newssting
BITING NEWS :
*దేశంలో 19,06,520 పాజిటివ్, మరణాలు 39,820.. ఒక్కరోజే 51,189 కేసులు నమోదు *తెలంగాణ క్యాబినెట్ భేటీ..మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సమావేశం..కొత్త సచివాలయ నిర్మాణం,కరోనా వైరస్ వ్యాప్తి,నిరోధక చర్యలు, విద్యా వ్యవస్థ పునరుద్దరణ అంశాల పై చర్చించనున్న క్యాబినెట్ *తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2012 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 70,958కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాతో 576 మంది మృతి..50,814 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 19,568 కేసులు యాక్టివ్ *అయోధ్య‌లో రామమందిరం నిర్మాణానికి భూమిపూజ...సర్వం సిద్దం, 175 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం*మరో ప్రైవేటు ఆసుపత్రి మీద వేటు వేసిన వైద్యారోగ్య శాఖ..ఇక మీదట కోవిడ్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా బంజారాహిల్స్ విరించి హాస్పిటల్ కి నోటీసులు*ఏపీలో గ‌త 24 గంట‌ల్లో 9,747 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు..67 మంది మృతి, 176333కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, ఇప్ప‌టి వ‌ర‌కు 1604 మంది మృతి*పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల మీద ఏపీ హైకోర్టు స్టేటస్ కో..రిప్లై కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి ఆదేశం..విచారణ ఆగష్టు 14కు వాయిదా..యధాతధ స్థితి ఆగష్టు 14 వరకు కొనసాగుతుందన్న కోర్టు

కరోనా ఆందోళన.. ప్రపంచంలో 9వ స్థానానికి ఇండియా

29-05-202029-05-2020 10:12:44 IST
Updated On 29-05-2020 10:20:24 ISTUpdated On 29-05-20202020-05-29T04:42:44.115Z29-05-2020 2020-05-29T04:41:42.128Z - 2020-05-29T04:50:24.696Z - 29-05-2020

కరోనా ఆందోళన.. ప్రపంచంలో 9వ స్థానానికి ఇండియా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తోంది. భారత్‌లోనూ బాగా వేగంతో వ్యాపిస్తోంది. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 7466 కేసులు, 175 మరణాలు సంభవించాయి. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1,65,799 కి చేరింది. అంతేకాకుండా మరణాల సంఖ్య 4706కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది.  భారత్‌లో కరోనా వైరస్‌ బయటపడ్డ తరువాత  24గంటల్లో అత్యధిక కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. 

అయితే, కరోనా మరణాల్లో భారత్‌, చైనాను దాటేసింది. అంతేకాదు ప్రపంచదేశాల్లో 9వ స్థానంలో వుంది. చైనాలో ఇప్పటివరకు 4634 కొవిడ్‌ మరణాలు సంభవించగా భారత్‌లో ఈ సంఖ్య 4706గా ఉండటం వైరస్‌ తీవ్రతకు అద్దం పడుతోంది. అంతేకాకుండా కరోనా కేసుల్లోనూ ప్రపంచంలో భారత్‌ 9వ స్థానానికి  చేరడంతో ఆందోళన మరింతగా పెరిగింది. లక్షా 82వేల కేసులతో జర్మనీ 8వ స్థానంలో ఉండగా, లక్షా 60వేల కేసులతో టర్కీ 10స్థానంలో కొనసాగుతోంది. మన దేశంలో కరోనా రానురాను తగ్గుముఖం పడుతుందా..? లేక మరింత విజృంభిస్తుందా..? ఢిల్లీ ఐఐటీ పరిశోధక బృందం తాజాగా వెలువరించిన రిపోర్టు ఏదైనా సాధ్యమే అని చెబుతోంది. దేశంలో కరోనా సంక్రమణ వేగం తగ్గుముఖం పడుతున్న సంకేతాలు ఓ పక్క కనిపిస్తున్నాయి. కేసుల వృద్ధిరేటు రెండు రోజులుగా 5శాతం లోపే ఉంది. 

ఢిల్లీ ఐఐటీ టీమ్ లేటెస్ట్ రీసెర్చ్ ప్రకారం... ఛత్తీస్ గఢ్ లో సంక్రమణ రేటు 5. అంటే ఒక్కో కరోనా బాధితుడు ఆ రాష్ట్రంలో మరో ఐదుగురికి వైరస్ ని సంక్రమించే పరిస్థితి వుంది. అసోం ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడ కరోనా బాధితుడు మరో 4.43 మందికి వ్యాధిని సంక్రమించే చాన్సు వుంది. కేరళలో కరోనా పాజిటీవ్ పర్సన్ మరో 3.58 మందికి వైరస్ ని అంటించే అవకాశం వుంది. తెలంగాణాలో 1.54 మందికి, ఏపీలో 0.86 మందికి వ్యాధి సంక్రమించే పరిస్థితి వుంది. గతంలో చూస్తూ ఈ సంక్రమణ వేగం క్రమంగా తగ్గుతుండటం సంతోషదాయకం. 

ఇలావుంటే.. గడచిన 24 గంటల్లో దేశంలో మొత్తం 6వేల 387 మంది వైరస్ పాజిటివ్ గా నిర్దారణ అయ్యారు. ఇదే ఒరవడి కొనసాగితే.. వచ్చే నెల 17 నాటికి దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్‌య 5 లక్షలు దాటుతుందని ఢిల్లీ ఐఐటీ రీసెర్చ్ టీమ్ చెబుతోంది. ఓపక్క సంక్రమణ వేగం తగ్గుతోందని సంతోషించాలా.. లేక వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోందని భయపడాలా.. అర్థం కాని పరిస్థితి సాధారణ జనానిది.వృద్దులు, పిల్లలు ఇంటికే పరిమితి కావాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. వీరిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని కాబట్టి.. వీరే ఎక్కువగా వైరస్ బారిన పడతారని.. వైద్యులు ఈ మేరకు సలహా ఇచ్చారు. 

లాక్ డౌన్ అమలు చేస్తున్నప్పటికీ భారత్‌లో ఈ స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతుండటంతో మే 31తో లాక్‌డౌన్‌ను ముగించాలన్న నిర్ణయంపై కేంద్రం పునరాలోచిస్తున్నట్లు తెలిసింది. తొలుత కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న 11 నగరాలకే లాక్‌డౌన్‌ పొడిగింపును పరిమితం చేయాలని భావించినప్పటికీ.. తాజాగా సడలింపులతో కూడిన లాక్‌డౌన్‌ను దేశవ్యాప్తంగా అమలు చేయాలన్నది కేంద్రం యోచనగా తెలుస్తోంది.  మే 31న మన్ కీ బాత్‌లో కేంద్రం నిర్ణయంపై ప్రధాని మోదీ కీలక ప్రకటన చేసే అవకాశముందని జోరుగా ప్రచారం సాగుతోంది.

36 రోజుల పసికందు విజయం

COVID-19 Recovery Updates: 36-Days-Old Baby Recovers From COVID-19 ...

కరోనా వ్యాప్తి ఎలా వున్నా చిన్నారులు త్వరగా కోలుకోవడం కాస్తంత రిలీఫ్ నిస్తోంది. తాజాగా మహారాష్ట్రలో 36 రోజుల పసికందు కరోనాను జయించి సంపూర్ణ ఆరోగ్యంతో తల్లి చెంతకు చేరింది. ఈ ఘటన ముంబైలో జరిగింది. ముంబైలో 36 రోజుల బాలుడికి కరోనా సోకగా.. తల్లిదండ్రులు ఆ బాబును సియాన్ పిల్లల ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యులు కోవిడ్ 19 నిబంధనల ప్రకారం చిన్నారికి ప్రత్యేకంగా చికిత్స అందించి కంటికి రెప్పలా చూసుకున్నారు. దాదాపు 15 రోజుల పాటు చికిత్స అనంతరం ఆ బాలుడికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. నెగటివ్ రిపోర్టు వచ్చింది.

పూర్తిగా కోలుకున్న తర్వాత..ఆసుపత్రి నుంచి చిన్నారిని వైద్యులు డిశ్చార్జ్ చేశారు. 36 రోజుల బాలుడు కరోనాను జయించడంతో సంతోషం వ్యక్తమయింది. తల్లి బాలుడిని ఎత్తుకుని ఆసుపత్రికి బయటకు వస్తున్న వీడియోను మహారాష్ట్ర సీఎంఓ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో వేలాదిమంది లైక్ చేశారు. 

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

   2 hours ago


భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

   6 hours ago


మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

   8 hours ago


బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

   9 hours ago


భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

   9 hours ago


భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

   10 hours ago


దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

   04-08-2020


కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

   04-08-2020


రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

   04-08-2020


ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   03-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle