newssting
Radio
BITING NEWS :
శరన్నవరాత్రోత్సవాల్లో మూడో రోజు ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మవారు గాయత్రీదేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ. * నేడు, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన. ఏపీ తీరానికి దక్షిణంగా పశ్చిమ వాయువ్య మధ్య బంగాళాఖాతంలో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం. రెండ్రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ అధికారులు. భారీ వర్షాలకు బెంబేలెత్తిపోతున్న హైదరాబాద్ వాసులు. భారీ వర్షాలపై మైకుల్లో నగరవాసులను అలర్ట్ చేస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది. * దుర్గమ్మకు విజయవాడ ఎన్‌ఆర్ఐ తాతినేని శ్రీనివాస్ అనే భక్తుడి కానుక. రూ.45 లక్షల విలువైన ఏడువారాల వజ్రాల నగలు దుర్గగుడి ఈవో సురేశ్ బాబుకు అందజేత. * భారీ వర్షాలకు కుంగిన పురానాపూల్ బ్రిడ్జి. వరద నీటి ఉద్ధృతి పెరగడంతో పిల్లర్ కుంగుబాటు. వాహనాల రాకపోకలు నిలిపివేత. మరమ్మతులు పూర్తయిన అనంతరం వాహనాల రాకపోకల పునరుద్ధరణ. * అసోం, మిజోరం గ్రామాల ప్రజల మధ్య ఘర్షణ. సరిహద్దుల వద్ద పరిస్థితి ఉద్రిక్తం. అసోం ప్రజలపై మిజోరం వాసుల దాడి. గుడిసెలు, స్టాల్స్‌కు నిప్పు పెట్టిన అసోం వాసులు. ప్రధాని, హోంశాఖకు సమాచారం అందించిన అసోం ముఖ్యమంత్రి. * కడప జిల్లా రాజాంలో గంజాయి ముఠా గుట్టురట్టు. 8 మంది అరెస్ట్, 53 కేజీల గంజాయి, బైక్ స్వాధీనం.

కరోనా కేసుల్లో కొత్త జాతీయ రికార్డు.. ఒక్క రోజులో 70 వేల కేసులు

22-08-202022-08-2020 16:06:34 IST
2020-08-22T10:36:34.207Z22-08-2020 2020-08-22T10:36:32.022Z - - 20-10-2020

కరోనా కేసుల్లో కొత్త జాతీయ రికార్డు.. ఒక్క రోజులో 70 వేల కేసులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత్‌లో కరోనా తగ్గుముఖం అంటూ కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎంతగా ఊదరగొట్టినా కరోనా కేసులు మాత్రం తగ్గకపోగా సరికొత్త జాతీయ రికార్డులను నమోదు చేస్తున్నాయి. దేశంలో గడచిన 24 గంటల్లో 69,878 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. 

దేశవ్యాప్తంగా తాజాగా 945 మంది కోవిడ్‌ బాధితులు మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 55,794 కు చేరింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి దేశవ్యాప్తంగా మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 29,75,702 కు చేరింది. దేశంలో ప్రస్తుతం 6,97,330 యాక్టివ్‌ కేసులున్నాయి.

గడిచిన 24 గంటల్లో 63,631మంది వైరస్‌ బాధితులు కోలుకున్నారు. దీంతో వైరస్‌ను జయించిన వారి మొత్తం సంఖ్య 22,22,578 కు చేరింది. అంటే దేశంలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదయ్యాక అయిదునెలల కాలంలో దేశంలో కరోనా కేసుల సంఖ్య 30 లక్షలకు చేరువైంది. 

ఈమేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ శనివారం హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 74.30 శాతం, మరణాల రేటు 1.89 శాతంగా ఉందని తెలిపింది. ఇదిలాఉండగా.. భారత్‌లో ఇప్పటివరకు 3.44 కోట్ల కరోనా నిర్ధారణ పరీక్షలు పూర్తయ్యాయిని భారత్ వైద్య విద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) తెలిపింది. రోజూ 10 లక్షల వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని తెలిపింది.

కరోనా కట్టడి : బీసీజీ టీకాపై అధ్యయనం

కరోనా వైరస్‌ నుంచి కోలుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం ఊరట కలిగిస్తోంది. కోవిడ్‌-19 నుంచి కోలుకుని శుక్రవారం 62,282 మంది రోగులు డిశ్చార్జి కావడంతో దేశవ్యాప్తంగా రికవరీ రేటు 74.30 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇక మహమ్మారి బారినపడి మరణించే వారి సంఖ్య కూడా 1.89 శాతానికి దిగివచ్చింది. కోవిడ్‌-19 నుంచి కోలుకుని ఆస్పత్రులు, హోమ్‌ ఐసోలేషన్‌ నుంచి బయటకువచ్చే వారి సంఖ్య పెరగడంతో మొత్తం రికవరీల సంఖ్య 21,58,946కు ఎగబాకింది.

యాక్టివ్‌ కేసుల కంటే రికవరీల సంఖ్య అధికంగా ఉంది. గడిచిన 24 గంటల్లో 68,898 తాజా కేసులు వెలుగుచూడటంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 29,05,823కు చేరింది. మహమ్మారి బారినపడి గడిచిన 24 గంటల్లో 983 మంది ప్రాణాలు కోల్పోయారు. 

ఇక టీబీ నిరోధానికి వాడే బీసీజీ టీకా పెద్దల్లో కరోనా వైరస్‌ సోకకుండా ఎలాంటి ప్రభావం చూపుతుందనేది అంచనా వేసేందుకు ఐసీఎంఆర్‌ ముంబైలో అధ్యయనం చేపట్టింది. ఐసీఎంఆర్‌ కోసం సేథ్‌ జీఎస్‌ మెడికల్‌ కాలేజ్‌, కేఈఎం ఆస్పత్రి, బీఎంసీ ప్రజారోగ్య విభాగం సంయుక్తంగా ఈ అధ్యయనాన్ని నిర్వహిస్తాయని బృహన్‌ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు వెల్లడించారు. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle