newssting
BITING NEWS :
*కేర‌ళ‌: ఎయిరిండియా విమాన ప్ర‌మాదంలో ఇప్ప‌టి వ‌ర‌కు పైల‌ట్, కో-పైల‌ట్ స‌హా 15 మంది మృతి, 123 మందికి గాయాలు, మ‌రికొంద‌రికి సీరియ‌స్* భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు మరణాలు. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 61,537 కేసులు.. 933 మరణాలు. ఇండియాలో ఇప్పటి వరకు 42,518 కరోనా మరణాలు. ఇండియాలో 20,88,611 కరోనా కేసులు. 6,19,088 యాక్టివ్ కేసులు ఉండగా, 14,27,005 మంది కోలుకొని డిశ్చార్జ్ *తెలంగాణలో కొత్తగా 2257 కరోనా కేసులు, 14 మరణాలు. తెలంగాణలో మొత్తం 77,513కి చేరిన కరోనా కేసులు *మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కరోనాతో మృతి. హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతూ కన్నుమూత* కేరళ ఇడుక్కి కొండచరియల ప్రమాదంలో 22కి చేరిన మృతుల సంఖ్య..ఈ ఉదయం శిధిలాల కింద మూడు మృతదేహాలు లభ్యం *ప్లాస్మా దానం అంటే అపోహలొద్దు... ప్లాస్మా పేరుతో అవయవాలు తీసుకుంటారన్న అపోహలొద్దు.. రక్తంలోని కేవలం ప్లాస్మా మాత్రమే తీసుకుంటారు-చిరంజీవి*అందరూ ప్లాస్మా దానంచేస్తే క‌రోనాని త‌రిమేయొచ్చు.. నా అభిమానులు అందరూ కూడా ప్లాస్మా దానం చేయండి-చిరంజీవి*దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతితో గెజిట్ విడుదల చేసిన అసెంబ్లీ కార్యదర్శి... దుబ్బాక నియోజకవర్గ సీటు ఖాళీ ఏర్పడినట్టు గెజిట్ విడుదల*అమరావతిని రాజధానిగా కొనసాగిస్తే వైసీపీలో చేరేందుకు సిద్ధం.. అవసరమైతే రాజకీయాల నుంచి కూడా తప్పుకోవడానికి రెడీ-జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి*నెల్లూరు: రేపటి నుంచి పది రోజుల‌పాటు కావలి లాక్ డౌన్.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ నిర్ణయం*నల్గొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

కరోనా గురించి హెచ్చరించిన డాక్టర్ లీ కుటుంబానికి చైనా ప్రభుత్వం క్షమాపణలు

22-03-202022-03-2020 13:37:07 IST
2020-03-22T08:07:07.504Z22-03-2020 2020-03-22T08:07:05.333Z - - 09-08-2020

కరోనా గురించి హెచ్చరించిన డాక్టర్ లీ కుటుంబానికి చైనా ప్రభుత్వం క్షమాపణలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బీజింగ్‌  కరోనా వైరస్‌ గురించి ప్రజల్ని హెచ్చరించి జైలుపాలైన డాక్టర్‌ లి వెన్‌లియాంగ్‌ కుటుంబసభ్యులకు అధికార కమ్యూనిస్టు పార్టీ క్షమాపణలు చెప్పింది. గత డిసెంబర్‌లో వూహాన్‌కు చెందిన డా. లి  సార్స్‌ లాంటి వైరస్‌ వూహాన్‌లో రాబోతోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సోషల్‌ మీడియా ద్వారా ప్రజల్ని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు మరో ఏడుగురు కూడా ఇందుకు సంబంధించిన పోస్టులు చేశారు. 

అయితే వాటిని వదంతులుగా భావించిన పోలీసులు వారిపై కేసు నమోదుచేసి అరెస్ట్‌ చేశారు. ఆ తర్వాత కరోనా వైరస్‌ బారిన పడిన లీ చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు. ఆయన మరణించిన కొద్దిరోజులకే తీవ్ర స్థాయిలో విజృంభించిన వైరస్‌ దేశంలో అల్లకల్లోలం సృష్టించింది. కరోనా కారణంగా ఇప్పటి వరకు దాదాపు  3,245 మంది మరణించారు. రాజీలేని నివారణ చర్యల అనంతరం వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోగలిగారు.

కొద్దిరోజుల క్రితం డా. లీ హెచ్చరికల కేసుపై విచారణ జరిపిన సుప్రీం పీపుల్స్‌ కోర్టు వారి హెచ్చరికలు వదంతులు కావని తేల్చింది. వూహాన్‌ పోలీసుల తీరును ఖండించింది. ఈ నేపథ్యంలో అధికార కమ్యూనిస్టు పార్టీ డా. లీ విషయంలో తమ పొరపాటుకు చింతిస్తూ ఆయన కుటుంబానికి అధికారికంగా క్షమాపణలు తెలిపింది. 

ఆయన అంత్యక్రియలకు సంబంధించి ఆర్థిక సహాయం చేసింది. ఆయన మృతిని ‘వర్క్‌ ప్లేస్‌ ఇంజ్యూరీ కాంపెన్సేషన్‌‌’ కింద పరిగణిస్తామని పేర్కొంది. డా. లీతో పాటు మిగిలిన ఏడుగురిపై కేసులు పెట్టిన పోలీసుల తీరును సైతం తప్పుబడుతూ వారిపై చర్యలకు సిద్ధమైంది.

డాక్టర్ లీ మృతి చైనా, హాంకాంగ్‌ ప్రజల్లో తీవ్ర ఆగ్రహం కలిగించింది. కరోనా వ్యాధి వ్యాప్తి గురించిన సమాచారాన్ని పూర్తిగా తొక్కిపెట్టడమే కాకుండా దాని విజృంభణ గురించి హెచ్చరించిన విజిల్ బ్లోయర్లను, స్వతంత్ర జర్నలిస్టులను శిక్షించిన కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వ అధికారాలపై ప్రజలు మండిపడ్డారు. 

దీంతో డాక్టర్‌ లీని అరెస్టు చేసిన ఘటనపై చైనా కమ్యూనిస్టు పార్టీ చింతిస్తూ ఆయన కుటుంబానికి క్షమాపణలు తెలియజేసింది. ఈ వ్యవహారంలో పాత్ర ఉన్న ఇద్దరు పోలీసు అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని అదేశించింది.

రోజుకు వందలాది కరోనా వైరస్ కేసులను నమోదు చేస్తూ వచ్చిన వుహాన్ నగరంలో గత 50 గంటలుగా ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. ఇతర దేశాల నుంచి చైనాకు వచ్చిన వారికి వైరస్ వచ్చినట్లుగా 39 కొత్త కేసులు నమోదయ్యాయని, దీన్ని బట్టి చూస్తే కఠినమైన పర్యాటక ఆంక్షలు, సామాజిక దూరంపై తగిన చర్యలు తీసుకోవడం వల్లే దేశంలోపల వైరస్ వ్యాప్తి నిరోధానికి వీలు కలిగిందని చైనా జాతీయ ఆరోగ్యసంస్థ పేర్కొంది.

 

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

   13 hours ago


ఆ ఐదు రాష్ట్రాల నుంచే 38 శాతం కరోనా కేసులు!

ఆ ఐదు రాష్ట్రాల నుంచే 38 శాతం కరోనా కేసులు!

   17 hours ago


కోజికోడ్ ఘోర విమాన ప్రమాదంలో 17 మంది మృతి.. 50 మందికి తీవ్రగాయాలు

కోజికోడ్ ఘోర విమాన ప్రమాదంలో 17 మంది మృతి.. 50 మందికి తీవ్రగాయాలు

   19 hours ago


కేరళలో వర్షబీభత్సం...  కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

కేరళలో వర్షబీభత్సం... కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

   07-08-2020


ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

   07-08-2020


గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

   07-08-2020


చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

   07-08-2020


దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

   07-08-2020


కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

   07-08-2020


ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

   07-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle