newssting
Radio
BITING NEWS :
కరోనా సంక్షోభ తరుణంలోనూ వైద్యరంగంలో విశేష సేవలందిస్తున్న సంస్థలు, వైద్యులను ప్రముఖ మార్కెట్‌ రిసెర్చ్‌ కంపెనీ ‘టాప్‌ గ్యాలెంట్‌ మీడియా’ అవార్డులతో సత్కరించనుంది. ఈ సంవత్సరానికి(2020)గానూ సర్జికల్‌ అంకాలజీలో అత్యంత విశ్వసనీయ ఆస్పత్రిగా హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్‌ కేన్సర్‌ ఆస్పత్రిని ఎంపిక చేయడం విశేషం * సుక్మా జిల్లాలోని టల్మెటాలా ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలపై మావోయిస్టులు మళ్లీ రెచ్చిపోయారు. ఐఈడీ బ్లాస్ట్‌లతో విరుచుకుపడ్డారు. ఈ దాడి శనివారం అర్థరాత్రి జరిగింది. ఈ దాడిలో సీఆర్పీఎఫ్‌ కోబ్రాకి చెందిన ఎనిమిది మంది జవాన్లు గాయపడగా ఓ సీఆర్పీఎఫ్ అధికారి ప్రాణాలను కోల్పోయారు * కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ దేశరాజధాని ఢిల్లీలో భారీఎత్తున రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. బురారి ప్రాంతంలోని నిరంకార్‌ మైదానంలో నిరసనకు పోలీసులు అనుమతిచ్చిన నేపథ్యంలో వేలమంది రైతులు నిరసన స్థలికి చేరుకుని కేంద్రంపై నిరసన వ్యక్తం చేశారు * పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. తొమ్మిది రోజులుగా చమురు ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ఈనెల 19 నుంచి శనివారం వరకు (25వ తేదీ మినహా) ధరలు పెరుగుతూనే ఉన్నాయి. శనివారం అర్ధరాత్రి కూడా మరోసారి ధరలు పెరిగాయి. గడిచిన పది రోజుల్లో పెట్రోల్‌పై లీటర్‌కు రూ.1.28, డీజిల్‌ రూ.2.09 చొప్పున పెరిగింది * బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆదివారం జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకుని.. 10:45 గంటలకు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు * రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రత భారీగా పడిపోయింది. మెదక్‌లో అతితక్కువగా 14.8 డిగ్రీలు, హైదరాబాద్‌లో 17డిగ్రీల కనిష్ఠ ఉష్ణో గ్రత నమోదైంది. గాలిలో తేమ శాతం పెరిగింది * బంగాళాఖాతంలో మరో అల్పపీడన ద్రోణి బయలుదేరింది. ఇది తుపాన్‌గా మారే అవకాశాలు ఉండడంతో దీనికి బురేవి అని నామకరణం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ ప్రభావంతో ఆదివారం నుంచి సముద్ర తీరాల్లో వర్షాలు పడ నున్నాయి. ఒకటో తేదీ నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది * జాతీయ ప్రవేశ పరీక్షలు... నీట్‌, జేఈఈ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌కు సిద్ధమయ్యే విద్యార్థులు తమ ప్రతిభా సామర్థ్యాలను పరీక్షించుకునేందుకు ‘కోటా’ ఆన్‌లైన్‌ ప్రాక్టీస్‌ టెస్ట్‌ సిరీస్‌ సిద్ధం చేసినట్లు ఐఐటీ, జేఈఈ ఫోరమ్‌ కన్వీనర్‌ లలిత్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు www.iitjeeforum.com వెబ్‌సైట్‌లో లాగిన్‌ కావొచ్చన్నారు * వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా భక్తులకు పదిరోజుల పాటు వైకుంఠ ద్వార ప్రవేశాన్ని కల్పించనున్నట్టు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. డిసెంబరు 25నుంచి పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంచాలని నిర్ణయించినట్టు వివరించారు.

కరోనా కేసుల లెక్కలు మారాయి... ఇకనుంచి గంటకు కేసుల లెక్కలే

21-06-202021-06-2020 08:51:37 IST
2020-06-21T03:21:37.584Z21-06-2020 2020-06-21T03:21:35.112Z - - 29-11-2020

కరోనా కేసుల లెక్కలు మారాయి... ఇకనుంచి గంటకు కేసుల లెక్కలే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో కరోనా వైరస్ విస్తరణ వేగానికి కేసుల నమోదు వివరాలు కూడా మారిపోతున్నాయి. గత 3 నెలలుగా భారత్‌లో, వివిధ రాష్ట్రాల్లో రోజుకు ఎన్ని కేసులు నమోదవుతున్నాయి అంటూ లెక్కలు సమర్పించిన కేంద్ర, రాష్ట్రాల ఆరోగ్య వైద్య శాఖలు ఇప్పుడు గంటకు ఎన్ని పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని లెక్కకట్టి ప్రకటించాల్సిన సమయం వచ్చేసింది. ఈ మారిన గణాంకాల ప్రకారం శనివారం ప్రతి గంటకూ 604 మంది దేశవ్యాప్తంగా కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. కాగా, కరోనా మహమ్మారి వ్యాప్తి ప్రభావానికి యావత్ ప్రపంచం పెను ప్రమాదంలోకి ప్రవేశించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర హెచ్చరిక చేసింది.

ఇండియాలో కరోనా వైరస్‌ మెరుపు వేగంతో విస్తరిస్తోంది. ప్రజల అజాగ్రత్త, అవగాహనా లోపంతో మహమ్మారి విజృంభిస్తోంది. కేసుల విషయంలో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు ఒక్క రోజులో 14,516 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. అంటే గంటకు 604 మంది కరోనా బారినపడినట్లు స్పష్టమవుతోంది. దేశంలో 24 గంటల్లో ఈ స్థాయిలో కేసులు వెలుగుచూడడం ఇదే ప్రథమం.

తాజాగా 375 మంది కరోనా బాధితులు తుదిశ్వాస విడిచారు. దీంతో భారత్‌లో మొత్తం పాజిటివ్‌ కేసులు 3,95,048కు, మరణాలు 12,948కు చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం ప్రకటించింది. 2,13,830 మంది బాధితులు చికిత్సతో పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం క్రియాశీల కరోనా కేసులు 1,68,269. రికవరీ రేటు 54.12 శాతానికి చేరడం ఊరట కలిగించే పరిణామం అని చెప్పొచ్చు. 

ప్రధానంగా మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లో కరోనా పంజా విసురుతోంది. ఆయా రాష్ట్రాల్లో జూన్‌ 1వ తేదీ నుంచి ఇప్పటిదాకా 2 లక్షలకుపైగా కేసులు వెలుగులోకొచ్చాయి. మరణాల సంఖ్యలో ప్రపంచంలో భారత్‌ ఎనిమిదో స్థానంలో ఉంది.

దేశవ్యాప్తంగా కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. వరుసగా తొమ్మిదో రోజు కూడా పదివేలకుపైగా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 14,516 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది.  375 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ శనివారం ఉదయం విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌లో పేర్కొంది. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం కేసులు 3,95,048కు, మృతుల సంఖ్య 12,948కు చేరుకుంది. 

తాజా పరిస్థితులను అంచనా వేస్తే మరికొన్ని గంటల్లోనే దేశంలో కరోనా కేసుల సంఖ్య నాలుగు లక్షలకు చేరనుంది.  దేశంలో తొలి కరోనా కేసు నమోదనప్పటి నుంచి ఈ స్థాయిలో కేసులు నమోదుకావడం ఇదే ప్రథమం. ఇక కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుండటం కాస్త ఊరటనిస్తోంది. గడిచిన 24 గంటల్లో 9 వేలకు మందికి పైగా ఈ మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. 

ఇప్పటివరకు కరోనా నుంచి 2,13,831 మంది పూర్తిగా కోలుకోగా, 1,68,269 మంది చికిత్స పొందుతున్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల్లో అమెరికా, బ్రెజిల్, రష్యా తర్వాత భారత్‌ ఉంది. 

పెను ప్రమాదకర దశలో ప్రపంచం.. డ‌బ్ల్యూహెచ్ఓ తీవ్ర హెచ్చరిక

కరోనా వైరస్‌ మహమ్మారి అత్యంత వేగంగా విస్తరిస్తోందని, ప్రస్తుతం ప్రపంచం మొత్తం పెను ప్రమాదకర దశలో ఉందని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. గురువారం ఒక్కరోజే 1,50,000 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదుకావటం, అందులో సగానికి పైగా అమెరికాలోనివి కావటంపై డ‌బ్ల్యూహెచ్ఓ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ టెడ్రోస్ అధనామ్ గేబ్రియేసస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం డబ్ల్యూహెచ్ఓ‌ ప్రధాన కార్యాలయంలో ప్రపంచవ్యాప్త కరోనా పరిస్థితులపై ఆయన మాట్లాడారు. వైరస్‌ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోందని తెలిపారు.

కరోనా వ్యాక్సిన్‌ను కనిపెట్టడం అసాధ్యం కానప్పటికి అదో కష్టతరమైన ప్రయాణమని అన్నారు. అవసరమైన విధంగా లాక్‌డౌన్‌ను ఉపయోగించుకోవాలని, క్రమంగా.. ఎప్పటికప్పుడు కరోనా వివరాలను సేకరిస్తూ ఉండాలన్నారు. వైరస్‌ వ్యాప్తి అవకాశాలను గుర్తించకపోతే అది విపరీతంగా పెరుగుతుందని చెప్పారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 87లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవ్వగా, 4,62,525 మంది మృత్యువాత పడ్డారు.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle