newssting
BITING NEWS :
*కేర‌ళ‌: ఎయిరిండియా విమాన ప్ర‌మాదంలో ఇప్ప‌టి వ‌ర‌కు పైల‌ట్, కో-పైల‌ట్ స‌హా 15 మంది మృతి, 123 మందికి గాయాలు, మ‌రికొంద‌రికి సీరియ‌స్* భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు మరణాలు. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 61,537 కేసులు.. 933 మరణాలు. ఇండియాలో ఇప్పటి వరకు 42,518 కరోనా మరణాలు. ఇండియాలో 20,88,611 కరోనా కేసులు. 6,19,088 యాక్టివ్ కేసులు ఉండగా, 14,27,005 మంది కోలుకొని డిశ్చార్జ్ *తెలంగాణలో కొత్తగా 2257 కరోనా కేసులు, 14 మరణాలు. తెలంగాణలో మొత్తం 77,513కి చేరిన కరోనా కేసులు *మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కరోనాతో మృతి. హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతూ కన్నుమూత* కేరళ ఇడుక్కి కొండచరియల ప్రమాదంలో 22కి చేరిన మృతుల సంఖ్య..ఈ ఉదయం శిధిలాల కింద మూడు మృతదేహాలు లభ్యం *ప్లాస్మా దానం అంటే అపోహలొద్దు... ప్లాస్మా పేరుతో అవయవాలు తీసుకుంటారన్న అపోహలొద్దు.. రక్తంలోని కేవలం ప్లాస్మా మాత్రమే తీసుకుంటారు-చిరంజీవి*అందరూ ప్లాస్మా దానంచేస్తే క‌రోనాని త‌రిమేయొచ్చు.. నా అభిమానులు అందరూ కూడా ప్లాస్మా దానం చేయండి-చిరంజీవి*దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతితో గెజిట్ విడుదల చేసిన అసెంబ్లీ కార్యదర్శి... దుబ్బాక నియోజకవర్గ సీటు ఖాళీ ఏర్పడినట్టు గెజిట్ విడుదల*అమరావతిని రాజధానిగా కొనసాగిస్తే వైసీపీలో చేరేందుకు సిద్ధం.. అవసరమైతే రాజకీయాల నుంచి కూడా తప్పుకోవడానికి రెడీ-జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి*నెల్లూరు: రేపటి నుంచి పది రోజుల‌పాటు కావలి లాక్ డౌన్.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ నిర్ణయం*నల్గొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

కరోనా కేసుల్లో భారత్‌కి 7వ స్థానం.. ఒక్కరోజులో 8,380 కేసుల నమోదు

01-06-202001-06-2020 08:24:06 IST
Updated On 01-06-2020 09:32:29 ISTUpdated On 01-06-20202020-06-01T02:54:06.587Z01-06-2020 2020-06-01T02:54:04.737Z - 2020-06-01T04:02:29.833Z - 01-06-2020

కరోనా కేసుల్లో భారత్‌కి 7వ స్థానం.. ఒక్కరోజులో 8,380 కేసుల నమోదు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా కేసుల సంఖ్య విషయంలో ఫ్రాన్స్‌ను అధిగమించిన భారత్ వైరస్ ప్రభావానికి ఘోరంగా గురవుతున్న దేశాల్లో 9 నుంచి 7వ స్థానానికి ఎగబాకింది. రోజురోజుకూ కొత్త రికార్డులు నమోదవుతుండటం దేశాన్ని కలవరపెడుతోంది. ఆదివారం రాత్రితో ముగిసిన గత 24 గంటల్లో 8,380 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. గత మూడు నెలల్లో ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. 

గత 24 గంటల్లో 8 వేలకు పైగా కేసులు వెలుగు చూడటం కూడా ఇదే తొలిసారి కావడంతో ప్రభుత్వ వర్గాలు తల్లడిల్లుతున్నాయి. కాగా కరోనా నుంచి తాజాగా 4,614 మంది కోలుకోగా, గత 24 గంటల్లో 193 మంది కన్నుమూశారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య ఐదువేల మార్కును దాటేసింది. ప్రపంచ ఆరోగ్య శాఖ తాజా గణాంకాల ప్రకారం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యలో భారత్ ఏడో స్థానానికి చేరింది.

దేశంలోకెల్లా మహారాష్ట్ర కరోనా కేసుల విషయంలో అగ్రస్థానం కొనసాగిస్తోంది. ఒక్కరోజులో దాదాపు 3 వేల కొత్త కేసులు నమోదుకావడం, పోలీసులు డజన్ల సంఖ్యలో చనిపోతుండటం శివసేన ప్రభుత్వానికి చిక్కులు కొని తెస్తోంది. కరోనా నివారణలో వైఫల్యం కారణంగా శివసేన ప్రభుత్వాన్ని రద్దు చేసి గవర్నర్ పాలన విధిస్తారనే పుకార్లు వ్యాపించాయి కూడా. కానీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా అలాంటిదేమీ లేదని తోసిపుచ్చడంతో పరిస్థితి కాస్త సద్దుమణిగింది.

ఇకపోతే దేశరాజధాని ఢిల్లీలో వరుసగా మూడోరోజు కూడా వెయ్యిమందికి పైగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం ఆప్ ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది. తర్వాతి స్థానాల్లో ఉన్న గుజరాత్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు వరుసగా 400కుపైగా, 300లకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. మరణాల విషయానికి వస్తే మహారాష్ట్రలో 99 కేసులు, గుజరాత్‌లో 27, ఢిల్లీలో 18 మరణాలు నమోదయ్యాయి.

ఆదివారం నాటికి దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు 1.82,143గా నమోదు కాగా 24 గంటల్లో 8,380 కేసులు నమోదయ్యాయి. భారత్‌లో కరోనా నుంచి కోలుకున్నవారు 86,984 మంది కాగా ఒక్కరోజులో 4,614 మంది కోలుకున్నారు. దేశం మొత్తం మీద 5,164 మంది కరోనా బారిన పడి మృతి చెందగా, గత 24 గంటల్లో 193 మంది మరణించారు. ఇంతవరకు దేశవ్యాప్తంగా 37,37,027మందికి కరోనా పరీక్షలు జరపగా గత 24 నెలల్లోనే 1,25,428 మందికి పరీక్షలు నిర్వహించారు.

ప్రపంచ వ్యాప్తంగా చూస్తే అమెరికా 18 లక్షల కేసుల నమోదుతో అగ్రస్థానం నిలుపుకోగా, 5 లక్షల కేసులతో బ్రెజిల్, 4 లక్షల కేసులతో రష్యా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. కాగా గత నాలుగైదు రోజులుగా రోజులు 7వేలకు పైగా కేసులు నమోదవుతున్న భారత్ ఇదే వేగాన్ని సాగిస్తే రష్యాతో పోటీపడటం ఖాయమని అంచనా.

కాగా జూన్ 30వరకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పొడిగించిన భారత్ దశలవారీగా లాక్ డౌన్ ఎత్తేసే ప్రక్రియను ప్రారంభించింది. జూన్ 8 నుంచి మాల్స్, హోటల్స్, రెస్టారెంట్లు, ఆలయాలను కెంటైన్మెంట్ జోన్లలో కూడా తెరుస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపున రాష్ట్రాల మధ్య ప్రజల ప్రయాణాలపై ఆంక్షలను తొలగించేశారు. రాత్రి పూట కర్ఫ్యూ కొనసాగినప్పటికీ కర్ఫ్యూ వేళలలో మార్పు చేసి రాత్రి 9 గంటలనుంచి ఉదయం 5 గంటలవరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు తెలిపారు.

కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి త్వరలోనే మొదలవుతుందని వైద్య నిపుణులు మొత్తుకుంటున్నప్పటికీ వివిధ దేశాల్లో లాక్ డౌన్ ఎత్తేయడం గమనార్హం.

 

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

   14 hours ago


ఆ ఐదు రాష్ట్రాల నుంచే 38 శాతం కరోనా కేసులు!

ఆ ఐదు రాష్ట్రాల నుంచే 38 శాతం కరోనా కేసులు!

   17 hours ago


కోజికోడ్ ఘోర విమాన ప్రమాదంలో 17 మంది మృతి.. 50 మందికి తీవ్రగాయాలు

కోజికోడ్ ఘోర విమాన ప్రమాదంలో 17 మంది మృతి.. 50 మందికి తీవ్రగాయాలు

   19 hours ago


కేరళలో వర్షబీభత్సం...  కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

కేరళలో వర్షబీభత్సం... కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

   07-08-2020


ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

   07-08-2020


గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

   07-08-2020


చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

   07-08-2020


దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

   07-08-2020


కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

   07-08-2020


ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

   07-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle