newssting
BITING NEWS :
*దేశంలో 19,06,520 పాజిటివ్, మరణాలు 39,820.. ఒక్కరోజే 51,189 కేసులు నమోదు *తెలంగాణ క్యాబినెట్ భేటీ..మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సమావేశం..కొత్త సచివాలయ నిర్మాణం,కరోనా వైరస్ వ్యాప్తి,నిరోధక చర్యలు, విద్యా వ్యవస్థ పునరుద్దరణ అంశాల పై చర్చించనున్న క్యాబినెట్ *తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2012 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 70,958కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాతో 576 మంది మృతి..50,814 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 19,568 కేసులు యాక్టివ్ *అయోధ్య‌లో రామమందిరం నిర్మాణానికి భూమిపూజ...సర్వం సిద్దం, 175 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం*మరో ప్రైవేటు ఆసుపత్రి మీద వేటు వేసిన వైద్యారోగ్య శాఖ..ఇక మీదట కోవిడ్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా బంజారాహిల్స్ విరించి హాస్పిటల్ కి నోటీసులు*ఏపీలో గ‌త 24 గంట‌ల్లో 9,747 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు..67 మంది మృతి, 176333కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, ఇప్ప‌టి వ‌ర‌కు 1604 మంది మృతి*పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల మీద ఏపీ హైకోర్టు స్టేటస్ కో..రిప్లై కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి ఆదేశం..విచారణ ఆగష్టు 14కు వాయిదా..యధాతధ స్థితి ఆగష్టు 14 వరకు కొనసాగుతుందన్న కోర్టు

కరోనా అనుమానితుడు ఆత్మహత్య.. రాజధానిలో సంచలనం

19-03-202019-03-2020 11:09:19 IST
Updated On 19-03-2020 11:30:50 ISTUpdated On 19-03-20202020-03-19T05:39:19.803Z19-03-2020 2020-03-19T04:29:42.466Z - 2020-03-19T06:00:50.951Z - 19-03-2020

కరోనా అనుమానితుడు ఆత్మహత్య.. రాజధానిలో సంచలనం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలను ముమ్మరం చేస్తున్న ప్రభుత్వాలకు తొలిసారిగా షాక్ తగిలింది. ప్రపంచం మొత్తంమీద అతి తక్కువ కరోనా మరణాలు నమోదయ్యాయని, 200 లోపు వ్యక్తులకు మాత్రమే కరోనా పాజిటివ్ బయటపడిందని దేశం సంతోషపడుతున్న సమయంలో అనుకోని ఘటన జరిగిపోయింది. కరోనా అనుమానితుడిని క్వారంటైన్ చేసిన తర్వాత ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం కలిగించింది. దీనికి దేశ రాజధాని వేదికైంది.

దేశంలో కరోనా వైరస్ రానురాను వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో ఢిల్లీలో సంచలనం రేకెత్తించే ఘటన చోటుచేసుకుంది. కరోనా అనుమానితుడొకరు ఎస్ఎస్బీ బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని తన్వీర్ సింగ్(35)గా పోలీసులు గుర్తించారు. 

మృతుడు పంజాబ్‌లోని షహీద్‌ భగత్‌సింగ్ నగర్ జిల్లాలోని సియానా గ్రామానికి చెందినవాడు. వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరాడు. ఆత్మహత్య సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే తన్వీర్ సింగ్ మృతదేహాన్ని ముట్టుకోవద్దని సీనియర్ వైద్యులు పోలీసులకు తెలిపారు. ముందుగా ఆ మృతదేహానికి వైద్య పరీక్షలు నిర్వహించాలని డాక్టర్లు భావిస్తున్నారు. 

నోడల్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం తన్వీర్ ఇటీవలే ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుంచి ఫ్లయిట్‌లో భారత్‌కు వచ్చాడు. తన్వీర్ ఏడాదిగా సిడ్నీలో ఉంటున్నాడు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వద్ద అతనికి స్క్రీనింగ్ చేసి, కరోనా అనుమానితునిగా గుర్తించి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న నేపధ్యంలోనే తన్వీర్ ఆత్మహత్య చేసుకున్నాడు.

కరోనా బాధితులకు సామాజిక ఒంటరితనం తప్పనిసరి చేస్తుండటంతో బాధితులు తట్టుకోలేకపోతున్నారని గతంలోనే వార్తలు వచ్చాయి. సమాజం బాధితుల పట్ల ప్రదర్శిస్తున్న వైఖరి కూడా ఇలాంటి అనూహ్య ఘటనలకు దారి తీయడం దురదృష్టకరం.

కరోనా బాధితులను నేరస్తుల్లాగా సమాజం ట్రీట్ చేస్తుండటం భవిష్యత్తులో మరిన్ని దుష్పరిణామాలకు దారి తీసే ప్రమాదముంది. ప్రభుత్వం ఈ కోణంలో కూడా బాధితులకు అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

   an hour ago


భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

   5 hours ago


మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

   7 hours ago


బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

   8 hours ago


భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

   8 hours ago


భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

   9 hours ago


దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

   a day ago


కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

   04-08-2020


రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

   04-08-2020


ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   03-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle