన్

పెగాసస్ స్నూపింగ్ పై సుప్రీంకోర్టు లో సీపీఎం పిటిషన్

   25-07-2021


లాక్ డౌన్ కి వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో వేలాది ప్రజల ర్యాలీలు, పోలీసులతో ఘర్షణలు.. అరెస్టులు

లాక్ డౌన్ కి వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో వేలాది ప్రజల ర్యాలీలు, పోలీసులతో ఘర్షణలు.. అరెస్టులు

   24-07-2021


భారతదేశం ఆర్థిక వ్యవస్థ యొక్క భవిష్యత్తు 1991 కంటే కఠినమైనది, గడ్డుకాలం తప్పదు: మన్మోహన్ సింగ్

భారతదేశం ఆర్థిక వ్యవస్థ యొక్క భవిష్యత్తు 1991 కంటే కఠినమైనది, గడ్డుకాలం తప్పదు: మన్మోహన్ సింగ్

   24-07-2021


సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ పై సిబిఐ రైడ్స్... గన్ లైసెన్స్ స్కామ్

సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ పై సిబిఐ రైడ్స్... గన్ లైసెన్స్ స్కామ్

   24-07-2021


పార్లమెంట్ లో ‘పెగాసస్’ పై రగడ.. మంత్రి చేతినుంచి పేపర్లు లాక్కుని చించివేసిన ఎంపీ

పార్లమెంట్ లో ‘పెగాసస్’ పై రగడ.. మంత్రి చేతినుంచి పేపర్లు లాక్కుని చించివేసిన ఎంపీ

   22-07-2021


ఈ రోజు ఢిల్లీ నడిబొడ్డున రైతులు నిరసన దీక్ష, సరిహద్దుల వద్ద గట్టి భద్రత

ఈ రోజు ఢిల్లీ నడిబొడ్డున రైతులు నిరసన దీక్ష, సరిహద్దుల వద్ద గట్టి భద్రత

   22-07-2021


భారతదేశంలో ఇప్పటివరకు 41.76 కోట్లు మందికి కోవిడ్-19 టీకా వేశారు

భారతదేశంలో ఇప్పటివరకు 41.76 కోట్లు మందికి కోవిడ్-19 టీకా వేశారు

   22-07-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle