newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

కరోనాపై మాట మార్చలేదు వరుస మార్చానంతే.. ప్రధాని వివరణ

13-04-202013-04-2020 09:06:11 IST
Updated On 13-04-2020 10:05:01 ISTUpdated On 13-04-20202020-04-13T03:36:11.583Z13-04-2020 2020-04-13T03:36:03.054Z - 2020-04-13T04:35:01.072Z - 13-04-2020

 కరోనాపై మాట మార్చలేదు వరుస మార్చానంతే.. ప్రధాని వివరణ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రెండు వారాల పాటు లాక్ డౌన్ కొనసాగేసరికి ప్రజల ప్రాణాలను కాపాడే లక్ష్యానికి అభివృద్ధిని గాటనపెట్టడం కూడా తోడు చేసుకోకపోతే దేశం కుప్పకూలే ప్రమాదం పొంచి ఉందని ఆర్థిక నిపుణులు చేస్తున్న హెచ్చరికల నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ మాట మార్చలేదు కానీ వరుస మార్చారు. కరోనా వైరస్‌వ్యాప్తిపై పోరు మొదటి దశలో గత నెల చివరలో లాక్‌డౌన్‌ ప్రకటించినప్పుడు ప్రజల ప్రాణాలను కాపాడటమే ప్రభుత్వాల ప్రాథామ్యమని చెప్పామని, అయితే, ఇప్పుడు ప్రభుత్వాల లక్ష్యం ప్రాణాలను కాపాడటంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడటం కూడా అని ప్రధాని వ్యాఖ్యానించారు. 

మార్చి నెల చివరి వారం ‘లాక్‌డౌన్‌ ప్రకటిస్తున్న సమయంలో ప్రాణాలు ఉంటేనే అభివృద్ధి అన్నాను. ఇతర దేశాల అనుభవాలు కళ్లారా చూస్తూ ఏమాత్రం ఆలస్యం చేసినా ప్రజల ప్రాణాలకు గ్యారంటీ లేదనే ఆలోచనతోనే అప్పుడు ఆర్థిక అభివృద్ధికంటే ప్రాణాలను నిలబెట్టడమేనని పిలుపునిచ్చాను. ఆ రోజు  నా మాటలను అర్థం చేసుకున్న దేశప్రజలు లాక్‌డౌన్‌ నిబంధనలను అద్భుతంగా పాటించారు. ఇప్పుడు ప్రాణాలతో పాటు దేశాభివృద్ధిపైనా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది’ అని మోదీ వివరించారు.  

కోవిడ్ -19 ప్రభావం, పరిణమాలపై 13 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో శనివారం ప్రధాని వీడియో కాన్ఫరెన్స్  నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా  దేశ ప్రజలప్రాణాలను, ఆర్థిక వ్యవస్థను రక్షించాల్సిన అవసరాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నొక్కి చెప్పారు. దేశ ఉజ్వల భవిష్యత్తు దృష్ట్యా, ఆరోగ్యవంతమైన భారతం కోసం ప్రజల జీవితంతో పాటు దేశమూ ముఖ్యమేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఇప్పటి వరకు తీసుకున్న చర్యల ప్రభావాన్ని నిర్ణయించడానికి తదుపరి 3-4 వారాలు  చాలా కీలకమని  పేర్కొన్నారు. 

వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ తమ ప్రభుత్వం దష్టి ‘జాన్‌ హైతో జహాన్‌ హై’ నుంచి  ‘జాన్‌ బీ ఔర్‌ జహాన్‌ బీ’ పైకి దృష్టి మళ్లిందని ప్రకటించడం ప్రధానంగా పలువురి దష్టిని ఆకర్షించింది. ‘ప్రాణముంటే ప్రగతి అదే ఉంటుంది’ నుంచి ‘ప్రాణం ఉండాలి. ప్రగతీ ఉండాలి’ అన్నది ఆయన ప్రాస వ్యాక్యానికి అర్థం. 

‘మనం ఉంటేనే ప్రపంచం... అన్నది నిన్నటి మంత్ర,  మనము ఉండాలి, ప్రపంచం ఉండాలి... అనేది నేటి మంత్ర. ఇప్పటిదాకా తీసుకున్న చర్యల సత్ఫలితాలు కనిపించాలంటే, మరో మూడు నాలుగు వారాలు చాలా ముఖ్యం. వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా వినియోగదారుడికి అందేలా మార్కెటింగ్ చట్టాల్లో మార్పులు తీసుకురావాలి. ఆరోగ్య సేతు యాప్ ఇకనుంచి ట్రావెల్ ఈ పాస్ లాగా ఉపయోగపడుతుంది. డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది  పైన దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. దేశంలో సరిపోయినన్ని మందులు అందుబాటులో ఉన్నాయి. బ్లాక్ మార్కెటింగ్ చేసే వారిపై ఉక్కుపాదం మోపాలి’ అని ప్రధాని స్పష్టం చేశారు.

కరోనా కట్టడిలో  కేంద్రం, రాష్ట్రాలు సమన్వయంతో పని చేస్తున్నాయన్నారు. ఔషధాలు, నిత్యావసర వస్తువులు తగినన్ని అందుబాటులో ఉన్నాయని, వాటిని అక్రమంగా నిల్వ చేస్తే తీవ్ర చర్యలుంటాయని హెచ్చరించారు. కోవిడ్‌ 19కి చికిత్స లేనందున భౌతిక దూరం పాటించడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం తప్పని సరి అని ప్రధాని పేర్కొన్నారు. వ్యవసాయ మార్కెట్లలో రద్దీని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. దేశం అన్ని రంగాల్లో స్వయం సమృద్ధం కావడానికి ఈ సంక్షోభాన్ని ఉపయోగించుకోవాలన్నారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో శనివారం వీడియో కాన్ఫరెన్సులో సంభాషించిన ప్రధాని లాక్ డౌన్ కొనసాగింపుపై దాదాపు సీఎంలందరిలో ఏకాభిప్రాయం ఉందని తెలిపారు.

లాక్ డౌన్ కొనసాగింపు తప్పదు.. ప్రధాని హింట్

దేశంలో కరోనా రక్కసిని పూర్తిగా అంతమొందించేందుకు ఏప్రిల్‌ 14వ తేదీ తరువాత కూడా లాక్‌డౌన్‌ను కొనసాగించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈ మేరకు శనివారం ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిపిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టమైన సంకేతాలిచ్చారు. లాక్‌డౌన్‌ను కనీసం 2 వారాలైనా కొనసాగించేందుకు దాదాపు అన్ని రాష్ట్రాలు ఏకాభిప్రాయంతో ఉన్నట్లు స్పష్టమవుతోందని ప్రధాని పేర్కొన్నారు. కోవిడ్‌ –19పై పోరులో ముందుండి పోరాడుతున్న వైద్యులు, ఇతర శాఖల సిబ్బందికి వ్యక్తిగత రక్షణ పరికరాలను తగినన్ని అందుబాటులో ఉంచుతామని ప్రధాని సీఎంలకు వివరించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, హోంమంత్రి అమిత్‌ షా, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  కాగా లాక్‌డౌన్‌ కారణంగా కుదేలయిన రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలను ఆదుకునేందుకు, కోవిడ్‌–19పై పోరు కొనసాగించేందుకు కేంద్రం సాయం అందించాలని పలువురు సీఎంలు ప్రధానిని అభ్యర్థించారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని సంపూర్ణంగా అడ్డుకునేందుకు లాక్‌డౌన్‌ను కొనసాగించడమే అత్యుత్తమ, ఏకైక మార్గమని పంజాబ్, ఢిల్లీ ముఖ్యమంత్రులు అమరీందర్‌ సింగ్, అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రధానికి సూచించారు. ఏప్రిల్‌ ఆఖరు దాకా లాక్‌డౌన్‌ను కొనసాగించాలని వారు ప్రధానికి సూచించారు. 

పంజాబ్, ఒడిశా రాష్ట్రాలు ఇప్పటికే లాక్‌డౌన్‌ను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఇప్పటివరకు తీసుకున్న చర్యలు ఏ మేరకు ఫలితాలను ఇచ్చాయన్నది రానున్న 3, 4 వారాల్లో తేలుతుందని ప్రధాని వ్యాఖ్యానించారు. వైరస్‌ను పూర్తిగా రూపుమాపేందుకు రానున్న 3, 4 వారాలు అత్యంత కీలకమన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో మమతా బెనర్జీ (బెంగాల్‌), యోగి ఆదిత్యనాథ్‌(ఉత్తరప్రదేశ్‌), ఉద్ధవ్‌ ఠాక్రే(మహారాష్ట్ర), ఎంఎల్‌ ఖట్టర్‌(హరియాణా), నితీశ్‌కుమార్‌(బిహార్‌) తదితర రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. కొన్ని ఆంక్షల సడలింపుతో లాక్‌డౌన్‌ను కొనసాగించనున్నారన్న వార్తల నేపథ్యంలో శనివారం ఉదయం 11 గంటలకు ఈ వీడియో కాన్ఫరెన్స్‌ ప్రారంభమైంది.

ఏకాభిప్రాయం నీడలో కొన్ని రాష్ట్రాల భిన్నాభిప్రాయం

అయితే మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు వైరస్ ప్రబలుతున్న నగరాలు పట్టణాల్లో లాక్ డౌన్ కొనసాగిస్తూనే వైరస్ బారినపడని మిగిలిన ప్రాంతాల్లో అంచెలవారీగా లాక్ డౌన్ ఉపసంహరించవచ్చని కేంద్రప్రభుత్వానికి సూచిచాయి. దేశంలోనే ఈ వ్యాధి అధికంగా గల మహారాష్ట్ర ప్రభుత్వం ముంబయ్‌, పూనె వంటి అతిపెద్ద నగరాల్లో లాక్‌డౌన్‌ మరింత పటిష్టంగా అమలు చేస్తూనే రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో దీన్ని అంచెల వారీగా ఉపసంహరించొచ్చని కేంద్రానికి సూచించింది. 

ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌‌మోహన్ రెడ్డి ఏపీలోని స్వల్పంగా ఉన్న రెడ్, ఆరెంజ్ జోన్లను మినహాయించి మిగిలిన 595 గ్రీన్‌జోన్లలో లాక్‌డౌన్‌కు సడలింపునిస్తే వ్యవసాయం, పారిశ్రామిక రంగానికి ఊపిరి సలువుతుందని ప్రధానికి చెప్పారు.  కారణాలు ఏవైనప్పటికీ దేశంలో లాక్ డౌన్ కొనసాగింపుపై ఒక్కోచోట ఒక్కో అభిప్రాయం వ్యక్తమవుతుండటం గమనార్హం.

తాజావార్త: దేశవ్యాప్తంగా లాక్ డౌన్‌ని మరో రెండువారాలు కొనసాగించడానికి కేంద్రప్రభుత్వం నిర్ణయించుకుంది. ప్రధాని నరేంద్రమోదీ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో శనివారం వీడియో కాన్పరెన్సు జరిపిన తర్వాత ఎక్కువమంతి సీఎంల మనోగతాన్ని గ్రహించి లాక్ డౌన్ పొడిగింపు తప్పదని అవగాహనకు వచ్చారు. కరోనా వైరస్ దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ దశకు చేరుకుంటన్నట్లు వార్తల నేపథ్యంలో, తాజా కేసులు రోజురోజుకు అధికమవుతున్న తరుణంలో లాక్ డౌన్ ఎత్తివస్తే పర్యవసానాలు దారుణంగా ఉంటాయని వస్తున్న హెచ్చరికల నేపథ్యంలో కేంద్రం కూడా లాక్ డౌన్ పొడిగింపుకే నిర్ణయించినట్లు జాతీయ చానల్స్ శనివారం రాత్రి పేర్కొన్నాయి. 

కాగా ఒడిశా, పంజాబ్ రాష్ట్రాలు శుక్రవారమే ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించగా, తెలంగాణ ప్రభుత్వం శనివారం లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు పేర్కొంది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ, టీఆర్ఎస్, తృణమూల్ కాంగ్రెస్, కొన్ని కాంగ్రెస్ ప్రభుత్వాలు సైతం లాక్ డౌన్‌కు అనుకూలత ప్రకటించడంతో కేంద్రానికి వేరే మార్గం లేని పరిస్థితి ఏర్పడింది. ఇక అధికారికంగా లాక్ డౌన్ పొడిగింపు ప్రకటన రావడమే మిగిలింది.

 

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   5 hours ago


చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

   8 hours ago


అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

   21 hours ago


నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

   02-08-2020


అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

   02-08-2020


అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

   02-08-2020


కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

   01-08-2020


అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి..  తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి.. తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

   01-08-2020


కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

   01-08-2020


ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

   01-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle