newssting
BITING NEWS :
*దేశంలో 20 లక్షల 25 వేల 409 కేసులు.. మరణాలు 41,638*విశాఖ: నేటి నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు వ్యాలీలో సంపూర్ణ లాక్డౌన్.వ్యాపార,వర్తక సంఘాలు నిర్ణయం.మూతపడనున్న ప్రైవేట్ హోటళ్లు*కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మంత్రి కేటీఆర్ లేఖ‌.. వాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల విషయంలో మరింత వికేంద్రీకరణ అవ‌స‌రం.. కోవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి-కేటీఆర్*అనంతపురం : తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద జైలు నుంచి బెయిలుపై విడుదలైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు... కాన్వాయ్ కు అనుమతి లేదంటూ అడ్డగించిన పోలీసులు.. వాగ్వాదం*తూర్పుగోదావరి : అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటీవ్.. హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి*నటుడు సుశాంత్ మరణంపై సిబిఐ కేసు నమోదు.. ప్రియురాలు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు*మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన బిజెపి ఏపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు... ఎపి బిజెపి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు అభినందనలు తెలిపిన చిరంజీవి*రామలింగారెడ్డి భార్యకే ఉపఎన్నికలో టికెట్ ఇవ్వాలి.. ఆమెకు టికెట్ ఇస్తేనే ఆయనకు నిజమైన నివాళి.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్‌తో నేను మాట్లాడతా-జ‌గ్గారెడ్డి*నల్లగొండ జిల్లా: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమా నిలిపివేయాలంటూ అమృత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈనెల 11కు వాయిదా వేసిన కోర్టు*విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు*తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,092 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 73,050కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

ఒక్క రోజే పదివేలకు చేరువలో కరోనా కేసులు.. 24 గంటల్లో 273 మరణాలు

06-06-202006-06-2020 10:01:18 IST
Updated On 06-06-2020 10:52:41 ISTUpdated On 06-06-20202020-06-06T04:31:18.826Z06-06-2020 2020-06-06T04:31:16.817Z - 2020-06-06T05:22:41.695Z - 06-06-2020

ఒక్క రోజే పదివేలకు చేరువలో కరోనా కేసులు.. 24 గంటల్లో 273 మరణాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కేసులు, మరణాల్లో కొత్త రికార్డులు

10 వేల పాజిటివ్స్ క్లబ్బులో భారత్

దేశంలో ఒక్క రోజే 9,851 కేసులు

24 గంటల్లో రికార్డు స్థాయిలో 273 మరణాలు

ఒక్క రోజు గణాంకాల్లో ఇవే అత్యధికం

80 వేలకు చేరిన మహారాష్ట్ర కేసులు

తమిళనాడులో కొత్తగా 1500 కేసులు

ఢిల్లీ ఎయిమ్స్‌లో 500 మందికి వైరస్‌!

మొత్తం మృతుల సంఖ్య 6,348

రోజురోజుకూ దేశంలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు రికార్డులను బద్దలు కొడుతున్నాయి. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించడంతో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. శుక్రవారం ఉదయం 8 గంటలకు గడచిన 24 గంటల్లో 9,851 కేసులు, 273 మరణాలు నమోదు కావడం ఆందోళన పెంచుతోంది. శుక్రవారం నాటికి దేశ వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 26 వేల 770కు చేరుకోగా, మృతుల సంఖ్య 6,348కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కోవిడ్‌–19 కేసుల్లో ప్రపంచ దేశాల్లో భారత్‌ ఏడో స్థానంలో ఉంది. అమెరికా, బ్రెజిల్, రష్యా, బ్రిటన్, స్పెయిన్, ఇటలీ తర్వాత స్థానం భారత్‌దే. 

కాగా, జూన్‌ 8 నుంచి ప్రార్థనామందిరాలు, మాల్స్‌ వంటి వాటిని ప్రారంభిస్తూ ఉండడంతో కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. కేసులు ఇదే స్థాయిలో పెరిగితే త్వరలోనే ఇటలీని దాటిపోనుంది. ఇక కోవిడ్‌ రోగుల రికవరీ రేటు 48.27 శాతంగా ఉంది. అత్యధిక కేసుల్లో మహారాష్ట్ర (77,793), తమిళనాడు (27,256), ఢిల్లీ (25,004) మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. మహారాష్ట్రలో ఇప్పటివరకు 2,710 మంది ప్రాణాలు కోల్పోగా ఆ తర్వాత గుజరాత్‌ (1,155), ఢిల్లీ (650) ఉన్నాయి. కేసులు, మరణాల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో రోజువారీ కేసులు పెరుగుతూ ప్రభుత్వాలకు గుబులు రేపుతున్నాయి.

దేశంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడానికి అవసరమైన ల్యాబ్‌ల సంఖ్యను 727కు పెంచినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో 1,43,661 మందికి పరీక్షలు చేశామని వివరించింది. వైరస్‌ తీవ్రంగా ఉన్న మహారాష్ట్రలో కేసులు 80 వేలను మించాయి. కర్ణాటకలో  ఒకే రోజు 515 కేసులు నమోదయ్యాయి. వీరిలో 482 మంది వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినవారు. మహారాష్ట్ర నుంచి వచ్చినవారే 473 మంది ఉన్నారు. తమిళనాడులో శుక్రవారం 1,438 కేసులు రికార్డవగా.. ఇందులో చెన్నైవే 1,116 ఉండటం గమనార్హం. 

దేశంలో కోవిడ్‌ కేసులు అధికంగా నమోదవుతున్నా మృతుల రేటు ఇప్పటి దాకా తక్కువగా ఉండటం ఇన్నాళ్లూ కాస్త ఉపశమనం కలిగించేది. కానీ ఇప్పుడు మరణాలు కూడా పెరిగిపోతున్నాయి. కరోనా వైరస్‌ తొలి మరణం మన దేశంలో మార్చి 12న సంభవించింది. ఆ తర్వాత మృతుల సంఖ్య వెయ్యికి చేరుకోవడానికి 47 రోజులు పట్టింది. కానీ ఇప్పుడు నాలుగు రోజుల్లోనే 900 పైగా మరణాల సంఖ్య నమోదు కావడం గమనార్హం. కోలుకున్నవారి శాతం 48.2 శాతంగా తేలింది. 

దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల్లో కొత్త రికార్డులు నమోదయ్యాయి.  24 గంటల్లో 9,851 మందికి వైరస్‌ సోకిందని, 273 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. ఒక్క రోజు గణాంకాల్లో ఇవే అత్యధికం. 

ఎయిమ్స్‌ను కరోనా వణికిస్తోంది. 19 మంది వైద్యులు, 38 మంది నర్సులు సహా దాదాపు 500 మంది సిబ్బంది వైరస్‌ బారినపడ్డారు. రక్షణ చర్యలు సరిగా లేవంటూ మూడు రోజులుగా నర్సుల సంఘం నిరసన వ్యక్తం చేస్తోంది. ఐదుగురు ఉద్యోగులు వైరస్‌కు గురవడంతో కేంద్ర ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయం నిర్మాణ భవన్‌లో శని, ఆదివారాల్లో శుద్ధి చేపట్టనున్నారు. 

రికార్డు స్థాయిలో కరోనా కేసులు, మరణాలు పెరుగుతున్నప్పటికీ కరోనా విస్తరణలో భారత్ ఇంకా పతాక దశకు చేరుకోలేదని భారత వైద్యపరిశోధనా మండలి సైంటిస్టు నివేదితా గుప్తా పేర్కొన్నారు. వైరస్‍‌ నిరోధానికి మనం చేపట్టిన ముందు జాగ్రత్త చర్యలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని, అందుకే కరోనా వ్యాప్తి విషయంలో ఇతరదేశాలతో పోలిస్తే మనం ఎంతో మెరుగైన స్థితిలో ఉన్నామని ఆమె తెలిపారు.

షాంపిగ్ మాల్స్,  రెస్టారెంట్లు, హోటల్స్, ఆధ్యాత్మిక స్థలాల విషయంలో లాక్ డౌన్ ఎత్తివేస్తూ కేంద్రప్రభుత్వం గురువారం కొత్త నిబంధనలు ప్రకటించింది. మాల్స్‌లో జనం గుమికూడకుండా కట్టడి చేయాలని, హోటళ్లు, రెస్టారెంట్లలో 50 శాతం సీటింగ్ సామర్థ్యాన్ని అమలు చేయాలని కేంద్రం షరతులు విధించింది. వచ్చే సోమవారం నుంచి అంటే జూన్ 7 నుంచి లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేయడానికి రంగం సిద్దమైంది. కంటైన్మెంట్ జోన్లలో తప్ప మిగతా అన్ని ప్రాంతాలలో ఆర్థిక కార్యకలాపాలకు గేట్లు తెరిచివేస్తున్నారు.

లాక్ డౌన్ ప్రకటించిన 75 రోజుల తర్వాత లాక్ డౌన్ నిబంధనలు ఎత్తివేయనుండటంతో దేశం కరోనా వ్యాప్తికి సంబంధించి కొత్త పరీక్షను ఎదుర్కోనుంది.

 

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

   an hour ago


దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

   4 hours ago


కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

   4 hours ago


ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

   5 hours ago


మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

   06-08-2020


కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

   06-08-2020


యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

   06-08-2020


కరోనా రోగులకు గుడ్ న్యూస్.. సన్ ఫార్మా ట్యాబ్లెట్ @Rs 35

కరోనా రోగులకు గుడ్ న్యూస్.. సన్ ఫార్మా ట్యాబ్లెట్ @Rs 35

   05-08-2020


మొన్న నేపాల్.. నిన్న పాకిస్తాన్.. భారత్ మ్యాప్‌నే మార్చేశాయి

మొన్న నేపాల్.. నిన్న పాకిస్తాన్.. భారత్ మ్యాప్‌నే మార్చేశాయి

   05-08-2020


మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

   05-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle