newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

కరోనా గురించి ఇంకా అర్థం కావడంలేదు.. దారుణ ఫలితాలే.. డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక

22-04-202022-04-2020 12:01:24 IST
2020-04-22T06:31:24.179Z22-04-2020 2020-04-22T06:31:20.714Z - - 11-08-2020

కరోనా గురించి ఇంకా అర్థం కావడంలేదు.. దారుణ ఫలితాలే.. డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గత నెలరోజులుగా ప్రపంచంలో చాలాదేశాలు లాక్ డౌన్‌లో ఉంటూ ప్రజలు విసుగెత్తిపోయి రోడ్లమీదికి వచ్చి మరీ మాకొద్దీ లాక్ డౌన్లు అంటూ తిరగబడుతున్న నేపధ్యంలో కరోనా వైరస్ ప్రభావం లోతు నిజంగానే ఎవరికీ తెలీటం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తీవ్రంగా హెచ్చరించింది. 1918లో వచ్చి కోటిమందికి పైగా కబళించిన స్పానిష్ ఫ్లూ కంటే ఇంకా ఎక్కువగా కరోనా వ్రభావం ఉండబోతోందని, ఇంతవరకు కరోనా వైరస్ తీవ్రతను కొద్దిగా మాత్రమే చూశామని, దీనిపట్ల ఇప్పుడే నిర్లక్ష్యం ప్రదర్శిస్తే సమీప భవిష్యత్తులోనే దారుణమైన పరిస్థితులను ఎదుర్కోక తప్పదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.

మానవాళి భవిష్యత్తుపై కరోనా ప్రభావం మామూలు స్థాయిలో ఉండబోదని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథానమ్‌ గేబ్రియసస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘కరోనా ప్రభావం మానవాళిపై చాలా తీవ్రంగా ఉంటుంది. వైరస్‌ తీవ్రతలో కేవలం కొద్దిశాతం మాత్రమే మనం చూశాము. దీని ప్రభవం మానవ భవిష్యత్‌పై స్పష్టంగా కనిపిస్తుంది. వైరస్‌ తీవ్రత చాలామంది ప్రజలకు ఇంకా అర్థం కావట్లేదు. 1918లో వచ్చిన స్ఫానిష్‌ ఫ్లూ కంటే కరోనా ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉంది. అదే జరిగితే ముందుముందు చాలా దారుణమైన పరిస్థితులను ఎదుర్కొక తప్పదు. కరోనాను కట్టడి చేయకపోతే వైరస్‌ ఉగ్రరూపాన్ని చూస్తారు’ అని అన్నారు.

ప్రాణాంతక మహమ్మారి కొవిడ్-19 అసలు రూపం ఇంకా రాలేదనీ.. ముందు ముందు దీని తీవ్రత మరింత ఉధృతంగా ఉంటుందని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ పేర్కొన్నారు. చాలామందికి ఈ వైరస్ తీవ్రతపై ఇంకా అవగాహన రాలేదని ఆయన అన్నారు. ‘‘మమ్మల్ని నమ్మండి. ముందు ముందు మరింత ఉత్పాతం రాబోతోంది. ఈ విషాదాన్ని మనం కలిసికట్టుగా ఆపాలి. ఈ వైరస్‌ గురించి ఇంకా చాలామందికి అర్థం కాలేదు..’’ అని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ వ్యాఖ్యానించారు. 

డబ్ల్యూహెచ్‌వో దగ్గర ఎలాంటి రహస్యాలు లేవనీ... ఇలాంటి విషయాలను గోప్యంగా ఉంచడం పెను ప్రమాదమని ఆయన స్పష్టం చేశారు. ఇది ఆరోగ్యానికి సంబంధించిన విషయమని ఆయన గుర్తుచేశారు. ‘‘ఈ వైరస్ చాలా ప్రమాదకరమైనది. మన మధ్య విబేధాలుంటే ఆ పగుళ్లను ఉపయోగించుకుని ఇది మరింత చొచ్చుకెళుతుంది...’’ అని ఘెబ్రేయేసస్ హెచ్చరించారు. అమెరికాకి చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) సిబ్బంది తమతో కలిసి పనిచేస్తున్నారనీ.. అలాంటప్పుడు అమెరికాకి తెలియకుండా మేము ఏదైనా ఎలా దాచిపెట్టగలమని ఆయన ప్రశ్నించారు. 

వందేళ్ల క్రితం కోటి మందికి పైగా బలితీసుకున్న స్పానిష్ ఫ్లూకి.. కరోనా వైరస్‌కు చాలా సామీప్యతలు ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రపంచ మానవాళికి ప్రధమ శత్రువనీ.. అందరూ కలిసి కట్టుగా ఈ రక్కసిపై పోరాడాలని తాము తొలి రోజు నుంచి చెబుతూనే వచ్చామన్నారు. చైనాలోని వుహాన్ కేంద్రంగా పుట్టిన ఈ వైరస్‌పై  ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయడంతో డబ్ల్యూహెచ్‌వో విఫలమైందంటూ ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించిన నేపథ్యంలోనే డబ్ల్యూహెచ్‌వో చీఫ్ ఈ మేరకు వ్యాఖ్యానించడం గమనార్హం.

కరోనా వైరస్‌ కట్టడి కోసం అమలు చేస్తోన్న లాక్‌డౌన్‌ను తొందరపడి ఎత్తివేయరాదని, అలా చేసినట్లయితే కరోనా వైరస్‌ ఒక్కసారిగా మరోసారి విజృంభించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ రీజనల్ డైరెక్టర్  హెచ్చరించారు. సాధ్యమైనంత త్వరగా లాక్‌డౌన్‌ను ఎత్తివేసేందుకు పలు దేశాలు, ముఖ్యంగా అమెరికా ప్రయత్నాలు ప్రారంభించినట్లు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో సంస్థ డైరెక్టర్ డాక్టర్‌ టకేషి కాసాయి ప్రపంచ దేశాలను హెచ్చరించారు. 

లాక్‌డౌన్‌ను ఒక్కసారిగా ఎత్తివేయరాదని, అలా చేసినట్లయితే ఇంతకాలం చేసిన కృషి మంటగలసి పోతుందని, సడలింపుల ద్వారా క్రమంగా లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తూ అదే క్రమంలో ఆర్థిక పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని డాక్టర్‌ టకేషి పిలుపునిచ్చారు. సామాజిక దూరాన్ని పాటిస్తూ ప్రజలు కొత్త జీవన విధానానికి అలవాటు పడాలని ఆయన పిలుపునిచ్చారు. తొలిరోజునుంచి కరోనాను నెంబర్ వన్ ప్రజా శత్రువు అని చెబుతూనే ఉన్నాం. ఈ దెయ్యంతో ప్రతి ఒక్కరూ తప్పకుండా పోరాడాల్సిందే డాక్టర్ టకేషి చెప్పారు.

కాగా కరోనా వైరస్ నేపథ్యంలో లౌక్ డౌన్ పేరిట ఆంక్షల వల్ల తమకు జీవనోపాధి లేకుండా పోయిందని, తమ హక్కులను హరించి వేస్తున్నారంటూ డెమోక్రట్ల పాలనలోని రాష్ట్రాల్లో ప్రజలు ఆందోళన చేస్తుంటే, దేశ ఆర్థిక పరిస్థితి పునరుద్ధరణలో భాగంగా లాక్‌డౌన్‌ను ఎత్తివేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సిద్ధమయ్యారని వార్తలు వెలువడ్డాయి. ముందుగా చేసిన ప్రకటన వరకు అమెరికాలో లాక్‌డౌన్‌ ఏప్రిల్‌ 30వ తేదీ వరకు కొనసాగాల్సి ఉంది.

ఆసియా, యూరప్ ఖండాల్లోని కొన్ని దేశాలు లాక్ డౌన్‌ను క్రమంగా ఎత్తివేస్తామని ప్రకటించాయి. క్వారంటైన్ ఆంక్షలను సడలిస్తామని, పాఠశాలలు, వ్యాపార సంస్థలను తెరుస్తామని, ప్రజల సామూహిక సమావేశాలపై నిబంధనలు తొలగిస్తామని చెబుతున్న నేపథ్యంలో కరోనా ఒక ప్రాణాంతక వైరస్ అనే విషయం బహుశా ఎవరికీ తెలీడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ విచారం వ్యక్తం చేసింది.

కాగా కరోనా వైరస్‌ మరింత వ్యాప్తి చెందుతున్న తరుణంలో డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరికలు ప్రపంచ దేశాలను తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి. వైరస్‌ నియంత్రణకు అన్ని దేశాలు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ వైరస్‌ను మాత్రం అదుపుచేయలేకపోతున్నాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య 25 లక్షలకు చేరింది. మరోవైపు మరణాల సంఖ్య 1 లక్ష 70 వేలుగా నమోదైంది. ఇక వైరస్‌ తీవ్రత అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పటికీ అదుపులోకి  రావడంలేదు. ఒక్క అమెరికాలోనే వైరస్‌ కారణంగా 42,000 మంది ప్రాణాలు విడిచారు. 

 

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   4 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   4 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   6 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   15 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle