newssting
Radio
BITING NEWS :
కరోనా సంక్షోభ తరుణంలోనూ వైద్యరంగంలో విశేష సేవలందిస్తున్న సంస్థలు, వైద్యులను ప్రముఖ మార్కెట్‌ రిసెర్చ్‌ కంపెనీ ‘టాప్‌ గ్యాలెంట్‌ మీడియా’ అవార్డులతో సత్కరించనుంది. ఈ సంవత్సరానికి(2020)గానూ సర్జికల్‌ అంకాలజీలో అత్యంత విశ్వసనీయ ఆస్పత్రిగా హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్‌ కేన్సర్‌ ఆస్పత్రిని ఎంపిక చేయడం విశేషం * సుక్మా జిల్లాలోని టల్మెటాలా ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలపై మావోయిస్టులు మళ్లీ రెచ్చిపోయారు. ఐఈడీ బ్లాస్ట్‌లతో విరుచుకుపడ్డారు. ఈ దాడి శనివారం అర్థరాత్రి జరిగింది. ఈ దాడిలో సీఆర్పీఎఫ్‌ కోబ్రాకి చెందిన ఎనిమిది మంది జవాన్లు గాయపడగా ఓ సీఆర్పీఎఫ్ అధికారి ప్రాణాలను కోల్పోయారు * కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ దేశరాజధాని ఢిల్లీలో భారీఎత్తున రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. బురారి ప్రాంతంలోని నిరంకార్‌ మైదానంలో నిరసనకు పోలీసులు అనుమతిచ్చిన నేపథ్యంలో వేలమంది రైతులు నిరసన స్థలికి చేరుకుని కేంద్రంపై నిరసన వ్యక్తం చేశారు * పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. తొమ్మిది రోజులుగా చమురు ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ఈనెల 19 నుంచి శనివారం వరకు (25వ తేదీ మినహా) ధరలు పెరుగుతూనే ఉన్నాయి. శనివారం అర్ధరాత్రి కూడా మరోసారి ధరలు పెరిగాయి. గడిచిన పది రోజుల్లో పెట్రోల్‌పై లీటర్‌కు రూ.1.28, డీజిల్‌ రూ.2.09 చొప్పున పెరిగింది * బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆదివారం జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకుని.. 10:45 గంటలకు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు * రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రత భారీగా పడిపోయింది. మెదక్‌లో అతితక్కువగా 14.8 డిగ్రీలు, హైదరాబాద్‌లో 17డిగ్రీల కనిష్ఠ ఉష్ణో గ్రత నమోదైంది. గాలిలో తేమ శాతం పెరిగింది * బంగాళాఖాతంలో మరో అల్పపీడన ద్రోణి బయలుదేరింది. ఇది తుపాన్‌గా మారే అవకాశాలు ఉండడంతో దీనికి బురేవి అని నామకరణం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ ప్రభావంతో ఆదివారం నుంచి సముద్ర తీరాల్లో వర్షాలు పడ నున్నాయి. ఒకటో తేదీ నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది * జాతీయ ప్రవేశ పరీక్షలు... నీట్‌, జేఈఈ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌కు సిద్ధమయ్యే విద్యార్థులు తమ ప్రతిభా సామర్థ్యాలను పరీక్షించుకునేందుకు ‘కోటా’ ఆన్‌లైన్‌ ప్రాక్టీస్‌ టెస్ట్‌ సిరీస్‌ సిద్ధం చేసినట్లు ఐఐటీ, జేఈఈ ఫోరమ్‌ కన్వీనర్‌ లలిత్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు www.iitjeeforum.com వెబ్‌సైట్‌లో లాగిన్‌ కావొచ్చన్నారు * వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా భక్తులకు పదిరోజుల పాటు వైకుంఠ ద్వార ప్రవేశాన్ని కల్పించనున్నట్టు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. డిసెంబరు 25నుంచి పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంచాలని నిర్ణయించినట్టు వివరించారు.

కరోనా కేసులు, మరణాల్లో భారత్‌ కూడా రికార్డే.. ఒకేరోజు 40 మరణాలు

12-04-202012-04-2020 12:48:29 IST
Updated On 12-04-2020 13:26:25 ISTUpdated On 12-04-20202020-04-12T07:18:29.031Z12-04-2020 2020-04-12T07:18:25.023Z - 2020-04-12T07:56:25.415Z - 12-04-2020

కరోనా కేసులు, మరణాల్లో భారత్‌ కూడా రికార్డే.. ఒకేరోజు 40 మరణాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అమెరికా, యూరప్ దేశాల స్థాయిలో కాకున్నా భారతదేశంలోనూ కరోనా ప్రకోపానికి జనం బలవుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో ఏకంగా 1,035 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా కాటుతో తాజాగా 40 మంది కన్నుమూశారు. దీంతో మృతుల సంఖ్య 273కు, పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,500కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ప్రకటించింది.  రాష్ట్రాల వారీగా గణాంకాలను పరిశీలిస్తే..కరోనా దేశవ్యాప్తంగా 273 మంది మృతి చెందినట్లు. 8,500 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయినట్లు స్పష్టమవుతోంది.  

కరోనా కట్టడికి ప్రభుత్వం ముందుగానే చర్యలు ప్రారంభించిందని కేంద్ర ఆరోగ్య శాఖ సంయక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ మీడియాతో అన్నారు. లాక్‌డౌన్, ఇతర నియంత్రణ చర్యలు చేపట్టకపోతే కరోనా కేసుల సంఖ్య ఇప్పటికే 2.08 లక్షలకు, ఈనెల 15 నాటికి ఏకంగా 8.2 లక్షలకు చేరేదని అన్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల కేసుల సంఖ్య ఇప్పటిదాకా 7,447కే పరిమితమైందన్నారు.

దేశవ్యాప్తంగా 586 ఆసుపత్రుల్లో కరోనా వైరస్‌ బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నట్లు లవ్‌ అగర్వాల్‌ వెల్లడించారు. ఈ హాస్పిటళ్లలో లక్షకుపైగా ఐసోలేషన్‌ పడకలు, 11,836 ఐసీయూ పడకలను  కేటాయించినట్లు తెలిపారు. దేశంలో ప్రస్తుతం యాంటీ మలేరియా ఔషధం హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ కొరత లేదని స్పష్టం చేశారు. కాగా, ఢిల్లీ స్టేట్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌(డీఎస్‌సీఐ)లో సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ ఆసుపత్రిలో ఒక డాక్టర్, 9 మంది పారామెడికల్‌ సిబ్బందితోపాటు 11 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. వారిని ప్రభుత్వ ఆసుపత్రులకు, ఇతర రోగులను సమీపంలోని ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చేర్చారు. మొత్తం ఆసుపత్రిని శానిటైజ్‌ చేశారు. 

దేశంలో 80 శాతం కరోనా పాజిటివ్‌ కేసులు 17 రాష్ట్రాల్లోని 71 జిల్లాల్లోనే నమోదయ్యాయని ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్‌ తెలిపారు. కరోనా వైరస్‌ కట్టడిలో కువైట్‌కు భారత్‌ అన్ని విధాలా సహకారం అందిస్తోందని విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ చెప్పారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇళ్లకే పరిమితమైన కేంద్రమంత్రులు సోమవారం నుంచి  విధుల్లో చేరనున్నారు. కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు వారు విధులు పునప్రారంభించనున్నారు.

కరోనా వైరస్‌ లక్షణాలున్న వ్యక్తిని ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా కొందరు దుండగులు వైద్య సిబ్బందిపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం మీరట్‌లో జరిగింది. ఈ వ్యవహారంతో సంబంధమున్న ఓ ఇమామ్‌తో సహా నలుగురిని అరెస్టు చేసి, జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు చెప్పారు.

కాగా తబ్లిగీ జమాత్‌ సభ్యుల ఆచూకీ కనిపెట్టడంలో సహకరించిన వారికి రివార్డు ఇస్తామని ఉత్తరప్రదేశ్‌ పోలీసు శాఖ ప్రకటించింది. గత నెలలో ఢిల్లీ నిజాముద్దీన్‌లో జరిగిన మత సమ్మేళనంలో పాల్గొని, తిరిగి వచ్చిన వారిలో కొందరు ఇప్పటికీ ఆజ్ఞాతంలోనే ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు రావడం లేదని అంటున్నారు. వీరి ఆచూకీ చెప్పినవారికి రూ.5,000 రివార్డు అందజేస్తామని తాజాగా ప్రకటించారు.  


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle