newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

కరోనాపై చైనా విజయంతో చిగురిస్తున్న ఆశలు: డబ్ల్యుహెచ్‍ఓ

23-03-202023-03-2020 13:34:02 IST
2020-03-23T08:04:02.898Z23-03-2020 2020-03-23T08:03:58.507Z - - 11-08-2020

కరోనాపై చైనా విజయంతో చిగురిస్తున్న ఆశలు: డబ్ల్యుహెచ్‍ఓ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్‌పై చైనా సాధించిన విజయం యావత్ ప్రపంచానికి కొత్త ఆశల్ని తీసుకొస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. అయితే పాశ్చాత్య ప్రజాస్వామిక వ్యవస్థలకు చైనా పాలకవర్గ విధానాలు అనుసరించదగినవేనా అనే ప్రశ్న ఎదురవుతోంది. పైగా కరోనా వైరస్ అడ్డుకట్టపై చైనా ఇస్తున్న గణాంకాలు నమ్మశక్యమేనా అని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నప్పటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అడనోమ్ గెబ్రియెసస్ మాత్రం చైనా విజయం ప్రపంచానికి ఆశలు రేపుతోందని ప్రశంసించారు. చైనాలో కేంద్రప్రభుత్వ నియంత్రణలో, ఏక పార్టీ నిరంకుశత్వంలో అసమ్మతికి తావే లేకుండా ఒకే అంశంపై దేశవ్యాప్తంగా వనరులను కేంద్రీకరించడం సాధ్యపడింది కానీ ప్రజాస్వామిక దేశాల్లో అలాంటి కేంద్ర నియంత్రణ సాధ్యపడకపోవచ్చని అంచనా.

ఏది ఏమైనా ప్రస్తుతానికి మాత్రం కరోనాపై పోరాటంలో చైనా విజయం సాధించింది. దాదాపు మూడున్నర నెలల క్రితం వుహాన్‌లో తొలి కరోనా పాజిటివ్ కేసు వెలుగులోకి వచ్చిన తరువాత గత మూడు రోజులుగా వుహాన్‌లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని అధికారికంగా ప్రకటించే స్థితికి చేరుకుంది. శనివారం కొత్తగా 46 కేసులు నమోదయినట్టు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ వెల్లడించింది. గడచిన నాలుగు రోజులతో పోల్చితే కేసులు సంఖ్య పెరిగినా, బాధితుల్లో విదేశాల నుంచి వచ్చినవారే అధికంగా ఉన్నట్టు తెలిపింది. కొత్తగా వైరస్ బారినపడ్డ స్థానికుల సంఖ్య గణనీయంగా తగ్గినట్టు గత మూడు రోజులుగా వెల్లడించిన నివేదికల్లో చైనా తెలిపింది. 

శుక్రవారం 41 కేసులు నమోదు కాగా, వీరంతా విదేశాల నుంచి వచ్చిన చైనా పౌరులే. వుహాన్‌లో ఎటువంటి కొత్త కేసులు నమోదు కాలేదని.. ఇప్పటికే పాజిటివ్‌ ఉన్న వారిలో కూడా కొంత మంది కోలుకొని ఇళ్లకు వెళ్తున్నారని నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ ప్రకటించింది. చైనా అత్యంత కఠినమైన నిర్ణయాలతో ప్రజల కదలికలను కట్టడి చేస్తూ హుబై ప్రావిన్స్‌లో ఆర్థిక కార్యకలాపాలన్నింటికి చెక్‌ పెట్టి చైనా పాలకులు ఈ విజయం సాధించారు. ఉదాహరణకు, సామాజిక భద్రతా ఫీజులను, వినిమయ ఫీజులను రద్దు చేయడం, ఫిన్‌టెక్‌ సంస్థల ద్వారా వారికి రుణాలు అందించడం వంటి చర్యలు చైనా ప్రభుత్వం తీసుకుంది.

ఇదే సమయంలో చైనాలో కరోనా వైరస్ కారణంగా మరణించిన మృతుల సంఖ్య 3,270కు చేరిందని కమిషన్ పేర్కొంది. మొత్తం 81 వేల మందికి పైగా ఇన్ఫెక్షన్ సోకగా, 72,703 మంది డిశ్చార్జి కాగా.. ప్రస్తుతం 6,013 మందికి చికిత్స కొనసాగుతోందని పేర్కొంది. చైనాలో కరోనా చికిత్సలు అందించిన ఆసుపత్రులను సైతం మూసివేశారు. ఈ నెల 10న వూహాన్‌లో స్వయంగా పర్యటించిన అధ్యక్షుడు జిన్ పింగ్, వైరస్‌ను తాము జయించినట్టేనని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆపై హుబేయ్, వూహాన్ ప్రాంతాల్లో ఆంక్షల సడలింపు ప్రారంభం అయింది. సరిహద్దులను తిరిగి తెరిచి రాకపోకలకు అనుమతించారు.

ప్రావిన్స్ పరిధిలోని లోరిస్క్ ప్రాంతంలో ఉద్యోగాలు చేసుకునేందుకు, పనులకు వెళ్లేందుకు, ప్రజలు బయట తిరిగేందుకూ అనుమతించారు. ఇదే సమయంలో చైనాను మరో భయం కూడా వెన్నాడుతోంది. రెండో సారి కరోనా వ్యాపించే అవకాశాలు కూడా ఉండటమే ఇందుకు కారణం. చైనాకు సరాసరిన రోజుకు 20 వేల మంది వివిధ దేశాల నుంచి వస్తుంటారు. ఇదే చైనా పాలకులకు ఆందోళన కలిగిస్తోంది. బీజింగ్ సహా అన్ని విమానాశ్రయాలకు వస్తున్న అంతర్జాతీయ ప్రయాణికులంతా తప్పనిసరిగా 14 రోజుల క్వారంటైన్ కేంద్రాల్లో ఉండాలన్న ఆదేశాలు జారీ చేసి, అందుకోసం కొన్ని హోటల్స్‌ను క్వారంటైన్ కేంద్రాలుగా మార్చింది. 

ఇదిలావుండగా.. ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 3 లక్షలను దాటగా, మృతుల సంఖ్య 14,688కు చేరుకుంది. 171 దేశాలకు ఈ మహమ్మారి విస్తరించగా, చైనా తరువాత ఇటలీ, ఇరాన్ దేశాలపై పెను ప్రభావాన్ని చూపింది. చైనా గట్టున పడిపోగా, మిగతా దేశాలు ఆ స్థాయిలో ఆంక్షలను అమలు చేయలేకపోతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   4 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   4 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   7 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   15 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle