newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

కరోనాపై పోరాటానికి భారత్‌కు అమెరికా సాయం

30-03-202030-03-2020 07:37:36 IST
Updated On 30-03-2020 09:00:29 ISTUpdated On 30-03-20202020-03-30T02:07:36.639Z30-03-2020 2020-03-30T02:07:30.263Z - 2020-03-30T03:30:29.272Z - 30-03-2020

కరోనాపై పోరాటానికి భారత్‌కు అమెరికా సాయం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విస్తరిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య, మరణాలు పెరుగుతున్నాయి. ఆదివారం నాటికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1024కు చేరుకుంది. ఇప్పటివరకు 27 మంది మృతిచెందారు. 96 మందికి నయం కావడంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. అత్యధికంగా మహారాష్ట్రలో 186, కేరళ‌లో 182 కేసులు నమోదయ్యాయి. అతి తక్కువగా మణిపూర్, మిజోరం, పుదుచ్చేరిల్లో ఒక్కో కేసు నమోదైంది. కేసుల పెరుగుదల దృష్ట్యా 21 రోజుల లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. లక్షల మంది వలస కార్మికులు ఆయా రాష్ట్రాల సరిహద్దులు దాటకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. రాష్ట్ర సరిహద్దులతోపాటు జిల్లాల సరిహద్దులను కూడా మూసివేయాలని ఆదేశించింది.

కరోనా వైరస్‌ను తరిమికొట్టేందుకు భారత్‌కు అగ్రరాజ్యం అమెరికా రూ. 21 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించింది. వైరస్‌పై పోరాటంలో భాగంగా 64 దేశాలకు అమెరికా అదనంగా మరో  174 మిలియన్‌ డాలర్ల నిధులు అందజేస్తున్నట్టు శనివారం  తెలిపింది. ఇందులో భాగంగా భారత్‌కు 2.9 మిలియన్ డాలర్లు (దాదాపు రూ 21 కోట్లు) కేటాయించింది. కరోనా కట్టడికి అగ్రరాజ్యం ఇప్పటికే  వంద మిలియన్ డాలర్ల ప్యాకేజీ ప్రకటించింది. తాజాగా మరింత కేటాయించింది.

కరోనాను ఎదుర్కొనేందుకు దేశ వైద్య రంగానికి ప్రధాని మోదీ రూ. 15వేల కోట్ల నిధులు ఇస్తున్నట్టు తెలిపారు. ఈ మొత్తాన్ని అదనపు ఐసోలేషన్ వార్డుల ఏర్పాటుకు, ఐసీయూ బెడ్స్, మెడికల్ బెడ్స్, మెడికల్, పారా మెడికల్ వైద్య సిబ్బంది కోసం ఖర్చు చేస్తామని తెలిపారు. మన్ కీ బాత్‌లో ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు పలు సూచనలు చేశారు. మీకోసం, మీకుటుంబంకోసం, మీ దేశంకోసం లాక్ డౌన్ లో పాల్గొనండి. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు నన్ను మన్నించండి. ఇంట్లోనే ఉండాలన్నారు.  ఎట్టి పరిస్థితులలోనూ లాక్ డౌన్ లక్ష్మణరేఖను దాటవద్దు. ప్రతి ఒక్కరూ ధైర్యం వీడకుండా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. వైరస్ కట్టడికి వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది చేస్తున్న కృషి అభినందనీయం అని, వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు.

ఇటు గూగుల్ తన ఔదార్యం చాటుకుంది. భారత్ కు గూగుల్ భారీ విరాళం ప్రకటించింది. కరోనా వ్యాప్తి నివారణ, సహాయచర్యల కోసం రూ.5,900 కోట్లు విరాళంగా ఇస్తున్నట్టు గూగుల్, దాని మాతృసంస్థ ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ ఓ ప్రకటనలో తెలిపారు. చిన్న, మధ్యతరహా వ్యాపారులకు ఈ విపత్కర పరిస్థితుల్లో చేయూతగా నిలిచేందుకు తమ విరాళం ఉపయోగపడుతుందని గూగుల్ తెలిపింది.

ప్రభుత్వాలు, ఆరోగ్య సంస్థలు, ప్రపంచవ్యాప్త ఆరోగ్య కార్యకర్తలకు తోడ్పాటుగా ఉంటుందని భావిస్తున్నట్టు సుందర్ పిచాయ్ పేర్కొన్నారు.  కాగా, గూగుల్ మాజిద్ గ్లోవ్స్ అండ్ సేఫ్టీ సంస్థతో కలిసి కరోనా నివారణ ఫేస్ మాస్కులు ఉత్పత్తి చేయనుంది. 20 లక్షల నుంచి 30 లక్షల మాస్కులు ఉత్పత్తి చేయనుంది. భారత్ లో గూగుల్ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం పాటిస్తున్నారు. 

 

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   5 hours ago


చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

   8 hours ago


అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

   21 hours ago


నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

   02-08-2020


అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

   02-08-2020


అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

   02-08-2020


కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

   01-08-2020


అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి..  తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి.. తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

   01-08-2020


కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

   01-08-2020


ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

   01-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle