newssting
BITING NEWS :
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థి ఎవరనే అంశంపై అన్నాడీఎంకేలో అసంతృప్తులు. సీఎం ఎడపాడి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం ఎవరికివారు నేనంటే నేనే అంటూ వాదులాడుకునే స్థాయికి చేరిన వివాదం. వివాదానికి తెరదించేలా అక్టోబరు 7న అధికారిక ప్రకటిన చేయనున్నట్లు స్పష్టం చేసిన పార్టీ * కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టం బిల్లు ఆమోదాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన కేరళకు చెందిన కాంగ్రెస్‌ ఎంపీ టీఎన్‌ ప్రతాపన్‌. వ్యవసాయ రంగం అనేది రాష్ట్ర పరిధిలోని అంశమని, కేం‍ద్రప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరిస్తోందని సుప్రీం పిటిషన్ లో పేర్కొన్న ఎంపీ. కేం‍ద్రప్రభుత్వం తీసుకువచ్చిన ఈ మూడు చట్టాలు రాజ్యాంగ విరుద్దమని, చెల్లదని రద్దుచేయాలంటూ సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరిన ఎంపీ * అసోం మాజీ మహిళా ముఖ్యమంత్రి సైదా అన్వర తైమూర్ (84) అనారోగ్యంతో ఆస్ట్రేలియాలో కన్నుమూత. అసోం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా 4 దశాబ్దాల పాటు పనిచేసిన సైదా అన్వర తైమూర్. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సైదా అన్వర అసోం మొట్టమొదటి మహిళా సీఎం. గత కొన్నేళ్లుగా ఆస్ట్రేలియాలో ఉన్న తన కుమారుడి వద్ద ఉంటున్న సైదా అన్వర తీవ్ర అనారోగ్యానికి గురై కన్నుమూత * బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి(61)కి కరోనా సోకిన సంగతి తెలిసిందే. హిమాలయాల పర్యటనలో ఉండగా స్వల్ప జ్వరం రావడంతో పరీక్షలు చేయగా పాజిటివ్‌ ఫలితాలు. రిషికేశ్‌ ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చేరినట్లుగా ట్వీట్. తన డ్రైవర్‌కు పాజిటివ్‌ వచ్చిందని, అతడి ద్వారా వ్యాపించి ఉంటుందని ట్వీట్ లో వెల్లడించిన ఉమా భారతి * రైలు ప్రయాణికుల నెత్తిన చార్జీల భారం మోపేందుకు రైల్వే శాఖ కసరత్తులు. అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దిన రైల్వే స్టేషన్ల ప్రయాణికులపై చార్జీల మోత. ప్రయాణికుడు కొనుగోలు చేసే టికెట్ ధరను బట్టి పెరుగుదలకు అవకాశం. గరిష్ఠంగా రూ.35 నుండి కనిష్ఠంగా పది రూపాయల వరకు వసూలు చేయనున్న వినియోగ రుసుము* దేశవ్యాప్తంగా మొత్తం 7 వేల రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వీటిలో రద్దీగా ఉండే స్టేషన్లలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించి వినియోగ రుసుమును వసూలు చేస్తామని రైల్వే శాఖ ఇది వరకే ప్రకటించింది. ఇలా అభివృద్ధి చేసిన స్టేషన్లు దాదాపు 1000 వరకు ఉన్నాయి. రైల్వే శాఖ ప్రతిపాదనకు కేంద్రం కనుక ఆమోద ముద్ర వేస్తే ఈ స్టేషన్లలోని ప్రయాణికుల జేబులకు చిల్లులు పడడం ఖాయం * నిర్మాణంలో ఉన్న ఓ భవనం ఆకస్మాత్తుగా కుప్పకూలడంతో ముగ్గురు దుర్మరణం. గుజరాత్ రాష్ట్రంలోని వడోదర నగరంలో సోమవారం రాత్రి జరిగిన ఘటన. బావామాన్ పురా ప్రాంతంలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న భవనం. ఈ ఘటనలో అక్కడికక్కడే మరణించిన ముగ్గురు వ్యక్తులు. కరోనా బారిన పడ్డ ఒడిశా డిప్యూటీ స్పీకర్ రజనీకాంత్ సింగ్‌తోపాటు 11 మంది ఎమ్మెల్యేలు. నేటి నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు, పాత్రికేయులకు ప్రత్యేకంగా కరోనా పరీక్షలు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్, 11 మంది ఎమ్మెల్యేలకు కరోనా సోకినట్టు నిర్ధారణ * ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి అధికంగా సాగుతున్న వరద నీటి ప్రవాహం. జలాశయం 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటి విడుదల చేస్తున్న అధికారులు. జలాశయం ఇన్ ఫ్లో 2,05,017 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 3,06,819 క్యూసెక్కులు. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. 883.90 అడుగులకు చేరిన ప్రస్తుతం నీటి మట్టం * తమ భూములకు సరైన నష్టపరిహారం చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన సినీ నటుడు కృష్ణంరాజు. గన్నవరం ఎయిర్‌పోర్ట్ విస్తరణలో తమ భూమికి సరైన నష్టపరిహారం చెల్లించాలని పిటిషన్ దాఖలు. పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసిన హైకోర్టు * దేశంలో సోమవారం నుండి ప్రారంభమైన వాయువ్య భారతం నుంచి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ. రాజస్థాన్‌లోని జైసల్మీర్‌, బికనీర్‌ల నుంచి ఈనెల 17నే ఉపసంహరణ ప్రారంభం కావాల్సి ఉండగా, ఈసారి 11 రోజులు ఆలస్యం. ఏపీ నుంచి అక్టోబరు 15న రుతుపవనాలు నిష్క్రమిస్తాయని అంచనా. కాగా, దక్షిణ ఏపీలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. దీని ప్రభావంతో రాష్ట్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం * నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం. 18 క్రస్టు గేట్లు 10 ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 3,10,631 క్యూసెక్కులు కాగా పూర్తి స్థాయి నీటి నిల్వ 312.0450 టీఎంసీలు, ప్రస్తుత నీటి నిల్వ 309.6546 టీఎంసీలుగా నమోదు. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుత నీటిమట్టం 589.20 అడుగులకు చేరిక * మూసీ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం అధికంగా ఉండటంతో 2 గేట్ల నుంచి నీటి విడుదల చేస్తున్న అధికారులు. ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 645 అడుగులు(4.46టీఎంసీలు) కాగా 644 అడుగుల(4.20టీఎంసీలు)కు చేరిన ప్రస్తుత నీటి మట్టం. అలాగే ఇన్ ఫ్లో 4,505 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 3,978 క్యూసెక్కులుగా నమోదు * కీసర మాజీ తహసీల్దార్‌ నాగరాజు లంచం కేసులో అరెస్టయిన ముగ్గురు సహనిందితులకు ఏసీపీ ప్రత్యేక కోర్టు బెయిల్‌ మంజూరు. చేసింది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి శ్రీనాథ్‌యాదవ్‌, మధ్యవర్తి అంజిరెడ్డి, వీఆర్‌ఏ సాయిరాజ్‌కు బెయిల్‌

కరోనా కట్టడి చర్యలంటే చేతులెత్తేయడమేనా?

12-09-202012-09-2020 18:10:31 IST
Updated On 12-09-2020 18:12:13 ISTUpdated On 12-09-20202020-09-12T12:40:31.350Z12-09-2020 2020-09-12T12:40:28.576Z - 2020-09-12T12:42:13.267Z - 12-09-2020

కరోనా కట్టడి చర్యలంటే చేతులెత్తేయడమేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా కట్టడి విషయంలో కేంద్రంతో పాటు రాష్ట్రాల ప్రభుత్వాలూ చేతులెత్తేశాయా. జనబాహుల్యం ఈ ప్రశ్నకు ఔననే సమాధానం ఇస్తున్నాయి. ప్రపంచ మహమ్మారి కరోనా ముప్పు తొలగిపోలేదు. అమెరికా తరువాత భారత్ లోనే అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదౌతున్నాయి. గత పది రోజులుగా అయితే రోజుకు దాదాపు 95వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదౌతూ ప్రపంచ రికార్డును బద్దలు కొడుతున్న భారత్ లో ప్రభుత్వాలకు మహమ్మారి కట్టడి విషయంలో మాత్రం నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నాయి.

లాక్ డౌన్ ప్రకటించే సమయంలో ప్రధాని నరేంద్రమోడీ మహమ్మారిపై యుద్ధంలో గెలిచి తీరుతామని ఘనంగా ప్రకటించడమే కాదు...ప్రజా రక్షణ కంటే తమ ప్రభుత్వానికి ఏదీ ముఖ్యం కాదని చాటారు. కానీ నెల తిరిగే సరికే ఆయన స్వరం మారింది. ఆయనతో పాటే వివిధ రాష్ట్రాల సీఎంలు కూడా గొంతు సవరించుకున్నారు.

వ్యాక్సిన్ వచ్చే వరకూ జాగ్రత్తలు పాటిస్తూ కరోనాతో సహజీవనం చేయాల్సిందేనని కుండ బద్దలు కొట్టేశారు. అయితే...కరోనా పట్ల ప్రజలను అప్రమత్తం చేయాల్సిన ప్రభుత్వాలే...తమ భుజాలను తామే చరుచుకుంటూ...రికవరీ రేటు భేషుగ్గా ఉందనీ, మరణాల రేటు ప్రపంచ దేశాలతో పోలిస్తే బహుస్వల్పమనీ పదే పదే ప్రకటనలు గుప్పిస్తున్నాయి.

మరో వైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా సోకి కోలుకున్నా దీర్ఘకాలం పాటు ఆరోగ్యంపై ప్రభావం ఉంటుందని చాటుతోంది. అంతటి దుష్పరిమాణాలు ఉండే మహమ్మారిని కట్టడి చేయడానికి వ్యాక్సిన్ లేకున్నా...ఆ మహమ్మారి బారి నుంచి ప్రజలు తమను తాము కాపాడుకోవడానికి అవసరమైన వనరులను అందించే విషయంలో కూడా భారత ప్రభుత్వం, దేశంలోని రాష్ట్రాల ప్రభుత్వాలూ ముందుకు రాకపోవడం శోచనీయం.

పని చేస్తే కాని పూటగడవని సామాన్య జనం కరోనా భయాన్ని పంటి బిగువున దాచుకుని ఉపాధి కోసం బయటకు రాకతప్పని పరిస్థితి ఈ ఐదున్నర నెలల్లో ఏర్పడింది. అందుకు బాధ్యత కేంద్రం, రాష్ట్రాల ప్రభుత్వాలదే. ప్రజా రక్షణ కోసం అత్యవసర పరిస్థితుల్లో లాక్ డౌన్ విధించిన ప్రభుత్వాలు...ఆ సమయంలో బడుగు జీవులను ఆదుకోవడానికి తీసుకోవలసిన చర్యలను పకడ్బందీగా నిర్వహించలేదు. తీరా అన్ లాక్ దశలు ఆరంభమయ్యే సమయానికి దేశంలో కరోనా వ్యాప్తి విలయం సృష్టించే పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా ప్రభుత్వాలు సామాజిక దూరం, మాస్కులు, శానిటైజర్లు అంటూ జాగ్రత్తలకే పరిమితమయ్యాయి.

పనుల కోసం జనం బయటకు వస్తే గ్రామాల సంగతేమో కానీ పట్టణాలూ నగరాల్లో వాహన కాలుష్యం, ట్రాఫిక్ జామ్ లతో సామాజిక దూరం అనే పదానికి అవకాశమే లేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీనికి తోడు కరోనాకు మనిషిని చంపే శక్తి లేదంటూ వైద్య ఆరోగ్య శాఖ చేస్తున్న ప్రకటనలు ప్రజలలో నిర్లక్ష్యం, కరోనా పట్ల జాగ్రత్త వహించాల్సిన అవసరం లేదన్న భావన ఏర్పడేందుకు దోహదపడుతున్నాయి. దేశంలో రోజుకు దగ్గర దగ్గర లక్ష మందికి కరోనా సోకుతున్న పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ గాడిలో పడాలంటూ ప్రధాని, రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేస్తున్న ప్రకటనలు, ఇస్తున్న పిలుపులూ ఎంత మాత్రం సముచితంగా లేవు. 

తొలిసారి కరోనా లాక్ డౌన్ విధించినప్పుడు ప్రజారోగ్యంపై ప్రభుత్వాలు చూపిన అక్కర ఇప్పుడు మచ్చుకైనా కనినపించడం లేదు. తొలుత లాక్ డౌన్ సమయంలో వలస కార్మికుల కష్టాలు, కన్నీళ్లు, బాధలు, ఇబ్బందుల పట్ల చూపిన కన్సర్న్ ఇప్పుడు ప్రభుత్వాలలో కనిపించడం లేదు. ఇప్పుడు ప్రభుత్వాల దృష్టి అంతా గణాంకాలు, దేశ ఆర్థిక వృద్ధిపైనే ఉంది. దేశ పురోగతికి ఆర్థిక వృద్ధి కావాలి ఎవరూ కాదనరు. అందుకని మహమ్మారి విజృంభణ కారణంగా కొలువులు పోయి, ఉపాధి దొరకక అల్లాడుతున్న బడుగు జీవుల వెతలను పట్టించుకోకపోవడం నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యమే తప్ప మరొకటి కాదు.

 

 

బ్రేకింగ్.. ఉపరాష్ట్రపతి వెంకయ్యకు కరోనా పాజిటివ్!

బ్రేకింగ్.. ఉపరాష్ట్రపతి వెంకయ్యకు కరోనా పాజిటివ్!

   6 hours ago


ఆ సీనియర్ ఐపీఎస్ అధికారి.. భార్యను చితక్కొడుతూ అడ్డంగా దొరికిపోయారు

ఆ సీనియర్ ఐపీఎస్ అధికారి.. భార్యను చితక్కొడుతూ అడ్డంగా దొరికిపోయారు

   12 hours ago


కరోనా గాలి ద్వారా వ్యాపిస్తుందా..?

కరోనా గాలి ద్వారా వ్యాపిస్తుందా..?

   15 hours ago


ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంచలన నిర్ణయం.. ప్రభుత్వ తీరే కారణమా..!

ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంచలన నిర్ణయం.. ప్రభుత్వ తీరే కారణమా..!

   16 hours ago


నాలుక కోసి అత్యాచారం చేసిన కామాంధులు.. చికిత్స పొందుతూ యువతి మృతి

నాలుక కోసి అత్యాచారం చేసిన కామాంధులు.. చికిత్స పొందుతూ యువతి మృతి

   18 hours ago


కోవిడ్ నేర్పిన గుణపాఠం అదే.. ప్రధాని మోదీ

కోవిడ్ నేర్పిన గుణపాఠం అదే.. ప్రధాని మోదీ

   18 hours ago


రైలు ప్రయాణమా.. కాస్త ఖర్చవుతుంది..!

రైలు ప్రయాణమా.. కాస్త ఖర్చవుతుంది..!

   19 hours ago


సరిహద్దుల్లో బ్రహ్మోస్ క్షిపణులు.. యుద్ధానికి భారత్ సన్నద్ధం

సరిహద్దుల్లో బ్రహ్మోస్ క్షిపణులు.. యుద్ధానికి భారత్ సన్నద్ధం

   19 hours ago


అన్ లాక్ 5.0...కరోనా వ్యాప్తికి ఆహ్వానం కానుందా?

అన్ లాక్ 5.0...కరోనా వ్యాప్తికి ఆహ్వానం కానుందా?

   28-09-2020


ఢిల్లీలో ట్రాక్టర్ తగలబెట్టిన రైతులు.. ప్రభుత్వం పట్టించుకునేనా

ఢిల్లీలో ట్రాక్టర్ తగలబెట్టిన రైతులు.. ప్రభుత్వం పట్టించుకునేనా

   28-09-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle