newssting
BITING NEWS :
*ఢిల్లీలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఐదు రోజులుగా తగ్గుతున్న రికవరీ కేసులు, కొత్తగా 1,133 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య*మేఘాలయలో 18 మంది బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది సహా 23 మందికి కరోనా*కేరళ వర్షాలు: ఇడుక్కిలో 55 చేరిన మృతుల సంఖ్య*జగిత్యాల జిల్లా: ధర్మపురిలో కరోనా కలకలం... వివాహావేడుకలో పాల్గొన్న 16 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ*ఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం... ఆర్మీ ఆస్పత్రి హెల్త్‌ బులిటెన్‌ విడుదల... రక్త ప్రసరణ సవ్యంగానే సాగుతోంది.. వెంటిలేటర్‌పై చికిత్స*ప్రగతి భవన్ ముట్టడికి NSUi కార్యకర్తల యత్నం..పీపీఈ కిట్స్ తో ప్రగతి భవన్ ముందు ప్రత్యక్షం అయిన కార్యకర్తలు*నేడు వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్ *తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,897 క‌రోనా పాజిటివ్ కేసులు

కరోనాకు తోడుగా చైనాలో హంటా వైరస్.. బెంబేలెత్తుతున్న ప్రపంచం

25-03-202025-03-2020 12:12:40 IST
Updated On 25-03-2020 13:33:58 ISTUpdated On 25-03-20202020-03-25T06:42:40.803Z25-03-2020 2020-03-25T06:42:38.723Z - 2020-03-25T08:03:58.295Z - 25-03-2020

కరోనాకు తోడుగా చైనాలో హంటా వైరస్.. బెంబేలెత్తుతున్న ప్రపంచం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇప్పుడిప్పుడే కరోనా వైరస్ ఉత్పాతం నుంచి బయటపడుతున్న చైనా మరో చావువార్తను ప్రపంచంమీదికి వదిలింది. గంటల వ్యవధిలోనే మనిషిని అమాంతంగా చంపేస్తున్న మరో ప్రమాదకర వైరస్ తమ దేశంలోని యువాన్ ప్రావిన్స్‌లో బయటపడిందని చైనా పేర్కొనడం ప్రపంచాన్ని కంపింపజేస్తోంది. పైగా మరో 32 మందికి శరవేగంగా ఈ వైరస్ పాకినట్లు వార్తలు వస్తున్నాయి.

మహమ్మారి కోవిడ్-19ను సమర్థవంతంగా ఎదుర్కోలేక, వ్యాక్సిన్‌ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలియక ప్రపంచ మానవాళి బెంబేలెత్తుతోంది. ఈ తరుణంలో చైనాలో మరో ప్రాణాంతక వైరస్‌ బయటపడినట్టు ఓ మీడియా రిపోర్టు వెల్లడించింది. హంటా వైరస్‌గా పిలవబడే ఈ వైరస్‌ బారిన పడి చైనాలోని యునాన్‌ ప్రావిన్స్‌లో ఓ వ్యక్తి సోమవారం ప్రాణాలు విడిచాడని గ్లోబల్‌ టైమ్స్‌‍ మీడియా సంస్థ పేర్కొంది. హంటా వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయిన కొన్ని గంటల వ్యవధిలోనే అతను చనిపోవడం కలకలం రేపుతోంది.

ఈ వార్తను చేరవేసిన గ్లోబల్‌ టైమ్స్‌ పత్రిక ప్రకారం.. చైనాలోని యువాన్ ప్రావిన్సులో  ఓ వ్యక్తికి హంటా వైరస్‌ లక్షణాలు బయటపడటంతో నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించారు. అతనికి హంటా వైరస్‌ పాజిటివ్‌గా సోమవారం నిర్ధారణ అయింది. అయితే, అతడు పని నిమిత్తం షాండాంగ్‌ ప్రావిన్స్‌కు చార్టర్డ్‌ బస్సులో పయనమవ్వగా దారిలోనే ప్రాణాలు విడిచాడు. ఇంకో షాకింగ్‌ విషయమేంటంటే.. మరో 32 మంది కూడా ఇదే వైరస్‌ బారిన పడినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, అయితే, వారి రిపోర్టులు రావాల్సి ఉంది.

కాగా, సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన ఈ వార్త ప్రజల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో చైనాలోని ‘వ్యాధుల నియంత్రణ, నివారణ సెంటర్‌’ హంటా వైరస్‌కు సంబంధించిన పలు వివరాలు తెలిపింది. 

‘హంటా వైరస్‌ ఎలుకల ద్వారా మనుషులకు వ్యాపించే వ్యాధి. ఇంట్లో, పరిసరాల్లో ఎలుకలు లేకుండా చూసుకుంటే మంచిది. ఆరోగ్యవంతులకు కూడా ఈ వైరస్‌ సోకితే ప్రమాదమే. అయితే, ఇది అంటువ్యాధి కాదు. మనుషుల నుంచి మనుషులకు వ్యాపించదు. కేవలం ఎలుకల లాలాజలం, వాటి గూళ్లు, ఎలుకల వ్యర్థాలు తాకినపుపడు వైరస్‌ మన చేతుల్లోకి చేరుతుంది. క్రిములు చేరిన చేతులతో సదరు వ్యక్తి కళ్లు, ముక్కు నోటిని తాకితే వైరస్‌ ఒంట్లోకి ప్రవేశిస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు కూడా కోవిడ్‌-19 మాదిరిగానే ఉంటాయి. జ్వరం, తలనొప్పి, కడుపునొప్పి, కండరాల నొప్పి, వాంతులు, డయేరియా.. ఊపిరితీసుకోవడంలో ఇబ్బంది.’

అయితే హంటా వైరస్ ప్రపంచ స్థాయిలో ప్రజారోగ్యానికి ప్రమాదకరం కాకపోవచ్చని అమెరికాకు చెందిన వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం (సీడీసీ) తెలుపుతోంది. ప్రధానంగా ఎలుకల మూత్రం, మలంతో సంపర్కం కారణంగా హంటా వైరస్ వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఇవి అమెరికాలో అరుదుగా మాత్రమే ప్రభావం చూపుతాయని సీడీసీ సంస్థ పేర్కొంది. ప్రధానంగా ఇది మనిషి నుంచి మనిషికి వ్యాప్తి చెందదు కాబట్టి వైరస్ విస్తరించే అవకాశం ఉండదని నిపుణులు చెబుతున్నారు.

కానీ ఇప్పటికే కరోనా వైరస్‌తో బెంబేలెత్తిపోయి గజగజలాడుతున్న అమెరకన్లు చైనాలో మరో వైరస్ హంటా రూపంలో బయటపడిందని వార్తలు రాగానే భీతిల్లిపోతున్నారు.

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

   5 hours ago


రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

   13 hours ago


ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

   14 hours ago


మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   11-08-2020


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   11-08-2020


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   11-08-2020


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   11-08-2020


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle