newssting
BITING NEWS :
*దేశంలో 19,06,520 పాజిటివ్, మరణాలు 39,820.. ఒక్కరోజే 51,189 కేసులు నమోదు *తెలంగాణ క్యాబినెట్ భేటీ..మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సమావేశం..కొత్త సచివాలయ నిర్మాణం,కరోనా వైరస్ వ్యాప్తి,నిరోధక చర్యలు, విద్యా వ్యవస్థ పునరుద్దరణ అంశాల పై చర్చించనున్న క్యాబినెట్ *తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2012 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 70,958కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాతో 576 మంది మృతి..50,814 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 19,568 కేసులు యాక్టివ్ *అయోధ్య‌లో రామమందిరం నిర్మాణానికి భూమిపూజ...సర్వం సిద్దం, 175 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం*మరో ప్రైవేటు ఆసుపత్రి మీద వేటు వేసిన వైద్యారోగ్య శాఖ..ఇక మీదట కోవిడ్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా బంజారాహిల్స్ విరించి హాస్పిటల్ కి నోటీసులు*ఏపీలో గ‌త 24 గంట‌ల్లో 9,747 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు..67 మంది మృతి, 176333కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, ఇప్ప‌టి వ‌ర‌కు 1604 మంది మృతి*పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల మీద ఏపీ హైకోర్టు స్టేటస్ కో..రిప్లై కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి ఆదేశం..విచారణ ఆగష్టు 14కు వాయిదా..యధాతధ స్థితి ఆగష్టు 14 వరకు కొనసాగుతుందన్న కోర్టు

కరోనాను కనిపెట్టిన వైద్యుడి మృతి.. నెటిజన్ల సంతాపం

07-02-202007-02-2020 14:30:05 IST
Updated On 07-02-2020 16:39:59 ISTUpdated On 07-02-20202020-02-07T09:00:05.698Z07-02-2020 2020-02-07T09:00:03.453Z - 2020-02-07T11:09:59.457Z - 07-02-2020

కరోనాను కనిపెట్టిన వైద్యుడి మృతి.. నెటిజన్ల సంతాపం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చైనాలోని వుహాన్ నగరం కరోనా కారణంగా బోసిపోయింది. వ్యాపార, వాణిజ్య, సాధారణ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. విషాదం ఏంటంటే..కరోనాని మొదట గుర్తించిన చైనా వైద్యుడు మృతి చెందాడు. చైనాలో కరోనా కాటేయబోతోందని, జాగ్రత్తగా వుండాలని తోటి వైద్యులను హెచ్చరించిన వుహాన్ లీ వెన్ లియాంగ్ అనే వైద్యుడు ఇక లేడు. ఇదే వైరస్ బారిన పడిన ఆ వైద్యుడు.. శుక్రవారం తెల్లవారుజామున ప్రాణాలు వదిలాడు.

చైనాతో పాటు ఫిలిప్పీన్స్ లో  ఈ వైరస్ బారిన పడి ఇప్పటికే దాదాపు 636 మందికి పైగా మృత్యువాత పడ్డారు. సీఫుడ్‌ మార్కెట్‌కు చెందిన ఏడుగురు వ్యక్తులు తమ ఆస్పత్రిలో చేరారని.. వారికి ప్రత్యేక పరీక్షలు చేయగా.. సార్స్ బారిన పడ్డారని తేలిందని లీ పేర్కొన్నారు. దేశంలో ఈ వైరస్‌ అత్యంత వేగంగా విస్తరించే ప్రమాదం ఉందంటూ లీ.. తన సోషల్ మీడియా గ్రూప్‌లలో గతేడాది డిసెంబర్ 30న పోస్ట్ చేశాడు. 

ఈ కరోనా వైరస్ అప్పటికి బయటకు రాలేదు. ఆయన హెచ్చరికలను పట్టించుకోలేదు. అలా చేసినందుకు ఈ వైద్యుడిని ఇబ్బందుల పాలు చేశారు. ఈవైద్యుడు కరోనా బారిన పడి.. జనవరి 12 నుంచి ఆస్పత్రిలోనే ఉన్నారు. విషయం అర్ధమయ్యాక.. కరోనా వైరస్ ప్రబలిందని తెలుసుకున్నారు అధికారులు. వెంటనే ఆయనకు క్షమాపణలు చెప్పారు. కానీ ఆ వైద్యుడే కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోవడంతో.. చైనీయులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. 

గురువారం 73 మంది చనిపోయారు. ఇప్పటి వరకూ 31 వేలమందికి వైరస్ సోకిందని అధికారులు చెబుతున్నారు. కొత్తగా 3143 కేసులు నమోదయ్యాయి. వ్యాధినుంచి కోలుకుని 1540 మంది ఆస్పత్రినుంచి డిశ్చార్జ్ అయ్యారు. చైనాలో వుంటున్న 19మంది విదేశీయులకు ఈ వైరస్ సోకింది. వారంతా ఏ దేశానికి చెందినవారో తెలియచేయలేదు. తాజాగా గురువారం మరో 1500 పడకల ఆస్పత్రి ప్రారంభం అయింది.

చైనా కు వెళ్ళి వచ్చేవారిపై అన్ని దేశాలు కన్నేశాయి. జపాన్ కి చెందిన యొకోహామా తీరానికి చేరిన నౌకలో ప్రయాణిస్తున్న వారికి కరోనా వైరస్ సోకింది. ఇందులో 41 మందికి వైరస్ లక్షణాలున్నాయి. నౌకలో 3వేలమందికి పైగా ప్రయాణిస్తున్నారు. ఇంతకుముందే 20 మందికి వైరస్ సోకింది. 

 

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

   2 hours ago


భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

   6 hours ago


మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

   8 hours ago


బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

   9 hours ago


భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

   9 hours ago


భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

   10 hours ago


దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

   04-08-2020


కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

   04-08-2020


రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

   04-08-2020


ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   03-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle