newssting
BITING NEWS :
*దేశంలో 19,06,520 పాజిటివ్, మరణాలు 39,820.. ఒక్కరోజే 51,189 కేసులు నమోదు *తెలంగాణ క్యాబినెట్ భేటీ..మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సమావేశం..కొత్త సచివాలయ నిర్మాణం,కరోనా వైరస్ వ్యాప్తి,నిరోధక చర్యలు, విద్యా వ్యవస్థ పునరుద్దరణ అంశాల పై చర్చించనున్న క్యాబినెట్ *తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2012 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 70,958కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాతో 576 మంది మృతి..50,814 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 19,568 కేసులు యాక్టివ్ *అయోధ్య‌లో రామమందిరం నిర్మాణానికి భూమిపూజ...సర్వం సిద్దం, 175 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం*మరో ప్రైవేటు ఆసుపత్రి మీద వేటు వేసిన వైద్యారోగ్య శాఖ..ఇక మీదట కోవిడ్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా బంజారాహిల్స్ విరించి హాస్పిటల్ కి నోటీసులు*ఏపీలో గ‌త 24 గంట‌ల్లో 9,747 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు..67 మంది మృతి, 176333కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, ఇప్ప‌టి వ‌ర‌కు 1604 మంది మృతి*పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల మీద ఏపీ హైకోర్టు స్టేటస్ కో..రిప్లై కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి ఆదేశం..విచారణ ఆగష్టు 14కు వాయిదా..యధాతధ స్థితి ఆగష్టు 14 వరకు కొనసాగుతుందన్న కోర్టు

కరోనా కట్టడిలో భారత్ అగ్రగామి.. ప్రధాని నరేంద్ర మోదీ

18-07-202018-07-2020 06:49:43 IST
2020-07-18T01:19:43.213Z18-07-2020 2020-07-18T01:19:40.020Z - - 05-08-2020

కరోనా కట్టడిలో భారత్ అగ్రగామి.. ప్రధాని నరేంద్ర మోదీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రపంచంలోనే అత్యుత్త‌మ కోవిడ్‌-19 రిక‌వ‌రీ రేట్ల‌లో భార‌త‌దేశం ఒక‌ట‌ని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. క్షేత్రస్థాయి వైద్య ఆరోగ్య వ్యవస్థ వల్లే ఇది సాధ్యమైందని అభిప్రాయపడుతూ.. దేశ ప్రజల ఉద్యమంగా కరోనాపై పోరాడుతున్నామన్నారు. ఐక్యరాజ్య సమితి ఆర్థిక, సామాజిక మండలి అత్యున్నత సమావేశంలో మోదీ కొవిడ్‌-19 తర్వాత ఐరాస పాత్రపై శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కీలక ఉపన్యాసం చేశారు.

కరోనా మ‌హ‌మ్మారికి వ్య‌తిరేకంగా దేశ వ్యాప్తంగా పోరాటాన్ని ప్ర‌జా ఉద్య‌మంగా మార్చేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నించిన‌ట్లు తెలిపారు. ప్ర‌భుత్వం, పౌర స‌మాజాన్ని మహమ్మారీని ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు.  కాగా దేశంలో 2022 నాటికి ప్ర‌తీ పౌరుడు సొంతింట్లో ఉండే విధంగా అంద‌రికి ఇళ్లు నిర్మించే కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టిన‌ట్లు తెలిపారు. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో ప్రపంచంలోనే భారత్‌ మెరుగైన స్థానంలో ఉందని మోదీ 

కరోనా మహమ్మారి అనేక దేశాల సామర్థ్యానికి తీవ్రమైన పరీక్ష పెట్టింది. భారత్‌లో కరోనా కష్టకాలంలో పేదలను ఆదుకునేందుకు రూ. 2,248 కోట్లను వెచ్చించాం. ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మలచుకుంటూ.. ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’కు నాంది పలికాం. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే చర్యలను ప్రారంభించాం. ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలకు కూడా సహాయం చేశాం. మా నినాదం ‘సబ్‌ కా సాథ్‌.. సబ్‌ కా వికాస్‌.. సబ్‌ కా విశ్వాస్‌’. కరోనా కల్లోలం నేపథ్యంలో 150 దేశాలకు ఔషధ సాయం చేశాం అని మోదీ పేర్కొన్నారుయ

2030 ఆర్థిక లక్ష్యాలను చేరేందుకు ఒక పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నాం. ఇందులో భాగంగా పౌష్ఠికాహారం, ఆరోగ్య విద్య, విద్యుత్తు, గృహనిర్మాణ రంగాలపై దృష్టి సారించాం. మహాత్మాగాంధీ 150వ జయంత్యుత్సవాల్లో భాగంగా 6 లక్షల గ్రామాల్లో పారిశుధ్యం పూర్తయింది. గడిచిన ఐదేళ్లలో 11 కోట్ల ఇళ్లలో మరుగుదొడ్ల నిర్మాణం జరిగింది. దీంతో.. గ్రామీణ పారిశుధ్యం 38 నుంచి 100శాతానికి చేరింది. మహిళా సాధికారత వేగంగా ముందుకు సాగుతోందని, 7 కోట్ల మంది మ‌హిళ‌లు స్వ‌యం స‌హాయ‌క సంఘాల్లో ఉన్నారని మోదీ తెలిపారు. 

దేశంలో గత అయిదేళ్లలో 40 కోట్ల మందికి కొత్తగా బ్యాంకు ఖాతాలు తెరిపించాం. ప్రతిఒక్కరికీ మొబైల్‌ ఫోన్‌ కనెక్షన్లు ఉన్నాయి. 70 కోట్ల మంది నగదు బదిలీతో లబ్ధి పొందుతున్నారు. 81.3 కోట్ల మందికి ఆహార భద్రత ఉంది. 2022కల్లా భారత స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాల సందర్భంగా ప్రతి భారతీయుడికి సొంత ఇంటికలను సాకారం చేసే దిశలో అడుగులు వేస్తున్నాం. ఆయుష్మాన్‌ భారత్‌ కింద ప్రపంచంలోనే అత్యధికంగా 50 కోట్ల మందికి బీమా సదుపాయం కల్పించాం. 2025లోగా దేశంలో క్షయవ్యాధిని రూపుమాపుతాం అని మోదీ వివరించారు.

కాగా దేశంలో కరోనా కేసుల సంఖ్య 10 లక్షలను దాటగా.. శుక్రవారానికి కోలుకున్న వారి సంఖ్య 6.36కు చేరుకుంది. ఈ నేపథ్యంలో ప్రధాని ఐరాస సమావేశంలో రికవరీ రేటును ప్రధానంగా ప్రస్తావించారు.

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

   an hour ago


భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

   5 hours ago


మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

   7 hours ago


బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

   8 hours ago


భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

   8 hours ago


భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

   9 hours ago


దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

   a day ago


కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

   04-08-2020


రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

   04-08-2020


ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   03-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle