newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

కరోనా కొమ్ములు విరచడంలో భారత్ టాప్.. కానీ..

02-05-202002-05-2020 06:17:44 IST
Updated On 02-05-2020 09:42:12 ISTUpdated On 02-05-20202020-05-02T00:47:44.955Z02-05-2020 2020-05-02T00:47:42.932Z - 2020-05-02T04:12:12.721Z - 02-05-2020

కరోనా కొమ్ములు విరచడంలో భారత్ టాప్.. కానీ..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా కట్టడి విషయంలో వేగంగా స్పందించడమే బారత్‌ను కోవిడ్-19 మహమ్మారి బారినుంచి తప్పుకునేలా చేసిందని యావత్ ప్రపంచం ఇప్పుడు గుర్తిస్తోంది. అభివృద్ధి చెందిన దేశాల కంటే సమర్థవంతంగా కరోనా కట్టడిలో భారత్ సమర్థవంతంగా వ్యవహరించింది. 130 కోట్ల జనాభా ఉన్న దేశం.. అరకొరగా వైద్య సదుపాయాలు కలిగిన దేశం. కంటికి కనిపించని శత్రువుపై అద్భుతమైన పోరాటపటిమ ప్రదర్శించింది. కరోనా వైరస్‌ భారత్‌లో అల్లకల్లోలం సృష్టిస్తుందని అంచనా వేసిన   ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పుడు మన దేశాన్ని వెన్నుతట్టి  ప్రశంసిస్తోంది.  అభివృద్ధి చెందిన దేశాల కంటే కరోనా కొమ్ములు విరచడంలో మనమే ముందున్నాం. అయినప్పటికీ మే3న లాక్‌డౌన్‌ ఎత్తివేయాలా వద్దా అన్న మీమాంస కొనసాగుతోంది.  

కోవిడ్‌–19 పరీక్షలు చేయడంలోనూ భారత్‌ కాస్త వెనుకబడి ఉన్నప్పటికీ పాజిటివ్‌ కేసులు ఎక్కువగా రాకపోవడం ఊరటనిచ్చే అంశం. ఇప్పటివరకు 8 లక్షల 50 వేల మందికి పరీక్షలు నిర్వహించారు. కరోనా పరీక్షల్లో అందరికీ ఆదర్శంగా నిలిచిన దక్షిణ కొరియా కంటే సంఖ్యలో ఇది ఎక్కువ. కానీ జనాభా ప్రాతిపదికన చూస్తే మాత్రం స్వల్పమే. చాలా తక్కువ  కేసులు నమోదైన వెంటనే భారత్‌ మేల్కొంది. లాక్‌డౌన్‌ ప్రకటించడం వల్ల ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి తగ్గిపోయింది. ఫలితంగా కేసుల సంఖ్యను నివారించింది’ అని సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ డైనమిక్స్, ఎకానమిక్స్, పాలసీ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ వివరించారు.

అదేసమయంలో కోవిడ్‌పై జరుగుతున్న పోరులో మే నెల అత్యంత కీలకమని వైద్యనిపుణులు స్పష్టం చేస్తున్నారు. హాట్‌స్పాట్స్‌ను కఠినంగా నియంత్రించడం, గ్రీన్‌జోన్స్‌ను సురక్షితంగా కాపాడుకోవడమన్న రెండు అంశాలు అమీతుమీ తేల్చేస్తాయని వీరు అభిప్రాయపడ్డారు. రైల్వే, విమాన ప్రయాణం, అంతర్రాష్ట బస్సు సర్వీసులను మే నెల మొత్తం బంద్‌ చేయడమే మేలని స్పష్టం చేశారు. కరోనాపై పోరు కొనసాగిస్తూ రాష్ట్రాలు ఆర్థిక వ్యవస్థపై దృష్టి పెట్టాలని ప్రధాని వ్యాఖ్యానించడం తెల్సిందే.

లాక్‌డౌన్‌ నుంచి సడలింపులు ఉంటాయన్న వార్తలు వస్తున్న తరుణంలో వైద్య నిపుణులు కంటైన్మెంట్‌ జోన్లు, గ్రీన్‌జోన్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిందేనని చెబుతున్నారు. దేశంలో రెండు వారాల క్రితం సుమారు 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు ఉండగా ప్రస్తుతం ఈ సంఖ్య 129కి తగ్గాయి. ఇదే సమయంలో గ్రీన్‌జోన్లు 325 నుంచి 307కు, తగ్గిపోగా, ఆరెంజ్‌ జోన్లు 207 నుంచి 297కు పెరిగిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా వైరస్‌ నాశనం కాదని, వ్యాప్తిని నియంత్రించగలమన్నది గుర్తించాలని, కాబట్టి రెడ్‌ జోన్లలో లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగించడం మేలని, అదే సమయంలో గ్రీన్‌జోన్లలో నియంత్రణలు ఎత్తివేసి.. రెడ్‌జోన్ల వారు అక్కడికి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నోయిడాలోని ఫోర్టిస్‌ ఆసుపత్రి అసోసియేట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రాజేశ్‌ కుమార్‌ గుప్తా తెలిపారు.

ప్రజా రవాణా వ్యవస్థలతోపాటు మాల్స్, షాపింగ్‌ కాంప్లెక్స్, మతపరమైన ప్రాంతాలపై నిషేధం కొనసాగాలని శ్రీ గంగారామ్‌ ఆసుపత్రిలో ఊపిరితిత్తుల సర్జన్‌ అయిన డాక్టర్‌ అరవింద్‌ సూచించారు. గ్రీన్‌జోన్ల సరిహద్దులను మూసివేయడంతోపాటు భౌతిక దూరం పాటించడం, చేతులు కడుక్కోవడం, మాస్కులు తొడుక్కోవడం వంటి నిబంధనలను అక్కడ పాటించేలా చూడాలని అరవింద్‌ తెలిపారు. కేసులు నమోదైన ప్రాంతాల్లో అవి తగ్గేదాకా లాక్‌డౌన్‌ కొనసాగాలని అన్నారు. లాక్‌డౌన్‌ మరో నాలుగు వారాలపాటు ఉంటే బాగుంటుందని, కోవిడ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ దశలో లాక్‌డౌన్‌ ఎత్తివేయడం సరికాదని మ్యాక్స్‌ హెల్త్‌కేర్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రోమెల్‌ అభిప్రాయపడ్డారు. గ్రీన్‌జోన్లలో కొంత ఆర్థిక కార్యకలాపాలకు అవకాశం కల్పించాలని అన్నారు.  

అయితే లాక్‌డౌన్‌ ఎత్తివేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత్‌ జనాభాలో యువత 44 శాతం ఉండడం, ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలకు పైబడి ఉండడం, క్షయ వ్యాధిని నిరోధించే బీసీజీ టీకాలు తీసుకోవడం, కరోనా వైరస్‌ స్ట్రెయిన్స్‌లో ఉన్న తేడాలు తదితర కారణాలతో కరోనా వైరస్‌ ప్రభావం తక్కువగా ఉందన్న వాదనలు ఉన్నాయి. అందుకే భౌతిక దూరం, పారిశుద్ధ్యం చర్యల్ని పకడ్బందీగా తీసుకొని దశలవారీగా లాక్‌డౌన్‌ ఎత్తేయాలని కొందరు ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

మరోవైపున అబ్జర్వర్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ మరో వాదనను వినిపిస్తోంది. భారత్‌ ఇప్పటివరకు వైరస్‌ని తొక్కి పట్టి ఉంచిందని, 130 కోట్ల జనాభా ఉన్న దేశం లాక్‌డౌన్‌ ఎత్తేస్తే వ్యాధి మళ్లీ విజృంభించే అవకాశాలు ఉన్నాయని ఆ సంస్థ అధ్యక్షుడు సమీర్‌ శరణ్‌ హెచ్చరించారు. ఈ వైరస్‌ పూర్తిస్థాయి నిర్మూలనకి ఏడాది పడుతుందని లాక్‌డౌన్‌ ఎత్తేసే సమయంలో కట్టుదిట్టమైన చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు.  

అయితే జనజీవితం చలనానికి పట్టుగొమ్మలుగా ఉండే రైళ్లు, విమాన ప్రయాణాలు, అంతర్రాష్ట్ర బస్ సర్వీసులు, మాల్స్, షాపింగ్ కాంప్లెక్సులు వంటి వాటిని మే నెలలో కూడా లాక్ డౌన్‌లో ఉంచడం అంటే దేశ ఆర్థిక వ్యవస్థకు కోలుకోని నష్టం సంభవిస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల ప్రాణాలూ ముఖ్యమే.. వారి బ్రతుకుతెరువూ ముఖ్యమే అని పేర్కొన్న ప్రధాని నరేంద్రమోదీ అభిప్రాయం ఆచరణలో ఎలా రూపొందుతుందన్నదే ఇప్పుడు కీలకంగా మారింది.

 

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   9 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   10 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   12 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   21 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle