newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

కరోనా కేసుల్లో మళ్లీ రికార్డు.. 8వ రోజూ 13 వేలకుపైగా పాజిటివ్ కేసులు

20-06-202020-06-2020 15:35:51 IST
2020-06-20T10:05:51.056Z20-06-2020 2020-06-20T10:05:48.586Z - - 12-08-2020

కరోనా కేసుల్లో మళ్లీ రికార్డు.. 8వ రోజూ 13 వేలకుపైగా పాజిటివ్ కేసులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో కరోనా రోజు రోజుకీ విజృంభిస్తోంది. కొత్త కేసులు నమోదులో మరో రికార్డు సృష్టించింది. 24 గంటల్లో 13,586 కేసులు నమోదయ్యాయి. 336 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,80,532కు, మృతుల సంఖ్య 12,573కి చేరుకుందని శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

కాగా రోజుకి 10 వేలు దాటి కేసులు నమోదు కావడం వరసగా ఇది ఎనిమిదో రోజు. జూన్‌ 1 నుంచి 19 మధ్య 1,89,997 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా అమెరికా, బ్రెజిల్, రష్యా తర్వాత భారత్‌ ఉంది.  

కోవిడ్‌–19 బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య బాగా పెరగడం మన దేశానికి అత్యంత ఊరటనిస్తోంది. ఇప్పటివరకు 2,04,710 మంది రోగులు కరోనా నుంచి కోలుకుంటే , 1,63,248 మంది చికిత్స పొందుతున్నారు. రికవరీ రేటు 53.79శాతానికి చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు చెప్పారు.  

డేంజర్ జోన్‌లో కూరుకుపోతున్న మహారాష్ట్ర.. ఒక్కరోజే 3827 కరోనా పాజిటివ్ కేసులు

మరోవైపున మహారాష్ట్రను కరోనా మహమ్మారి రోజురోజుకూ డేంజర్‌జోన్‌లోకి నెట్టేస్తోంది. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతూ పోతున్నాయో తప్ప తగ్గడం లేదు. పాజిటివ్ కేసులు మాత్రమే కాదు కరోనా మరణాల సంఖ్యా మహారాష్ట్రను వణికిస్తోంది. 

ఇవాళ ఒక్కరోజే మహారాష్ట్రలో 3827 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో.. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,24,331కి చేరింది. కరోనా సోకి చికిత్స పొందుతున్న వారిలో ఇవాళ ఒక్కరోజే మహారాష్ట్రలో 142 మంది మరణించారు. కొత్తగా నమోదైన మరణాలతో కలిపి మహారాష్ట్రలో కరోనా మరణాల సంఖ్య 5893కు చేరింది.

మహారాష్ట్రలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో ఒక్క ముంబై నగరంలోనే ఇప్పటివరకూ 64,068 పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. ఇవాళ మహారాష్ట్రలో నమోదైన కేసుల్లో 1269 కేసులు ముంబైలోనే నమోదయ్యాయి. ముంబైలో ఇవాళ ఒక్కరోజే 1269 మంది కరోనా వల్ల మరణించారు.

కోవిడ్‌ వైద్యంపై నిపుణుల బృందం .. రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం

ఆస్పత్రుల్లో కోవిడ్‌ రోగులకు అందిస్తున్న చికిత్సను పర్యవేక్షించడానికి నిపుణుల బృందాన్ని రాష్ట్రాలు ఏర్పాటు చేసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రోగులకు అందిస్తున్న చికిత్సను అధికారులు పర్యవేక్షిస్తూ ఉండేందుకు వీలుగా సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటుచేయాలని జస్టిస్‌ అశోక్‌ భూషణ్, జస్టిస్‌ ఎస్‌కే కౌల్, జస్టిస్‌ ఎంఆర్‌ షాల ధర్మాసనం సూచించింది. 

వివిధ రాష్ట్రాల్లో కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన ధరల విషయంలో వ్యత్యాసాలపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. కరోనా నిర్ధారణ పరీక్ష రుసుము కొన్ని రాష్ట్రాల్లో రూ.2,200 కాగా, మరికొన్ని రాష్ట్రాల్లో రూ.4,500 ఉందంటూ కోర్టు.. ధరల నిర్ణయ విషయాన్ని కేంద్రానికే వదిలేస్తున్నామని తెలిపింది. 

కరోనా నిర్ధారణ పరీక్షల ధరలు అన్ని చోట్ల ఒకేలా ఉండాలని సూచించింది. ఢిల్లీలోని ఎల్‌ ఎన్‌ జేపీ ఆస్పత్రిలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు సీసీటీవీల ప్రస్తావన తీసుకొచ్చింది. 

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   9 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   9 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   11 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   20 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle