newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

కరోనాకు మించిన క్రూరత్వం.. మనిషి కాటుకు మూగజీవాల బలి

08-04-202008-04-2020 15:11:36 IST
Updated On 08-04-2020 15:19:04 ISTUpdated On 08-04-20202020-04-08T09:41:36.839Z08-04-2020 2020-04-08T09:41:34.167Z - 2020-04-08T09:49:04.315Z - 08-04-2020

కరోనాకు మించిన క్రూరత్వం.. మనిషి కాటుకు మూగజీవాల బలి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పెంపుడు జంతువు ఇంటి మనుషులను నమ్మితే ప్రాణమిస్తాయన్నది జగమెరిగిన సత్యం. కానీ మనుషుల మాటేంటి. కరోనా వైరస్ దెబ్బకు తమ ప్రాణాలు కాపాడుకుంటే చాలు అనే స్వార్థంతో దేశదేశాల ప్రజలు తమ పెంపుడు జంతువులు రోడ్లమీదకు విసిరివేసి వాటికి తిండీ నీడా లేకుండా చేసి వందల సంఖ్యలో వాటి చావుకు కారణమవుతున్నారు. పైగా జూలో ఉన్న జంతువులకు కూడా మనిషి ద్వారా కరోనా వైరస్ సోకడంతో జంతువుల మనుగడకు కూడా ప్రమాదం దాపురించనుంది. జంతు ప్రేమికులను తీవ్రంగా ఆవేదనకు గురిచేస్తున్న ఇలాటి దారుణ ఘటనలకు  పరిష్కారం మాత్రం ఎవరిచేతుల్లోనూ లేకపోవడం విచారకరం.

ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తన్న ప్రాణాంతక కరోనా వైరస్‌ ఇప్పుడు  మూగజీవాలను కూడా వదలడం లేదు. ఇప్పటికే హాంకాంగ్‌లో కుక్కలు, పెంపుడు పిల్లికి.. అమెరికాలోని జూలో ఉన్న ఓ పులికి మనిషి ద్వారా ఈ మహమ్మారి సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇక చైనాలోని వుహాన్‌లో కోవిడ్‌-19 ఆనవాళ్లు బయటపడ్డ తొలినాళ్లలో చాలా మంది చైనీయులు, ఇతర దేశాల ప్రజలు పెంపుడు జంతువులను రోడ్ల మీదకు విసిరివేసిన విషయం తెలిసిందే. 

ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న తరుణంలో చాలా దేశాలు లాక్‌డౌన్‌ విధించాయి. కేవలం నిత్యావసరాల కోసం మాత్రమే ప్రజలు రోడ్ల మీదకు వచ్చేందుకు ప్రభుత్వాలు అనుమితినిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌లోని పెట్‌ మార్కెట్లలో హృదయవిదారక దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. పంజరాల్లో బంధించిన పిల్లులు, కుక్కలు, కుందేళ్లు ఆకలితో అలమటించి చనిపోయి పడి ఉండటం జంతు ప్రేమికుల మనసులను ద్రవింపజేస్తున్నాయి. 

ఈ క్రమంలో రంగంలోకి దిగిన జంతు సంరక్షణా బృందాలు మిగిలిన జంతువులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయం గురించి ఆయేషా చంద్రిగర్‌ అనే సామాజిక కార్యకర్త మాట్లాడుతూ.. ‘‘మేం లోపలికి వెళ్లే సమయానికే దాదాపు 70 శాతం జంతువులు చనిపోయాయి. వాటి మృతదేహాలు కిందపడి ఉన్నాయి. పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. అసలు నేనేమీ మాట్లాడలేకపోతున్నాను’’ అంటూ ఉద్వేగానికి గురయ్యారు.

పాకిస్తాన్ లోని అతిపెద్ద నగరాలు లాక్ డౌన్ బారిన పడటంతో వందలాది పిల్లులు, కుక్కలు, కుందేళ్లు పోషణ కరువై వీధులపాలవటం జంతు ప్రేమికులను కలవరపెడుతోంది. కరోనా భయంతో జంతు మార్కెట్లను కూడా ఉన్నఫళాన మూసివేయడంతో తిండి, నీళ్లు పెట్టేవారు కూడా లేక వారాలతరబడి ఆకలిదప్పులకు గురై వందలాది పక్షులు, జంతువులు చనిపోయాయి. 

పాకిస్తాన్‌లో లాక్ డౌన్ ప్రకటించిన రెండు వారాల తర్వాత సామాజిక కార్యకర్త ఆయేషా చుండ్రిగర్ షాపుల్లో మగ్గిపోతున్న పక్షులు, జంతువుల ఆర్తనాదాలు విని పోయి చూస్తే వెయ్యి పైగా జంతువులు ఒకే చోట పడి ఉండటం కనిపించింది. వీటిలో మెజారిటీ అంటే 70 శాతం వరకు చనిపోగా మిగిలిన వాటిని కాపాడటానికి ఆమె వంటి వారు ప్రయత్నిస్తున్నారు.

బోనుల్లో వారాల తరబడి తిండి నీరు, వెలుతురు, గాలి లేని దుర్భర వాతావరణాన్ని తట్టుకోలేకే ఇన్ని వందలకొద్ది పక్షులు, జంతువులు చనిపోయాయని, షాపుల మూసివేతకు ఆదేశాలిచ్చిన అధికారులు ఇన్ని వేల జంతువులు అతీగతీ పట్టించుకోకుండా పోయారని సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. షాపుల ఓనర్లను వ్యాపారాలు చేయకుండా పాకిస్తాన్‌లో నిషేధించారు. దీంతో కొంతమంది రాత్రిపూట ఎవరూ చూడకుండా కొన్ని చోట్ల మూగజీవులకు తిండి, నీళ్లు పెట్టారు. కానీ వారి ప్రయత్నాలు వాటి ప్రాణాలు కాపాడేంత స్థాయిలో లేకపోవడంతో వందలసంఖ్యలో అవి ప్రాణాలు కోల్పోయాయి.

కరాచీలోని అతిపెద్ద ఎంప్రెస్ మార్కెట్లో ఇప్పటికీ బతికి ఉన్న జంతువులను కార్యకర్తలు చేరదీసి ప్రాణం పోస్తున్నరు. ఇది వెలుగులోకి వచ్చాకే కరాచీలో అధికారులు జంతు, పక్షి సంరక్షక కేంద్రాలను తెరిచి ఉంచటానికి అనుమతించారు. కాని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇక లాహోర్ వంటి పెద్దనగరాల్లో కూడా గాలీ, నీరు, తిండి దొరకని విషమ పరిస్థితుల్లో కుక్కలు, పిల్లులు, పక్షులు మృత్యువాత పడ్డాయి.

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   3 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   3 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   6 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   14 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle