newssting
BITING NEWS :
*దేశంలో కరోనా పాజిటివ్ కేసులు.. 22 లక్షల 26 వేల 229, మరణాలు 44,597 * విజయవాడ స్వర్ణప్యాలెస్ ప్రమాదం కేసులో ముగ్గురి అరెస్ట్ * ఏపీలో 24 గంటల వ్యవధిలో 7,665 కరోనా కేసులు .. రాష్ట్రంలో 2,35,525కి చేరిన మొత్తం కరోనా కేసులు. 80 కరోనా మరణాలు .. 2,116కు చేరిన కరోనా మృతులు *రాజమండ్రి జిల్లా కొవిడ్ హాస్పిటల్ లో కరోనా పరీక్షలు చేసే 9 మంది ల్యాబ్ టెక్నీషియన్స్ కు, మెడికల్ ఆఫీసర్ కు పాజిటివ్ *రాష్ట్రపతికి లేఖ వ్రాసిన సీతానగరం మండలం మునికూడలికి చెందిన శిరోముండనం బాధితుడు ప్రసాద్..మావోయిస్టుల్లో కలిసిపోవడానికి అనుమతి ఇవ్వాలని కోరిన బాధితుడు..శిరోముండనం కేసులో నిందితులు అందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ *ఢిల్లీ: మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి క‌రోనా పాజిటివ్.. త్వరగా కోలుకోవాలని ట్వీట్లు *హైదరాబాద్‌: ఈఎస్ఐలోని బంగారు మైసమ్మ ఆలయంలో చోరీకీ విఫలయత్నం*సుశాంత్ కేసులో ఈడి ముందు హాజరైన నటి రియా.. ఈడీ నోటీసుల‌తో రెండోసారి హాజ‌రు*తెలంగాణలో 80 వేలు దాటిన పాజిటివ్ కేసులు.. గ‌త 24 గంట‌ల్లో 1256 పాజిటివ్ కేసులు న‌మోదు*ఢిల్లీ క‌రోనా హెల్త్ బులిటెన్ః కొత్త‌గా 707 కేసులు, 20 మ‌ర‌ణాలు

కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా ఇక ఢిల్లీ మోడలే మార్గదర్శి.. కేంద్రం సన్నాహం

27-07-202027-07-2020 07:50:47 IST
2020-07-27T02:20:47.610Z27-07-2020 2020-07-27T02:20:45.032Z - - 11-08-2020

కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా ఇక ఢిల్లీ మోడలే మార్గదర్శి.. కేంద్రం సన్నాహం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒకప్పుడు కోవిడ్‌–19కి రాజధానిగా మారుతోందని సాక్షాత్తూ హైకోర్టు విమర్శకు గురైన ఢిల్లీ ఇప్పుడు కరోనా కట్టడిలో ఒక మోడల్‌గా మారి విజయ దరహాసం చేస్తోంది. నెలరోజుల వ్యవధిలో ఢిల్లీలో కరోనా కేసులు గణనీయంగా తగ్గడంతో దేశవ్యాప్తంగా ఢిల్లీ మోడల్‌ అమలుకు కేంద్రం సన్నాహాలు మొదలెట్టింది. అన్ని రాష్ట్రాల్లో రాజధాని తరహా చర్యలు  చేపట్టడానికి కేంద్రం సన్నాహాలు ప్రారంభించింది. పరీక్షలు, రికవరీ, కేంద్ర రాష్ట్రాల సమన్వయం, ప్రజా సహకారం అనే నాలుగు సూత్రాలతో ఢిల్లీలో కరోనా నియంత్రణలోకి వచ్చింది. 

ఢిల్లీలో మార్చి 2న తొలి కేసు నమోదైన తర్వాత జూన్‌ 23న ఒకే రోజు అత్యధికంగా 3,947 కేసులు నమోదయ్యాయి. సరిగ్గా నెలరోజులకి జూలై 22న నమోదైన కొత్త కేసుల సంఖ్య 1,349గా ఉంది. నెల రోజుల్లోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పక్కా ప్రణాళికతో కేసుల్ని నియంత్రించాయి. జూన్‌లో 36% ఉన్న రికవరీ రేటు, జూలై 25 నాటికి 87%కి పెరిగింది. కొత్త కేసులు కూడా తగ్గాయి.

వైరస్‌ వ్యాప్తి నెమ్మదిగా మొదలై, చూస్తూ ఉండగానే స్వైర విహారం చేసి, ఆ తర్వాత క్రమేపి తగ్గుముఖం పట్టడం అనేది చాలా చోట్ల చూస్తున్నాం. ఇప్పుడు దేశ రాజధాని అలా తగ్గుముఖం పట్టే దశకి వచ్చింది. గత నెలరోజులుగా రోజు వారీ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. అలాగని పూర్తిగా ధీమాగా ఉండే పరిస్థితి లేదు. కేంద్ర హోంశాఖ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య సమన్వయం, ప్రజల సహకారంతో వైరస్‌ నియంత్రణలోకి తెచ్చామని ఢిల్లీ సీఎం  కేజ్రీవాల్‌ అంటున్నారు 

కానీ ఆరోగ్య నిపుణుల్లో భిన్నాభిప్రాయాలైతే నెలకొన్నాయి. ‘భారత్‌లో చాలా ప్రాంతాల్లో కరోనా తగ్గుముఖం పడుతోంది. అంత మాత్రాన కరోనా నియంత్రణలోకి వచ్చిందని భావించలేం. పరీక్షల సామర్థ్యాన్ని పెంచడం ద్వారా నెలరోజుల్లో ఢిల్లీలో పాజిటివ్‌ కేసుల సంఖ్యను తగ్గించగలిగారు. కానీ ఈ వైరస్‌ ఎప్పుడు ఎక్కడ ఎందుకు విజృంభిస్తుందో అర్థం కాని పరిస్థితులున్నాయి’ అని ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ సోషల్‌ మెడిసిన్‌ సెక్రటరీ జనరల్‌ డాక్టర్‌ ఏఎం ఖాద్రీ తెలిపారు.  

ఢిల్లీలో కరోనాను ఎలా కట్టడి చేశారు?

ప్రభుత్వం కోవిడ్‌ను నిర్ధారించే ఆర్‌టీ–పీసీఆర్‌ టెస్టుల కంటే ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టులు మూడు రెట్లు ఎక్కువగా చేసింది. రోజుకి 20 వేల వరకు పరీక్షలు నిర్వహించింది. ర్యాపిడ్‌ పరీక్షల ద్వారా 18% ఫాల్స్‌ నెగెటివ్‌ వచ్చినా చేసిన వారికే మళ్లీ చేయడం ద్వారా రోగుల్ని సకాలంలో గుర్తించి, వెనువెంటనే క్వారంటైన్‌లో ఉంచడంతో వైరస్‌ వ్యాప్తిని అరికట్టినట్టుగా పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రొఫెసర్‌ ఆర్‌. బాబు చెప్పారు. 

ఆయన మాటల్లో చెప్పాలంటే.. నగరాన్ని కంటైన్‌మెంట్‌ జోన్స్, మైక్రో కంటైన్‌మెంట్‌ జోన్స్‌గా విభజించి కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రభుత్వం పర్యవేక్షణను పెంచింది. యుద్ధ ప్రాతిపదికన ఆస్పత్రులు ఏర్పాటు చేసి, ఆక్సో మీటర్లను ప్రజలకు అందుబాటులో ఉంచింది. వైరస్‌ సోకి హోం క్వారంటైన్‌లో ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకి రాకుండా నిఘా ఉంచింది. మొత్తం వెయ్యి మంది వారియర్లను రంగంలోకి దించి నగరంలో కరోనా పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు సమీక్షించింది.  

అన్నింటికీ మించి కోవిడ్‌ రోగులకి ప్లాస్మా థెరపీ ఇవ్వడం బాగా పనిచేసింది. దీంతో రికవరీ రేటు 87 శాతానికి పెరిగింది. జాతీయ సగటు (63%) కంటే ఇది చాలా ఎక్కువ. ఫలితంగా యాక్టివ్‌ కేసుల సంఖ్య జూలై 25నాటికి 12,657కి పరిమితమైంది. రక్త పరీక్షల ద్వారా ఇటీవల ఢిల్లీవాసుల్లో దాదాపుగా 30శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నట్టుగా తేలింది. దీంతో ఎక్కువమందిలో వైరస్‌ను తట్టుకునే హెర్డ్‌ ఇమ్యూనిటే అభివృద్ధి చెందిందని, అది కూడా కేసుల సంఖ్య తగ్గడానికి ఒక కారణంగా భావించవచ్చునని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జెనోమిక్స్‌ అండ్‌ ఇంటిగ్రేటివ్‌ బయాలజీ డైరెక్టర్‌ అనురాగ్‌ అగర్వాల్‌ చెప్పారు.

జూలై 23 నుంచే ఢిల్లీలో ఆసుపత్రుల్లో పడకలు ఖాళీ

కరోనా హాట్‌స్పాట్‌గా మారిన దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం కోవిడ్‌-19 తీవ్రత తగ్గుముఖం పట్టిందని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. ఈనెల 23 నుంచి ఆస్పత్రుల్లో పడకల ఆక్యుపెన్సీ గణనీయంగా పడిపోయిందని సీఎం వెల్లడించారు. గతంతో పోలిస్తే తక్కువ మంది కరోనా వైరస్‌ బారిపడుతున్నారని, వారిలో చాలావరకూ ఇంటివద్దే చికిత్స పొందుతుండగా, అతితక్కువ మందికే ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి ఎదురవుతోందని చెప్పారు. 

దీంతో ఆస్పత్రులపై ఒత్తిడి తగ్గుతోందని, ఈనెల 23 నుంచి 26 మధ్య బెడ్‌ ఆక్యుపెన్సీ పడిపోయిందని కేజ్రీవాల్‌ ఆదివారం సోషల్‌ మీడియా వేదికగా పేర్కొన్నారు. కాగా యాక్టివ్‌ కేసుల్లో ఢిల్లీ ప్రస్తుతం ఎనిమిదో స్ధానంలో నిలిచిందని చెప్పారు. కొద్దిరోజుల కిందట ఢిల్లీలో పరిస్థితి ఆందోళనకరంగా ఉండగా ప్రస్తుతం వైరస్‌ను దీటుగా నిలువరించామని పేర్కొన్నారు. ఢిల్లీ వాసులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ముందు జాగత్ర చర్యలు చేపడుతూ సురక్షితంగా ఉండాలని కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు. 

ఇక దేశ రాజధానిలో కోవిడ్‌-19 కేసులు 1.29 లక్షలు దాటగా మరణాల సంఖ్య 3806కి పెరిగింది.ఇక కరోనా వైరస్‌ బారినపడి కోలుకునే వారి సంఖ్య 87 శాతంగా ఉండటం ఊరట కలిగించే పరిణామమని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్‌ జైన్‌ అన్నారు

 

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   an hour ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   18 hours ago


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   19 hours ago


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


స్వచ్చభారత్ లేకుంటే కరోనాతో దేశం ధ్వంసమయ్యేది...ప్రధాని మోదీ వ్యాఖ్య

స్వచ్చభారత్ లేకుంటే కరోనాతో దేశం ధ్వంసమయ్యేది...ప్రధాని మోదీ వ్యాఖ్య

   09-08-2020


భారత్ ని వేడుకొంటున్న చైనా.. వెనక్కు పోయాం.. నమ్మండి ప్లీజ్

భారత్ ని వేడుకొంటున్న చైనా.. వెనక్కు పోయాం.. నమ్మండి ప్లీజ్

   09-08-2020


10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

   08-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle